Home
How to

క్వాలిటీ తగ్గకుండా ఫోటో కంప్రెస్ అవ్వాలా..?

ఈ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ఫోటోలు ఎక్కువ స్టోరజ్ స్పేస్‌ను ఆక్రమించేసుకుంటున్నాయా? వీటిని కంప్రెస్ చేసి స్టోరజ్ స్పేస్‌ను మరింతగా ఆదా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీ కోసమే.

ఈ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ఫోటోలు ఎక్కువ స్టోరజ్ స్పేస్‌ను ఆక్రమించేసుకుంటున్నాయా? వీటిని కంప్రెస్ చేసి స్టోరజ్ స్పేస్‌ను మరింతగా ఆదా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. మార్కెట్లో ఫోటోలను కంప్రెస్ చేసే యాప్స్ చాలానే ఉన్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే హైక్వాలిటీ పనితీరును కనబరుస్తున్నాయి. వాటిలో 5 బెస్ట్ యాప్స్ వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

ఫోటో కంప్రెస్ 2.0 (Photo Compress 2.0)

ఫోటో కంప్రెస్ 2.0 (Photo Compress 2.0)

ఈ యాడ్ ఫ్రీ యాప్‌ను మీమీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఫోటోలను ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా కంప్రెస్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ ఫోటోలను రెండు క్వాలిటీలలో కంప్రెస్ చేస్తుంది. వాటిలో నచ్చిన క్వాలిటీని మీరు సెలక్ట్ చేసుకుని మిగిలిన వాటిని డిలీట్ చేసేయవచ్చు. దీంతో ఫోన్ మొమురీ మరింతగా ఆదా అవుతుంది.

కంప్రెస్ ఇమేజ్ (Compress Image)

కంప్రెస్ ఇమేజ్ (Compress Image)

గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్న ఈ యాప్ 97శాతం క్వాలిటీతో ఫోటోలను కంప్రెస్ చేయగలుగుతుంది. ఈ యాప్‌లో పొందుపరిచిన అధునాతన కంప్రెసింగ్ టూల్స్ మీ విలువైన పాత ఫోటోలను అదే క్వాలిటీతో కంప్రెస్ చేసి తక్కువ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించుకునే విధంగా మార్చేస్తాయి.

 

 

క్రామ్- రెడ్యూస్ పిక్షర్స్ (Cram - Reduce Pictures)

క్రామ్- రెడ్యూస్ పిక్షర్స్ (Cram - Reduce Pictures)

కంప్రెస్ ఇమేజ్ తరహాలోనే క్రామ్ - రెడ్యూస్ పిక్షర్స్ యాప్ కూడా ఫోటోలను క్వాలిటీతో కంప్రెస్ చేస్తుంది. కంప్రెషన్ సమయంలో మీ పాత ఫోటోలకు సంబంధించి డిస్‌ప్లే, ప్రింట్ డైమెన్షన్స్, రిస్యల్యూషన్, బ్యూటీ వంటివి ఏ మాత్రం దెబ్బతినకుండా చూస్తుంది.

 

 

ఫోటో జిప్ - కంప్రెస్ రీసైజ్ (Photoczip - compress resize)

ఫోటో జిప్ - కంప్రెస్ రీసైజ్ (Photoczip - compress resize)

గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువు తీరి ఉన్న ఈ యాప్ ఒకే ఒక స్టెప్‌లో ఫోటోలను కంప్రెస్ చేయటంతో పాటు రీసైజ్ చేయగలుగుతుంది. ఈ సింపుల్ టూల్ ద్వారా పెద్ద పెద్ద ఫోటోలను సైతం రీసైజ్ చేసుకునే వీలుంటుంది. ఫోటోను ఒకే స్టెప్‌లో 100కేబి కంటే తక్కువుకు కంప్రెస్ చేసుకునే వీలుంటుంది.

క్విక్ కంప్రెసర్ (QuickCompressor)

క్విక్ కంప్రెసర్ (QuickCompressor)

ఈ శక్తివంతమైన ఫోటో కంప్రెసింగ్ యాప్ 5 ఎంబి సామర్థ్యం గల ఫోటోను క్వాలిటీ విషయంలో కాంప్రైమైజ్ కాకుండా 40కేబీకి కంప్రెస్ చేయగలదు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌‍ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

 

Best Mobiles in India

English summary
How To Compress Images In Android Without Losing Quality.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X