ఇంట్లో దొరికే వస్తువులతో మన గాడ్జెట్‌లను క్లీన్ చేసుకోవటం ఎలా..?

మన రోజువారి అవసరాల్లో భాగంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల పై ఎంతగానో ఆధారపడుతున్నాం. ఈ క్రమంలో వీటిని పిచ్చాపాటిగా వాడేస్తుటాం. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల వినియోగం విషయంలో సరైన ప్రికాషన్స్ అనేవి చాలా అవసరసం. ముఖ్యంగా ఇవి ఎప్పటికప్పుడు చాలా క్లీన్‌గా ఉండాలి.

Read More : 4జీబి ర్యామ్‌తో HP ఫోన్, ఎన్ని ఫీచర్లో తెలుసా..?

 ఇంట్లో దొరికే వస్తువులతో మన గాడ్జెట్‌లను క్లీన్ చేసుకోవటం ఎలా..?

వీటిని సిరిగ్గా హ్యాండిల్ చేయలేని పక్షంలో త్వరగా పాడైపోతుంటాయి. కూల్‌గా ఆలోచిస్తే మన గాడ్జెట్‌లను పెద్ద శ్రమపడాల్సిన అవసరం లేకుండా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో దొరికే చిన్ని చిన్ని సామాగ్రిని ఉపయోగించి మన కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వగైరా గాడ్జెట్‌లను ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుకోవచ్చు. ఆ చిట్కాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టిప్ 1

మీ ఇయర్ ఫోన్ స్పీకర్ మెస్ పై పేరుకుపోయిన దుమ్మును డ్రై టూత్ బ్రష్ ద్వారా తొలగించవచ్చు. దుమ్ము పేరుకుపోయిన ప్రాంతంలో నెమ్మదిగా బ్రష్ చేయటం వల్ల డర్ట్ మొత్తం తొలగిపోతుంది.

టిప్ 2

కాటన్ స్వాబ్‌ను ఆల్కహాల్ ముంచి ఇయర్‌ఫోన్ ప్లాస్టిక్ భాగాల పై అప్లై చేయటం ద్వారా అవి ఎప్పటికప్పుడు క్లీన్‌‌గా ఉంటాయి. మీ ఇయర్‌ఫోన్‌ను సిలి‌కోన్‌తో తయారైనట్లయితే డిష్ వాషర్ లిక్విడ్‌ను నీటిలో కలిపి అప్లై చేయండి.

టిప్ 3

హెడ్‌ఫోన్‌లను క్లీన్ చేసేందుకు ఇంటర్ - డెంటల్ బ్రష్ బెస్ట్ టూల్.

టిప్ 4

సాఫ్ట్ మేకప్ బ్రష్ సహాయంతో మీ కంప్యూటర్ కీబోర్డ్‌ను సలువైన పద్ధతిలో క్లీన్ చేయవచ్చు.

టిప్ 5

మీ కీబోర్డ్ సర్‌ఫేస్ పై పేరుకుపోయిన దుమ్మును తొలగించేందుకు స్టిక్ నోట్స్ బేషుగ్గా ఉపయోగపడుతుంది. స్టిక్‌నోట్స్‌కు ఉండే గమ్ కీబోర్డ్ బటన్‌ల పై పేరుకు పోయిన దుమ్మును పూర్తిగా బయటకు లాగేస్తుంది.

టిప్ 6

కాటన్ స్వాబ్‌ను రబ్బింగ్ ఆల్కహాల్‌లో ముంచి కీబోర్డ్ సర్‌ఫేస్ పై అప్లై చేయటం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చు.

టిప్ 7

లింట్ - రోలర్ సహాయంతో మీ హోమ్ స్పీకర్ల పై పేరుకుపోయిన దుమ్మును సునాయాశంగా తొలగించవచ్చు.

టిప్ 8

చిన్నపాటి పెయింట్ బ్రష్ సహాయంతో మీ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లోని బిల్ట్-ఇన్ స్పీకర్లను క్లీన్ చేయవచ్చు.

టిప్ 9

మీ టెలివిజన్ స్ర్కీన్‌తో పాటు కంప్యూటర్ స్ర్కీన్‌లను శుభ్రం చేసుకునేందుకు కాఫీ - ఫిల్టర్స్‌ను బేషుగ్గా ఉపయోగించుకోవచ్చు.

టిప్ 10

గాడ్జెట్‌లను క్లీన్ చేసుకునేందుకు అనేక స్ర్కీన్ క్లీనర్‌లతో పాటు వైపర్ లిక్విడ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవేమీ కాకుండా సొంతంగా మీ ఇంట్లోనే హోమ్ మేడ్ క్లీనర్ లిక్విడ్‌ను తయారు చేసుకోవచ్చు. ఒక భాగం వెనిగర్‌లో ఒక వంతు రిబ్బింగ్ ఆల్కాహాల్‌ను మిక్స్ చేసి ఈ మిశ్రమంలో అంతే సమానమైన డిస్టిల్డ్ వాటర్‌ను జోడించటం ద్వారా మీ గాడ్జెట్ క్లినింగ్‌కు అవసరమైన హోమ్ మేడ్ క్లీనర్ లిక్విడ్ తయారవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How To Clean Your Gadgets Using Household Items. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot