Home
How to

విండోస్ 10లో మీ ప్రైవసీని కాపాడుకోవటం ఎలా..?

విండోస్ 10 మార్కెట్లో లాంచ్ అయిన నాటి నుంచి ఈ ఆపరేటింగ్ సిస్టం పనితీరు పై రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆపరేటింగ్ సిస్టంలోని ప్రైవసీ రిస్క్స్ పలువురిని బెంబేలెత్తిస్తున్నాయి.

By Bommu Sivanjaneyulu

విండోస్ 10 మార్కెట్లో లాంచ్ అయిన నాటి నుంచి ఈ ఆపరేటింగ్ సిస్టం పనితీరు పై రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆపరేటింగ్ సిస్టంలోని ప్రైవసీ రిస్క్స్ పలువురిని బెంబేలెత్తిస్తున్నాయి. విండోస్ 10లోని డీఫాల్ట్ సెట్టింగ్స్ యూజర్ వ్యక్తిగత డేటాను సేకరించి మైక్రోసాఫ్ట్ అలానే దాని పార్టనర్స్‌కు చేరవేస్తున్నాయంటూ క్రిటిక్స్ అలానే ప్రవైసీ అడ్వకేట్స్ తప్పుపడుతోన్న విషయం తెలిసిందే. ఏదైమైనప్పటికి విండోస్ 10 నుంచి మీ ప్రైవసీని కాపాడుకునేందుకు ఓఎస్‌ను కావల్సిన విధంగా కాన్ఫిగర్ చేసుకోవల్సి ఉంటుంది. ఆ ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రైవసీ డ్యాష్‌బోర్డ్‌లోకి వెళ్లండి...

ప్రైవసీ డ్యాష్‌బోర్డ్‌లోకి వెళ్లండి...

మీ డివైస్ లో ఇన్ స్టాల్ అయి ఉన్న విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం నుంచి మైక్రోసాఫ్ట్ ఎటువంటి డేటాను కలెక్ట్ చేస్తుందో తెలసుకోవాలంటే ప్రైవసీ డ్యాష్‌బోర్డ్ లోకి వెళ్లండి. అక్కడ మైక్రోసాఫ్ట్ కలెక్ట్ చేస్తున్న వివరాలు మొత్తం కనిపిస్తాయి. వాస్తవానికి మైక్రోసాఫ్ట్ విండోస్ 10 యూజర్ల నుంచి నేమ్స్ అండ్ కాంటాక్ట్ డేటా, పరిచయ పత్రాలు (క్రెడిన్షియల్స్), డెమోగ్రాఫిక్ డేటా, అభిరుచులు ఇంకా ఇష్టాలు, పేమెంట్ డేటా, యూసేజ్ డేటా, కాంటాక్ట్స్ అండ్ రిలేషన్‌షిప్స్, లొకేషన్ డేటా, కంటెంట్ వంటి వివరాలను సేకరిస్తుంది. అయితే వాటిని కస్టమర్ సపోర్ట్, ప్రొడక్ట్ యాక్టివేషన్, సర్వీస్ ఇంప్రూవ్ మెంట్, సెక్యూరిటీ, సేఫ్టీ, డిస్ప్యూట్ రిసల్యూషన్ ఇంకా బిజినెస్ ఆపరేషన్స్ నిమిత్తం ఉపయోగిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ చెబుతోంది.

ఆపరేటింగ్ సిస్టంను రీలోడ్ చేసుకోండి..

ఆపరేటింగ్ సిస్టంను రీలోడ్ చేసుకోండి..

ఆపరేటింగ్ సిస్టంను తిరిగి రీలోడ్ చేయటం ద్వారా ప్రైవసీ రిస్క్స్ ఏమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. ఇదే సమయంలో మీరు కొత్త కంప్యూటర్ ను వినియోగిస్తున్నట్లయితే ఫ్రెష్ ఆపరేటింగ్ సిస్టంతో స్టార్ట్ చేయటం ఉత్తమం.

కార్టానాను డిసేబుల్ చేసుకోవటం ద్వారా

కార్టానాను డిసేబుల్ చేసుకోవటం ద్వారా

మైక్రోసాఫ్ట్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లలో ఒకటైన కార్టానా తన యూజర్లకు మరింతగా సహాయపడే క్రమంలో వారి ప్రతీ యాక్టివిటీని ట్రాక్ చేస్తుంటుంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ హ్యాక్ కార్టోనాలోని వీక్ పాయింట్స్‌ను బయటపెట్టినట్లు తెలుస్తుంది. లాక్ స్ర్కీన్ తో ఉన్న కంప్యూటర్ లో కార్టానాను ఉపయోగించుకుని పలు వెబ్ సైట్ లను కూడా ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. కార్టానాతో కూడా ప్రైవసీ రిస్క్స్ పొంచి ఉన్న నేపథ్యంలో ఈ టూల్ ను కూడా డిసేబుల్ చేసుకోవటం ఉత్తమం. విండోస్ సెట్టింగ్స్ లోని కార్టానా సెక్షన్ లోకి వెళ్లటం ద్వారా ఫీచర్ ను పూర్తిగా డిసేబుల్ చేసుకోవచ్చు.

పీసీ యాక్టివిటీలను తెలుసుకునేందుకు..

పీసీ యాక్టివిటీలను తెలుసుకునేందుకు..

విండోస్ ఉత్పత్తులైన మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ , బింగ్ సెర్చ్ ఇంజిన్‌లు యాజర్లకు సంబంధించిన ఇంటర్నెట్ యాక్టివిటీలను నిత్యం ట్రాక్ చేస్తుంటాయి. విండోస్ 10 ఆధారిత కంప్యూటర్‌లలో పీసీ యాక్టివిటీలను తెలుసుకునేందుకు ముందుగా మీ డివైస్‌లోని Settings -> Privacy -> Activity History -> Manage my activity infoలోకి వెళ్లాలి. బ్రౌజర్ విండో పాపప్ అయిన వెంటనే మైక్రోసాఫ్ట్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి. అక్కడ అకౌంట్‌కు సంబంధించిన బ్రౌజింగ్ హిస్టరీతో పాటు లొకేషన్ యాక్టివిటీ, వాయిస్ యాక్టివిటీ ఇంకా కార్టోనా నోట్‌బుక్ యాక్టివిటీలకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.

 బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసుకోవటం ద్వారా ప్రైవసీ రిస్కులకు చెక్..

బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసుకోవటం ద్వారా ప్రైవసీ రిస్కులకు చెక్..

ముందుగా మీ డివైస్‌లోని Settings -> Privacy -> Activity Historyలోకి వెళ్లండి. Clear Activity History ఆప్షన్ క్రింద క్రింద కనిపించే క్లియర్ బటన్ పై క్లిక్ చేయటం ద్వారా మీ బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేసుకునే వీలుంటుంది. విండోస్ మీ డేటాను కలెక్ట్ చేయకూడదనుకుంటే 'Let Windows collect my activities' ఆప్షన్‌ను టర్నాఫ్ చేసుకోవల్సి ఉంటుంది.

 

 

Best Mobiles in India

English summary
Windows 10 has deep cloud hooks and shares a lot of data with Microsoft in order to create a smart, seamless experience across devices. If you lean more toward privacy, here's how to disable all of it.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X