Home
How to

కంప్యూటర్ రామ్ సమస్యలు తెలుసుకోవడం ఎలా ?

విండోస్ లో డీఫాల్ట్ గా ఉన్న Windows Memory Diagnostic టూల్ వినియోగించి కింది పద్దతులను అనుసరించడం ద్వారా రామ్ సమస్యలను తెలుసుకోవచ్చు.

By Chaitanyakumar Ark

కంప్యూటర్ లో ఏదైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, అనగా పనితీరు మందగించడం, బూటింగ్ టైం ఎక్కువ తీసుకోవడం వంటి సమస్యలు కనిపించినప్పుడు, అనుమానం రామ్(మెమరీ) మీదకే వెళుతుంది. వెంటనే వేరే ఇతర సాఫ్ట్వేర్లను డౌన్లోడ్ చేసి సమస్యను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం వలన చాలా సమయం వృధా అవుతుంది. కానీ వేరే ఇతర థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లను వినియోగించకుండా ఖచ్చితత్వం తో కూడిన result తో సమస్యను కనుక్కోవచ్చు. Windows Memory Diagnostic టూల్ ఉపయోగించి అలాగే ఇంకొన్ని రకాల టూల్స్ ఉపయోగించి మీరు మీ ర్యామ్ సమస్యలను తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

స్టెప్ 1:

స్టెప్ 1:

విండోస్ లో డీఫాల్ట్ గా ఉన్న Windows Memory Diagnostic టూల్ వినియోగించి కింది పద్దతులను అనుసరించడం ద్వారా రామ్ సమస్యలను తెలుసుకోవచ్చు.
స్టెప్ 1: ముందుగా స్టార్ట్ బటన్ ను క్లిక్ చేసి సెర్చ్ లో "Windows Memory Diagnostic" అని టైప్ చేసి ఎంటర్ చెయ్యండి. లేదా windows+R బట్టన్ క్లిక్ చేసి RUN డైలాగ్ బాక్స్ లో mdsched.exe అని టైప్ చేసి ఎంటర్ చెయ్యండి.

 

 

 స్టెప్ 2:

స్టెప్ 2:

ఇప్పుడు వచ్చిన డైలాగ్ బాక్స్ లో "restart now and check for problems (recommended)" పైన క్లిక్ చేసి restart చెయ్యాలి. ఈ మెమరీ టెస్ట్ జరుగునప్పుడు మీరు ఏ ఇతర పనులను చెయ్యలేరు. ఇది మర్చిపోవద్దు. రీబూట్ అయిన సిస్టం "windows memory diagnostic" టూల్ లోకి వెళ్ళాక ఆటోమేటిక్ గా memory diagnostic tool రన్ అవుతుంది. లేదా మద్యలో F1 కీ ప్రెస్ చెయ్యడం ద్వారా basic, standard, extended ఆప్షన్స్ చూపెడుతుంది. ఇక్కడ మీరు tab ద్వారా సెలెక్ట్ చేసుకుని F10 అప్లై చెయ్యడం ద్వారా దానిని అనుసరించి టెస్ట్ జరుగుతుంది. ఇది ఆప్షనల్ మాత్రమే. అవసరం లేదు అనుకుంటే F1 క్లిక్ చెయ్యనవసరం లేదు. డీఫాల్ట్ గా బేసిక్ తీసుకుని memory Diagnostic tool రన్ అవుతుంది. ఇది పూర్తి అవడానికి కొన్ని నిమిషాల వ్యవధి తీసుకుంటుంది.

టెస్ట్ జరుగునప్పుడు

టెస్ట్ జరుగునప్పుడు

టెస్ట్ జరుగునప్పుడు ప్రోగ్రెస్ బార్ లో పనితీరును గమనించవచ్చు. పరీక్ష పూర్తి అయిన తర్వాత result ను windows పై స్టేటస్ మెసేజ్ రూపం లో చూపెడుతుంది. ఈ పని జరుగునంత వరకు సిస్టంముందే ఉండవలసిన అవసరం లేదు. బ్రేక్ తీసుకోవచ్చు.

 

 

 

 టెస్ట్ పూర్తి అయిన తర్వాత

టెస్ట్ పూర్తి అయిన తర్వాత

టెస్ట్ పూర్తి అయిన తర్వాత pc దానికదే రీస్టార్ట్ అయి మెయిన్ స్క్రీన్ దగ్గరకు తీసుకుని వస్తుంది. టెస్ట్ రిసల్ట్ మీరు చూడకపోయినా స్టేటస్ లో కనపడకపోయినా windows బట్టన్ క్లిక్ చేసి సెర్చ్ లో Event Viewer టైప్ చేసి అప్లికేషన్ ని ఓపెన్ చేసాక windows logs లో system లో find దగ్గర memory diagnostic అని టైపు చేయడం ద్వారా టెస్ట్ రిసల్ట్ ను చూడవచ్చు.

 

 

Best Mobiles in India

English summary
How to check your computer’s RAM for issues? More News at Gizbot Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X