హార్డ్‌వేర్ బటన్స్‌తో పనిలేకుండా ఆండ్రాయిడ్ డివైస్‌‌ను కంట్రోల్ చేయటం ఎలా..?

|

మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు టచ్‌స్కీన్ ద్వారానే కంట్రోల్ చేయబడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లలో పలు హార్డ్‌వేర్ బటన్‌లను పొందుపరుస్తున్నప్పటికి వాటి ద్వారా కొన్ని ఫంక్షన్స్ మాత్రమే సాధ్యమవుతున్నాయి. ఫోన్ వినియోగం పెరిగే కొద్ది హార్డ్‌వేర్ బటన్‌ల పై ఒత్తిడి పడుతూనే ఉంటుంది. లాంగ్ రన్‌లో ఫోన్‌లకు సంబంధించిన హార్డ్‌వేర్ బటన్లు పనిచేయటం మానేస్తుంటాయి. ఇటివంటి పరిస్థితుల్లో ఫోన్ ఆపరేటింగ్ కష్టతరంగా మారుతుంది. ఇటువంటి సందర్భాల్లో హార్డ్‌వేర్ బటన్స్‌తో సంబంధం లేకుండా కేవలం టచ్‌స్ర్కీన్ ద్వారా మీమీ ఆండ్రాయిడ్ డివైస్‌లను ఆపరేట్ చేసుకునేందుకు కొన్ని ముఖ్యమైన టిప్స్ అండ్ ట్రిక్స్ ను ఈ ఆర్టికల్ ద్వారా మీతో షేర్ చేయటం జరుగుతోంది.

 

రూ.6307కే షియోమి రెడ్‌మి 6ఎ,లాంచ్ అయిన రెడ్‌మీ 6రూ.6307కే షియోమి రెడ్‌మి 6ఎ,లాంచ్ అయిన రెడ్‌మీ 6

Button Savior యాప్ ద్వారా సాధ్యం..

Button Savior యాప్ ద్వారా సాధ్యం..

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను పూర్తిగా టచ్‌స్ర్కీన్ ద్వారానే కంట్రోల్ చేసుకోవాలనుకునే వారు ముందుగా Button Savior అనే అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తమ స్మార్ట్‌ఫోన్‌లలోకి డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్‌లోడ్ అయిన తరువాత ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌ను కంప్లీట్ చేసి యాప్ సెట్టింగ్స్‌ను ఓపెన్ చేయాలి.

నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునే వెసలుబాటు...

నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునే వెసలుబాటు...

సెట్టింగ్స్‌లోని Accessibility సెక్షన్‌ను సెలక్ట్ చేసుకున్న తరువాత స్ర్కీన్ కుడి చేతి వైపు చిన్న బాణం గుర్తుతో ఓ ఐకాన్ మీకు కనిపిస్తుంది. ఈ ఐకాన్ పై క్లిక్ చేసి యాప్‌ను నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునే వీలుంటుంది.

అడ్మినిస్ట్రిటేవ్ స్టేటస్ మీ చేతిలో...
 

అడ్మినిస్ట్రిటేవ్ స్టేటస్ మీ చేతిలో...

Button Savior యాప్ ద్వారా మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేయాలనుకున్నట్లయితే యాప్‌లోని ‘Advanced' టాబ్ పై క్లిక్ చేసి ‘Enable Lock Screen' ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ ఫంక్షన్‌‌ను ఎనేబుల్ చేసుకోవటం వల్ల అడ్మినిస్ట్రిటేవ్ స్టేటస్ కూడా మీకు లభిస్తుంది.

అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకున్నట్లయితే..

అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకున్నట్లయితే..

ఒకవేళ మీరు Button Savior యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా ‘Enable Lock Screen'ను డిసేబుల్ చేసుకోవల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Lets have a look on the great ways that will help you to control your android phone without using the hardware buttons with the help of apps that will let you to do that, so follow the guide stated below to proceed.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X