Xiaomi ఫోన్‌లలో యాడ్స్ విసిగిస్తున్నాయా? ఇలా డిసేబుల్ చేసేయండి
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి (Xiaomi), తన స్మార్ట్‌ఫోన్‌లతో పాటుగా అందిస్తోన్న MIUI కస్టమ్ ఆపరేటింగ్ సిస్టం వందల కొద్ది కస్టమేజేషన్ ఆప్షన్‌లతో యూజర్లను మెప్పించే ప్రయత్నం చేస్తోంది.
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి (Xiaomi), తన స్మార్ట్‌ఫోన్‌లతో పాటుగా అందిస్తోన్న MIUI కస్టమ్ ఆపరేటింగ్ సిస్టం వందల కొద్ది కస్టమేజేషన్ ఆప్షన్‌లతో యూజర్లను మెప్పించే ప్రయత్నం చేస్తోంది. స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో అందుబాటులోని కస్టమైజేషన్స్ ఆప్షన్స్ సైతం MIUI కస్టమ్ ఆపరేటింగ్ సిస్టంలో అందుబాటులో ఉండటం విశేషం.

MI యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కొందరే ఇష్టపడుతున్నారు.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను బట్టి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అప్‌డేట్ అవుతూ వస్తోన్న MI యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కేవలం కొంత మంది యూజర్లు మాత్రమే ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధానమైన కారణం, ఈ కస్టమ్ ఆపరేటింగ్ సిస్టంలోని స్టాక్ యాప్స్ పదేపదే యాడ్స్‌ను డిస్‌ప్లే చేయటమేనట. ఈ యాడ్స్ అనేవి నోటిఫికేషన్స్ షేడ్స్ అలానే స్మార్ట్‌ఫోన్ ఇతర భాగాల్లో కనిపిస్తుండటంతో కొందరు అసహనానికి గురువుతున్నట్లు తెలుస్తోంది.

పదేపదే విసిగిస్తోన్న యాడ్స్‌ను డిసేబుల్ చేయాలంటే..?
యాడ్స్‌ను డిసేబుల్ చేసే క్రమంలో యూజర్లు సంబంధిత యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి receive recommendations ఆప్షన్స్‌ను టర్నాఫ్ చేయటం ద్వారా యాడ్స్‌ను డిసేబుల్ చేయవచ్చు. ఇలా కాకుండా కొత్తగా అందుబాటులోకి వచ్చిన మరో ప్రొసీజర్ ద్వారా షావోమి యాప్స్ నుంచి మొత్తం యాప్స్‌ను డిసేబుల్ చేసే వీలుంటుంది.

స్టెప్ బై స్టెప్ గైడ్..
ఈ ప్రొసీజర్‌ను అప్లై చేసే క్రమంలో ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అడిషనల్ సెట్టింగ్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయ్యే ఆప్షన్స్‌లో Authorisation and revocation ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని disable msa to turn off system విభాగంలోకి వెళ్లాలి. ఇందులోని wide adsను సెలక్ట్ చేసుకున్నట్లయితే షావోమి యాప్స్ నుంచి వచ్చే మొత్తం యాప్స్ డిసేబుల్ కాబడతాయి. ఈ ఫీచర్ Poco F1 స్మార్ట్‌ఫోన్‌తో MIUI 9 లేదా MIUI 10 కస్టమ్ ఆపరేటింగ్ సిస్టంతో రన్ అయ్యే ప్రతి షావోమి స్మార్ట్‌ఫోన్‌లోనూ అందుబాటులో ఉంటుంది.

MIUIలో యాడ్స్ ఎందుకు డిస్‌ప్లే అవుతున్నాయంటే..?
పోటీ మార్కెట్ నేపథ్యంలో షియోమి తన స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ లాభంతో విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంతోకొంత లభాన్ని రాబట్టుకునేందుకు తన బ్రౌజర్, సెక్యూరిటీ ఇంకా ఫైల్ మేనేజర్ యాప్స్ ద్వారా యాడ్స్‌ను ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. అయితే, వీటిని డిసేబుల్ చేసే ఆప్షన్‌ను షావోమి అందుబాటులోకి తీసుకురావటంతో చాలా మంది యూజర్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications








