Home
How to

EPF బ్యాలెన్స్‌ వివరాలను సులభంగా తెలుసుకునే మార్గాలు ఇవే....

ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్ లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ప్రజలు తమకు కావలసిన ప్రతి ఒక్క దానికి కూడా ఆన్‌లైన్ మీద ఆధారపడుతున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన ఆన్‌లైన్ సేవలను ఎనేబుల్ చేసినందున మీరు ఇప్పుడు మీ యొక్క ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌ను ఆన్‌లైన్‌ ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు. మీ యొక్క PF బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడానికి సులభమైన నాలుగు మార్గాలు ఉన్నాయి. మీరు PF ఫండ్‌లో ఎంత డబ్బు సంపాదించారో వంటి విషయాలను మీరు ఇంటి వద్ద ఉండి కూడా తెలుసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

EPF బ్యాలెన్స్‌ను సులభంగా తెలుసుకునే మార్గాలు

EPF బ్యాలెన్స్‌ను సులభంగా తెలుసుకునే మార్గాలు

మీరు రిజిస్టర్డ్ EPFO చందాదారుడిగా ఉన్నంత వరకు మొబైల్ యాప్ ద్వారా మరియు EPFO వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా మరియు SMS, మిస్డ్ కాల్ పంపడం ద్వారా మీ తాజా ప్రావిడెంట్ ఫండ్ (PF) యొక్క జమలు మరియు మీ బ్యాలెన్స్‌ను మీరు తనిఖీ చేయవచ్చు. మీకు అవసరమైతే మీ EPF స్టేట్‌మెంట్‌లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

EPFO వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా PF బ్యాలెన్స్‌ తెలుసుకోవడం

EPFO వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా PF బ్యాలెన్స్‌ తెలుసుకోవడం

*** రిజిస్టర్డ్ సభ్యునిగా మీరు EPFO వెబ్‌సైట్‌కి వెళ్లి మీ యొక్క UAN నెంబర్ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వవచ్చు.

*** మొదటగా మీ యొక్క UAN నెంబర్ యాక్టీవ్ అయ్యిందని మీరు నిర్ధారించుకోవాలి. UAN నెంబర్ అనేది EPFO ద్వారా అందించబడుతుంది. అయితే దీనిని యజమాని ధృవీకరించాలి మరియు యాక్టీవేషన్ చేయాలి.

*** ఒక్కసారి మీరు లాగిన్ అయిన తర్వాత మీ పాస్‌బుక్ బ్యాలెన్స్‌ను మీ స్క్రీన్‌పై చూడగలుగుతారు.

 

ఉమాంగ్ యాప్ ను ఉపయోగించి PF బ్యాలెన్స్‌ తెలుసుకోవడం

ఉమాంగ్ యాప్ ను ఉపయోగించి PF బ్యాలెన్స్‌ తెలుసుకోవడం

*** ఉమాంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్ ) యాప్ భారతీయ పౌరులకు అన్ని రకాల భారతీయ ఇ-గవర్నెన్స్ సేవలను పొందటానికి అనుకూలమైన వేదికగా ఉంది.

*** మొదట మీ యొక్క మొబైల్ లో ఉమాంగ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసి ఇంస్టాల్ చేసిన తరువాత EPFO ఎంపికపై క్లిక్ చేయండి.

*** ‘ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్' మీద క్లిక్ చేయండి. తరువాత ‘వ్యూ పాస్‌బుక్' ఎంపికను ఎంచుకోండి.

*** మీ బ్యాలెన్స్ చూడటానికి మీ UAN తో లాగిన్ అవ్వండి.

 

మిస్డ్ కాల్ పద్దతిలో PF బ్యాలెన్స్‌ తెలుసుకోవడం

మిస్డ్ కాల్ పద్దతిలో PF బ్యాలెన్స్‌ తెలుసుకోవడం

*** రిజిస్టర్డ్ సభ్యులు తమ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా అతి సులభంగా తమ యొక్క PF బ్యాలెన్స్ ను తనిఖీ చేయవచ్చు.

*** దీని కోసం మీరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ పాన్ నెంబర్ లేదా మీ ఆధార్ నంబర్ కు UAN కి KYC చేయవలసి ఉంటుంది.

*** ఈ కాల్ కోసం మీకు ఎటువంటి అదనపు ఛార్జీలు విధించబడవు. రెండు రింగుల తర్వాత కాల్ స్వయంచాలకంగా కట్ చేయబడుతుంది.

*** ఇలా చేయడం ద్వారా మీ EPF వివరాలు మీకు SMS రూపంలో పంపబడతాయి.

 

Best Mobiles in India

English summary
How to Check your PF Account Balance in Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X