స్ర్కీన్ పై మరకలా..?

స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్ పై మరకలు ఏర్పడటం సహజం, వాటిని పోగొట్టే క్రమంలో సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే ప్రతి ఒక్కరు స్ర్కీన్ క్లినింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకుంటే టచ్‌స్ర్క్కీన్ మన్నికను కోల్పోయే ప్రమాదముంది.

Read More : జియో సిమ్ లేకపోయినా, జియో యాప్స్ వాడుకోవటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

మరకలు ఏర్పడ్డ టచ్ స్ర్కీన్‌ను శుభ్రం చేసే క్రమంలో ముందుగా ఫోన్‌ను స్విచాఫ్ చేయటం మంచిది.  స్ర్కీన్‌ను శుభ్రం చేసేందుకు డిస్టిల్ వాటర్ లేదా వైట్ వెనిగార్‌ను ఉపయోగించండి.

స్టెప్ 2

స్ర్కీన్ క్లీనింగ్‌లో భాగంగా గరుకు బట్టలు, పేపర్ టవల్స్, టిష్యూ పేపర్స్ వంటి వాటిని ఉపయోగించకండి. వీటిని ఉపయోగించటం వల్ల స్ర్కీన్ పై గీతలు పడతాయి. స్ర్కీన్‌ను శుభ్రం చేసే సమయంలో మీ వేళ్లతో స్ర్కీన్ పై బలంగా రాపిడి చేయవద్దు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టెప్ 3

స్ర్కీన్‌ను శుభ్రం చేసేందుకు డిస్టిల్ వాటర్ లేదా వైట్ వెనిగార్‌ను ఉపయోగించండి, లేకుంటే క్లీనింగ్ కిట్‌తో వచ్యే ప్రత్యేకమైన స్ర్కీనింగ్ సొల్యూషన్‌ను ఉపయోగించండి. మీ ఫోన్ టచ్‌స్ర్కీన్‌ను శుభ్రపరిచే క్రమంలో కఠినమైన రసాయనాలు ఇంకా ఆల్కాహాల్ ఆధారిత క్లీనర్లను ఉపయోగించొద్దు.

స్టెప్ 4

ప్రమాదవశాత్తూ మీ ఫోన్ నీటిలో తడిచి పనిచేయటం మానేసినట్లయితే ఈ సూచనలను పాటించండి. చమ్మ తాకిడికి లోనైన మీ ఫోన్ పనితీరు ఏ స్థాయిలో ఉందో తొలత చెక్ చేసుకోండి.

స్టెప్ 5

తడిఫోన్ బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు. కీప్యాడ్ పై అధిక ఒత్తిడి తీసుకురావటం వల్ల చమ్మలోనికి ప్రవేశించే ఆస్కారం ఉంది. తరువాతి చర్యగా ఫోన్ నుంచి బ్యాటరీని వేరు చేయండి. ఇలా చేయటం వల్ల షార్ట్ సర్య్యూట్ బెడద తప్పుతుంది. తదుపరి చర్యగా కీప్యాడ్ ప్యానెల్‌ను వేరు చేయండి. ఫోన్‌లోని సిమ్ కార్డ్స్ అలాగే మెమరీ కార్డ్‌లను వేరుచేయండి.

స్టెప్ 6

పొడి టవల్ తీసుకుని చమ్మతాకిడికి లోనైన ప్రదేశాన్ని డ్రై చేయండి. తడిబారిన ప్రదేశం వెచ్చబడిన అనంతరం ఫోన్‌ను 24 గంటల పాటు బిగుతైన ఎయిర్ కంటైనర్‌లో ఉంచండి. ఫోన్ పూర్తిగా ఆరినట్లు అనిపిస్తే బ్యాటరీని జతచేసి స్విచ్ ఆన్ చేయండి. మీ ఫోన్ ఖచ్చితంగా పనిచేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How To Clean Your Smartphone's Touchscreen Safely. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot