క్వాలిటీ దెబ్బతినకుండా PDF Filesను కంప్రెస్ చేయటం ఎలా..?

Posted By: BOMMU SIVANJANEYULU

పీడీఎఫ్ ఫైళ్లను కంప్రెస్ చేసే విషయంలో చాలా మంది యూజర్లు తెగ కన్ఫ్యూజన్‌కు లోనవుతుంటారు. ఇందుకు కారణం వారిలో స్పష్టమైన అవగాహన లోపించటమే. వాస్తవానికి పీడీఎఫ్ ఫైళ్లను కంప్రెస్ లేదా రెడ్యూస్ చేసుకునేందుకు అనేక టూల్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటిలో మంచి వాటిని పిక్ చేసుకోవటం ద్వారా పని మరింత సులభతరంగా మారిపోతుంది. పీడీఎఫ్ ఫైళ్లను కంప్రెస్ చేసేందుకు అనేక ఉచిత ఆన్‌లైన్ టూల్స్ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నప్పటికి ఇవి సెక్యూరిటీ రిస్క్స్‌కు దానితీస్తున్నాయి.

కాల్‌డ్రాప్స్ సమస్యకు చెక్, ఇకపై టెలిఫోనీ యాప్ ఉంటే చాలు !

ఆధార్, పాస్‌పోర్ట్, పాన్‌కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను కంప్రెస్ చేయవల్సి వచ్చినపుడు ఉచిత ఆన్‌లైన్ టూల్స్‌కు దూరంగా ఉండటం మంచిదిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వేరొక మార్గం లేకపోయినట్లయితే Smallpdf, iLovePDF, PDF Compressor వంటి విశ్వసనీయమైన సైట్‌లను ఆశ్రయించటం మంచిదని వారు సూచిస్తున్నారు. ఈ మూడు వెబ్‌సైట్‌లు 24MB సైజుతో ఉన్న పీడీఎఫ్ డాక్యుమెంట్లను 1.12MB, 1.10MB, 1.6MB సైజుల్లోకి కంప్రెస్ చేయగలవు.

క్వాలిటీ దెబ్బతినకుండా PDF Filesను కంప్రెస్ చేయటం ఎలా..?

Android లేదా iOS డివైజుల్లో పీడీఎఫ్ ఫైళ్లను కంప్రెస్ చేయవల్సి వస్తే..
పైన పేర్కొన్న మూడు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు కంప్యూటర్లతో పాటు అన్ని మొబైల్ డివైస్‌ల్లోనూ వర్క్ అవుతాయి. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్లయితే ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ లేదా క్లౌడ్ సర్వీసెస్ నుంచి ఫైళ్లను పిక్ చేసుకోవల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఐఓఎస్ ఆధారిత డివైస్‌ను వాడుతన్నట్లయితే పీడీఎఫ్ ఫైళ్లు ఖచ్చితంగా డ్రాప్ బాక్స్, గూగుల్ డ్రైవ్ వంటి సపోర్టెడ్ క్లౌడ్ సర్వీసెస్‌లో స్టోర్ అయి ఉండాలి.

ఆకట్టుకునే ఫీచర్లతో Coolpad Note 6,బడ్జెట్ ధరలో..

Adobe Acrobatను ఉపయోగించుకుని పీడీఎఫ్ ఫైల్స్‌ను కంప్రెస్ చేయటం ఎలా..?
Adobe Acrobat Reader DC అనేది ఉచితంగా లభ్యమయ్యే పీడీఎఫ్ రీడర్ అయినప్పటికి, పీడీఎఫ్ ఆప్టిమైజేషన్ మాత్రం పెయిడ్ Acrobat Pro సబ్‌స్ర్కీప్షన్‌లో మాత్రమే లభ్యమవుతుంది. డబ్బలు చెల్లించి ఈ సర్వీసును వినియోగించుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఈ క్రింది ప్రొసీజర్‌ను ఫాలో అవ్వండి..

ఫైల్‌ను Adobe Acrobatలో ఓపెన్ చేయండి...
ముందగా మీ పీడీఎఫ్ ఫైల్‌ను Adobe Acrobatలో ఓపెన్ చేయండి. ఆ తరువాత టూల్స్‌లోకి వెళ్లి Optimise PDF ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత పీడీఎఫ్ పైన కనిపించే టూల్ బార్‌లో ఫైల్ సైజును కావల్సిన మేర రెడ్యూస్ చేసుకునే వీలుంటుంది. ఫైల్ పై మరింత కంట్రోల్ పొందాలనుకున్నట్లయితే Advanced Optimisationను సెలక్ట్ చేసుకుని ఆడిట్ స్పేస్ యూసేజ్‌లోకి వెళ్లి పేజ్ ఎలిమెంట్స్‌ను పరిశీలించవచ్చు.

విండోస్ సాఫ్ట్‌వేర్ యాప్స్‌ను ఉపయోగించుకుని PDF ఫైల్స్‌ను ఉచితంగా కంప్రెస్ చేసుకోవచ్చు..
PDF ఫైళ్లను కంప్రెస్ చేసేందుకు అనేక విండోస్ సాఫ్ట్‌వేర్ యాప్స్‌ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటిలో 4Dots Free PDF Compress అనే ప్రోగ్రామ్ మీకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. విండోస్ 7, విండోస్ 8.1 ఇంకా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తుంది.

English summary
Here’s a task we’ve all faced at some point in our lives – having to compress a PDF, be it to fit an arbitrary file size requirement, optimise for quick viewing, or save on data costs.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot