సరైన వీఆర్ హెడ్‌సెట్‌ను ఎంపిక చేసుకోవటం ఎలా..?

వర్చువల్ రియాల్టీ లేదా వీఆర్ హెడ్‌సెట్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత వీడియో కంటెంట్‌ను సరికొత్త అనుభూతులతో స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఆస్వాదించగలుగుతున్నారు.

|

వర్చువల్ రియాల్టీ లేదా వీఆర్ హెడ్‌సెట్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత వీడియో కంటెంట్‌ను సరికొత్త అనుభూతులతో స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఆస్వాదించగలుగుతున్నారు. గతకొంత కాలంగా నడుస్తోన్న ట్రెండ్‌ను మనం అంచనా వేసినట్లయితే ఆధునిక స్మార్ట్‌ఫోన్ యూజర్లు వీఆర్ హెడ్‌సెట్‌లను అమితంగా ఇష్టపడుతున్నారు. ఆధునిక టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌లతో కూడిన వీఆర్ హెడ్‌సెట్‌లను హెచ్‌టీసీ, ఓకులస్, సోనీ, గూగుల్, సామ్‌సంగ్, షావోమి, లెనోవో వంటి ప్రముఖ బ్రాండ్‌లు మార్కెట్లో ఆఫర్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా మార్కెట్లో లభ్యమవుతోన్న రకరకాల హెడ్‌సెట్స్ ఇంకా వాటి మధ్య వ్యత్యాసాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.

 

స్టాండ్‌ఎలోన్ VS టితర్డ్ (Standalone VS Tethered)

స్టాండ్‌ఎలోన్ VS టితర్డ్ (Standalone VS Tethered)

ప్రస్తుత ట్రెండ్‌ను మనం పరిశీలించినట్లయితే మార్కెట్లో రెండురకాల హెడ్‌సెట్స్‌కు ప్రధానమైన డిమాండ్ నెలకుంది. వీటిలో మొదటి మోడల్ వచ్చేసరికి Standalone. రెండవ రకం వచ్చేసరికి Tethered. స్టాండ్‌ఎలోన్ హెడ్‌సెట్స్ కంటెంట్‌ను వీక్షించే సమయంలో టితర్డ్ ఇంకా ఫోన్ బేసిడ్ హ్యాండ్‌సెట్స్‌తో పోలిస్తే మరింత సౌకర్యంగా అనిపిస్తాయి వీటికి అదనపు హార్డ్‌‌వేర్ అవసరం ఉండదు.

టితర్డ్ హెడ్‌సెట్స్ విషయానికి వచ్చేసరికి..

టితర్డ్ హెడ్‌సెట్స్ విషయానికి వచ్చేసరికి..

ఇక టితర్డ్ హెడ్‌సెట్స్ విషయానికి వచ్చేసరికి, ఇవి ఫిజికల్‌గా కంప్యూటర్‌కు కనెక్ట్ అయి ఉంటాయి. వైర్ల సహాయంతో కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ రకం వీఆర్ హెడ్‌సెట్‌లలో నిక్షిప్తం చేసే ఎక్స్‌టర్నల్ కెమెరా, బిల్ట్ ఇన్‌మోషన్ సెన్సార్స్ అడ్వాన్సుడ్ వీఆర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేయగలుగుతాయి. స్టాండ్‌ఎలోన్ హెడ్‌సెట్‌లతో పోలిస్తే టితర్డ్ హెడ్‌సెట్‌లు చాలా ఖరీదైనవి. వీటిని గేమింగ్ విభాగంలో ఎక్కువుగా వినియోగిస్తుంటారు.

వీఆర్ హెడ్‌సెట్‌ డిజైన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది..
 

వీఆర్ హెడ్‌సెట్‌ డిజైన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది..

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి రకరకాల మోడల్స్‌లో వీఆర్ హెడ్‌సెట్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాస్తవానికి వీఆర్ హెడ్‌సెట్‌ అనేది ఎంత కంఫర్ట్‌గా ఉంటే అంత బాగుంటుంది. తక్కువ బరువుతో వచ్చే వీఆర్ హెడ్‌సెట్‌‌లను గంటల తరబడి వినియోగించుకునే వీలుంటుంది. ఎక్కువ బరువుతో వచ్చే వీఆర్ హెడ్‌సెట్‌‌లు ఇబ్బందులకు గురిచేయటంతో పాటు ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

 

 

 

డిస్‌ప్లే పరంగా..

డిస్‌ప్లే పరంగా..

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి హైక్వాలిటీ డిస్‌ప్లేలతో వచ్చే వీఆర్ హెడ్‌సెట్స్ బెస్ట్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేయగలుగుతాయి. హెడ్‌సెట్‌‌లను ఎంపిక చేసుకునే సమయంలో ఇంటిగ్రేటెడ్ డిస్‌ప్లేలతో వచ్చే వాటినే ఎంపిక చేసుకోవటం ఉత్తమం. స్మార్ట్‌ఫోన్‌లను ఇన్సర్ట్ చేసుకుని చూడటం వల్ల హెడ్‌సెట్ బరువు పెరిగిపోవటంతో వ్యూవింగ్ యాంగిల్స్ అనేవి అంతగా ఆసక్తిని కలిగించవు.

 

 

ఫీల్డ్ ఆఫ్ వ్యూ చాలా కీలకం..

ఫీల్డ్ ఆఫ్ వ్యూ చాలా కీలకం..

మనిషి కంటి చూపు 180 నుంచి 240 డిగ్రీలు ఫీల్డ్ ఆఫ్ వ్యూను కలిగి ఉంటుంది. ఈ క్రమంలో మీరు కొనుగోలు చేసే వీఆర్ హెడ్‌సెట్‌కు సంబంధించి ఫీల్డ్ ఆఫ్ వ్యూ కన్విన్సింగ్‌గానూ ఇదే సమయంలో ప్రపంచాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించే విధంగానూ ఉండాలి. దీన్నే స్నార్కెట్ మాస్క్ ఎఫెక్ట్ అని కూడా పిలుస్తారు.

 

 

అడ్జస్టబుల్ లెన్స్..

అడ్జస్టబుల్ లెన్స్..

మీరు కొనుగోలు చేసే వీఆర్ హెడ్‌సెట్‌కు సంబంధించి‌న లెన్స్.. ఫోకస్, ఇంటర్‌పప్పులరీ డిస్టెన్స్, లెన్స్ టు ఐ డిస్టెన్స్ వంటి మూడు ప్రత్యేకమైన ఫ్యాక్టర్స్‌ను కలిగి ఉండాలి. మీ వీఆర్ హెడ్‌సెట్‌ లెన్స్‌లో ఈ ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నట్లయితే వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటుంది.

 

 

 

Best Mobiles in India

English summary
How to choose the right VR headset.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X