Home
How to

Flipkart బంపరాఫర్,ఫోన్ స్క్రీన్ పగిలితే రీఫండ్, ప్రాసెస్ ఎలా అంటే ?

ఎంతో ఖర్చు పెట్టి ఫోన్ కొన్న రెండు రోజులకే ఆ ఫోన్ చేతి నుంచి జారిపడి మొబైల్‌ స్క్రీన్‌ పగిలిపోతే చాలామంది బాధపడిపోతుంటారు.

By Hazarath Aiah

ఎంతో ఖర్చు పెట్టి ఫోన్ కొన్న రెండు రోజులకే ఆ ఫోన్ చేతి నుంచి జారిపడి మొబైల్‌ స్క్రీన్‌ పగిలిపోతే చాలామంది బాధపడిపోతుంటారు. మళ్లీ కొత్త స్క్రీన్‌ వేయించుకోవాలి అంటే ఎంత ఖర్చు అవుతుందోననని ఆవేదన చెందుతుంటారు. అయితే ఇకపై ఆ సమస్య లేకుండా ఫ్లిప్‌కార్ట్‌ స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్‌ అనే ఓ స్మార్ట్‌‌ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ కింద మీ ఫోన్‌ స్క్రీన్‌కు కూడా ఫ్లిప్‌కార్ట్‌ బీమా చేస్తుందట. ఈ స్క్రీన్‌ బీమా 150 రూపాయల నుంచి ప్రారంభమవుతుందని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఈ ప్లాన్‌ కింద, ఒకవేళ స్క్రీన్‌ డ్యామేజ్‌ అయితే, ఫోన్‌ ధరలో ఫ్లాట్‌ 20 శాతాన్ని ఫ్లిప్‌కార్ట్‌ రీఫండ్‌ చేయనుంది. ఈ మొత్తాన్ని యూజర్ల బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేయనుందని తెలిసింది. దీన్ని పొందడం ఎలాగో తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో

ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో

కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలోనే స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌ ధర రూ.150 నుంచి ప్రారంభమవుతుంది. ఫోన్‌ ధరను బట్టి ఈ మొత్తం ఇంకా ఎక్కువగా ఉండవచ్చు.

రెండు విధానాల ద్వారా

రెండు విధానాల ద్వారా

ఈ ప్లాన్ ద్వారా యూజర్లు రెండు విధానాల ద్వారా ప్రయోజనాలను పొందుతారు. ఫోన్‌ వాడుతూ ఉన్నప్పుడు ఫోన్‌ స్క్రీన్‌ డ్యామేజ్‌ అయితే ఫోన్‌ను రీఫైర్‌ చేయడానికి లేదా రీఫండ్‌కుఈ ప్లాన్ అనుమతి ఇస్తోంది. ఆ సమయంలో క్లయిమ్‌ను పొందవచ్చు. అయితే క్లయిమ్‌ ప్రక్రియంతా ఆన్‌లైన్‌ ద్వారానే సాగుతుంది.

 మొదటి పద్దతిలో..

మొదటి పద్దతిలో..

మొదటి పద్దతిలో రీఫండ్‌ ప్రక్రియలో క్లయిమ్‌ పొందడం ఎలా పొందాలంటే..కొనుగోలుదారులు కంపెనీ నెంబర్లు 1800 425 5568 లేదా 080-25187326 కు కాల్‌ చేయాల్సి ఉంటుంది. [email protected] అనే అడ్రస్‌కైనా ఈమెయిల్‌ చేయాల్సి ఉంటుంది.

 డ్యామేజ్‌ అయిన స్క్రీన్‌తో పాటు ఐఎంఈఐ నెంబర్‌

డ్యామేజ్‌ అయిన స్క్రీన్‌తో పాటు ఐఎంఈఐ నెంబర్‌

ఈ మెయిల్‌ తరువాత మీ నెంబర్‌కు ఫ్లిప్‌కార్ట్‌ సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ వీడియో పంపుతుంది. అప్పుడు మీరు డ్యామేజ్‌ అయిన స్క్రీన్‌తో పాటు ఐఎంఈఐ నెంబర్‌ కనిపించేలా పగిలిపోయిన డివైజ్‌ను వీడియో తీసి కంపెనీకి పంపాల్సి ఉంటుంది.

 కంపెనీ సెల్ఫ్‌ సర్వే రిపోర్టును

కంపెనీ సెల్ఫ్‌ సర్వే రిపోర్టును

అప్పుడు కంపెనీ సెల్ఫ్‌ సర్వే రిపోర్టును పరిశీలించి, అంతకుముందు జరిగిన ఘటనలతో పోల్చి చూసి, మీకు క్లయిమ్‌ వస్తుందో రాదో చెబుతోంది. ఒకవేళ క్లెయిట్ సరిపోతుంది అనుకుంటే దానికి సంబంధించిన మొత్తం అమౌంట్ అనంతరం మీ బ్యాంకు అకౌంట్‌లో జమ అవుతుంది.

మరో పద్దతి

మరో పద్దతి

మరో పద్దతి రీఫైర్‌ ప్రొసెస్‌లో క్లయిమ్‌ ఎలా పొందాలంటే..ఈ ప్ర​క్రియలో కూడా కొనుగోలుదారుడు కంపెనీ నెంబర్లు 1800 425 5568 లేదా 080- 25187326కి ఫోన్ చేయాల్సి ఉంటుంది. లేదా ఈమెయిల్‌ ద్వారా అయినా మీ అభ్యర్థనను కంపెనీకి పంపుకోవచ్చు.

రీఫైర్ వివరాలను

రీఫైర్ వివరాలను

ఈ-మెయిల్‌లో మీరు అందించే మీ ప్రాంత పిన్‌కోడ్‌ బట్టి, దగ్గర్లోని జీవ్స్‌ అథారైజడ్‌ సర్వీసు సెంటర్‌ వివరాలను కంపెనీ అందిస్తోంది. అక్కడికి వెళ్లి, రీఫైర్ వివరాలను తెలుసుకోవాలి. 

రీఫైర్‌ చేస్తామని చెబితే..

రీఫైర్‌ చేస్తామని చెబితే..

ఆ సెంటర్‌ వారు ఫోన్‌ను రీఫైర్‌ చేస్తామని చెబితే, మొత్తం రీఫైరింగ్‌ ఖర్చును ముందుగా అక్కడి కట్టి, మీ ఫోన్‌ను రీఫైర్‌ చేయించుకోవాలి.

Repair ఖర్చులో..

Repair ఖర్చులో..

ఆ Repair ఖర్చులో మీరు కట్టిన మొత్తానికి మీకు ఒక ఇన్‌వాయిస్‌ ఇస్తారు. అనంతరం జీవ్స్‌కు కాల్‌ చేసి, ఫోన్‌ విలువలో 20 శాతం క్లయిమ్‌ను లేదా మొత్తం రీఫైర్‌ ఖర్చును క్లయిమ్‌ చేసుకోవచ్చు.

ఏదైతే తక్కువగా ఉంటుందో..

ఏదైతే తక్కువగా ఉంటుందో..

ఏదైతే తక్కువగా ఉంటుందో దాన్ని కంపెనీ మీ ఖాతాలో క్రెడిట్‌ చేస్తుంది.ఒకవేళ జీవ్స్‌ సెంటర్‌ మీ ఫోన్‌ రీఫైర్‌ చేయడానికి ఒప్పుకోకపోతే, రీఫండ్‌ ద్వారా క్లయిమ్‌ను పొందవచ్చు.

ఇన్‌వాయిస్‌ ఆధారంగా..

ఇన్‌వాయిస్‌ ఆధారంగా..

క్లయిమ్‌ ఆమోదం పొందడానికి ఎలాంటి చర్చలు జరపడానికి వీలులేదు. కానీ 72 గంటల్లో నగదు మాత్రం వినియోగదారుని అకౌంట్‌కు బదిలీ అవుతాయి. ఫోన్‌ ధరను ఇన్‌వాయిస్‌ ఆధారంగా లెక్కిస్తారు. మార్కెట్‌ ధర అనుగుణంగా కాదు.

క్లయిమ్‌ పొందేటప్పుడు..

క్లయిమ్‌ పొందేటప్పుడు..

క్లయిమ్‌ పొందేటప్పుడు ఎలాంటి మొత్తాన్ని కూడా యూజర్లు చెల్లించాల్సినవసరం లేదు. అయితే ఇందులో ఫోన్‌ను ఎవరు వాడుతున్నారో కంపెనీ పట్టించుకోదు. దీని కోసం ఎలాంటి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సినవసరం లేదు.

స్క్రీన్‌ కాకుండా మిగతావి ఏమన్నా డ్యామేజ్‌ అయితే..

స్క్రీన్‌ కాకుండా మిగతావి ఏమన్నా డ్యామేజ్‌ అయితే..

ఈ ప్లాన్‌లో స్క్రీన్‌ కాకుండా మిగతావి ఏమన్నా డ్యామేజ్‌ అయితే, ఇది వర్తించదు. ఫోన్‌ చోరికి గురైనా కూడా ప్లాన్‌ వర్తించదు. మాన్‌ఫ్రాక్ట్ర్చర్‌ వారెంటీ కింద డ్యామేజ్‌ అయినా కూడా స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్‌ కిందకి రాదు.

కొత్త ఫోన్లకు మాత్రమే..

కొత్త ఫోన్లకు మాత్రమే..

అన్ని యాక్ససరీస్‌ కూడా ఈ ప్లాన్‌ కిందకి రావు. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే కొత్త ఫోన్లకు మాత్రమే ఈ ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ ఉంటుంది. 

కొనుగోలు చేసేటప్పుడే

కొనుగోలు చేసేటప్పుడే

ఫోన్‌ కొనుగోలు చేసేటప్పుడే, ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను కొనుగోలు చేయాలి. ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి ఎలాంటి ప్రొవిజన్‌ ఉండదు.

Best Mobiles in India

English summary
Smartphone user alert! You can claim refund of your phone’s broken screen; here’s how More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X