Vi (వోడాఫోన్-ఐడియా) యొక్క ఫాన్సీ /VIP నెంబరును ఆన్‌లైన్ ద్వారా పొందడం ఎలా??

|

మొబైల్ ఫోన్లను వాడుతున్న వారికి మరొకరితో మాట్లాడడానికి సిమ్ కార్డు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సిమ్ కార్డును పొందాలి అనుకునే వారు తమకు నచ్చిన నంబర్లను కలిగి ఉండడం చూసి కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. వినియోగదారులు ముఖ్యంగా ఫాన్సీ మొబైల్ నంబర్లను వినియోగించడానికి ఇష్టపడతారు. అలాగే ఇవి చాలా ప్రసిద్ది కూడా చెందాయి. వినియోగదారులు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి మరియు వారి సౌలభ్యం ప్రకారం నెంబర్లను ఎంచుకోవడానికి టెల్కోలు అనుమతిని ఇస్తున్నాయి. అన్ని టెలికాం ఆపరేటర్లు ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ కస్టమర్లందరికీ ఈ సదుపాయాన్ని అందిస్తున్నారు. అయితే టెలికం ఆపరేటర్లు అందించే వాటిలో కొత్త నంబర్లను చూడాలి లేదా తీయాలి.

 

VIP నంబర్

OLX మరియు క్వికర్ వంటి యాప్ లు కూడా ఇప్పుడు VIP నంబర్లను వినియోగదారులకు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సౌకర్యాలు వ్యక్తిగత ప్రాధాన్యతలపై VIP లేదా ఫాన్సీ నంబర్లను పొందటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే ఈ నెంబర్లను ఎంచుకోవడానికి వినియోగదారులు కొన్ని దశలను అనుసరించాలి.

వోడాఫోన్-ఐడియా

మీరు Vi (వోడాఫోన్-ఐడియా) యొక్క ఫాన్సీ నంబర్ల కోసం చూస్తున్నట్లు అయితే మొదట సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. తరువాత పిన్ కోడ్, నెంబర్ మరియు అంకితమైన ప్లాన్ ను నమోదు చేయాలి. తరువాత వినియోగదారులకు అన్ని మొబైల్ నంబర్లు ఉండే డైరెక్టరీ కోసం వెతకడానికి అనుమతి ఉంది. అయితే ఈ నెంబర్లు కొన్నిసార్లు ఉచితం కూడా లభిస్తాయి. అయితే కొన్నిసార్లు మీకు నచ్చిన నెంబర్లను పొందడానికి రూ. 500 నుండి రూ. 2,500 వరకు ఖర్చు చేయవలసి ఉంటుంది.

ప్రత్యేక నెంబరు
 

తరువాత వినియోగదారులు ప్రత్యేక నెంబరును ఎంచుకోవడానికి అనుమతించబడతారు. మీరు ఈ నెంబరును ఎంచుకోవడానికి అనుమతించబడడానికి మీరు మీ చిరునామా మరియు ఇతర వివరాలను ఇవ్వవలసి ఉంటుంది. Vi (వోడాఫోన్-ఐడియా) వినియోగదారులు అంకితమైన నంబర్‌పై OTP ని స్వీకరిస్తారు. కావున మీరు మొత్తం విధానాన్ని పూర్తి చేయడానికి OTP ని సమర్పించాలి.

Vi లో లక్కీ నంబర్‌ను కనుగొనే విధానం

Vi లో లక్కీ నంబర్‌ను కనుగొనే విధానం

కంపెనీ ప్రకారం ఎవరైనా కస్టమర్ 4 లక్కీ నంబర్ కోసం చూస్తున్నట్లయితే ఆ సంఖ్యను ఎంచుకోవచ్చు. ఒకవేళ కస్టమర్ 1, 3, మరియు 6 వంటి ఫాన్సీ నంబర్ల కోసం వెతుకుతున్నట్లయిన కూడా సంస్థ మీకు వాటిని అందిస్తుంది. ఖచ్చితమైన అంకెలను ఎంచుకోవడానికి కంపెనీ మీకు డైరెక్టరీని ఇస్తుంది. ఒకవేళ మీరు 13 వ నెంబర్ కోసం చూస్తున్నట్లు అయితే అప్పుడు మీరు 4 ను అంటే (1+ 3) విధంగా ఎంచుకోవచ్చు. అప్పుడు కంపెనీ మీకు ఖచ్చితమైన నెంబర్ లను చూపుతుంది.

Best Mobiles in India

English summary
How To Choose Vi Network Fancy/VIP Mobile Number Through Online

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X