బ్రౌజ్ చేస్తున్నారా.? Online ads కంట్రోల్ చేయకుంటే మీ పని అయిపోయనట్లే

By Gizbot Bureau
|

స్మార్ట్ ఫోన్లు వచ్చిన తరువాత ప్రత ఒక్కరూ ఆన్‌లైన్లో గంటల కొద్దీ గడిపేస్తున్నారు. అయితే ఎక్కువ సమయం మీరు ఆన్‌లైన్లో ఉన్న విషయం తెలుసుకున్న యాడ్స్ కంపెనీలు మీ మీరు సెర్చ్ చేసే ప్రతి విషయాన్ని ట్రాకింగ్ చేస్తుంటాయి. మీరు బ్రౌజర్‌లో సెర్చ్ చేసే ప్రతి కీవర్డ్ సాయంతో మీకు ఆయా యాడ్స్ డిస్ ప్లే అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే మీకు తెలియకుండానే మీరు యాడ్స్ టార్గెట్ అవుతున్నారని గుర్తించలేకపోతున్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ డేటాను ట్రాక్ చేయకుండా యాడ్స్ కంట్రోల్ చేయవచ్చు. ఎలాంటి యాడ్స్ కనిపించకుండా బ్లాక్ చేయాల్సిన అవసరం లేకుండానే వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఎలానో ఓసారి చూద్దాం.

గూగుల్లో యాడ్స్ కంట్రోలింగ్
 

మొదటి పద్దతి

ముందుగా.. మీకో గూగుల్ అకౌంట్ ఉండాలి. ఒకవేళ లేదంటే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ లాగిన కాగానే మీకు కొన్ని మెనేజ్ మెంట్ సెట్టింగ్స్ కనిపిస్తాయి. Gmail ఓపెన్ చేశాక.. టాప్ రైట్ కార్నర్ మీ ప్రొఫైల్ పై క్లిక్ చేయండి. Privacy & Personalization రెండు ఆప్షన్లు ఉంటాయి. Manage your data & పర్సనలైజేషన్ మరో ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయగానే కొత్త Window ఓపెన్ అవుతుంది. ప్రైవసీ రిలేటెడ్ ఆప్షన్లు మరెన్నో కనిపిస్తాయి. Ads సంబంధిత ఆప్షన్లు కావాలంటే ఆ సెక్షన్ ఎంచుకోండి. Ad personalization block ఉంటుంది. Go సెలెక్ట్ చేసి.. Ad సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.

Ad personalization Settings

అక్కడ Ad personalization Settings ఓపెన్ చేయండి. డిఫాల్ట్ గా Ad personalization ఆప్షన్ ON ఉంటుంది. సింపుల్ గా OFF చేయండి చాలు.. గూగుల్.. యాడ్స్ ట్రాక్ చేయకుండా Stop చేస్తుంది. అక్కడ How your ads are personalized ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ బ్రాండ్లు, టాపిక్స్, ఇండస్ట్రీల డేటా డ్రాప్ లిస్టు కనిపిస్తుంది. ఆ భారీ జాబితాలో ఏ యాడ్స్ కంట్రోల్ చేయాలో దానిపై క్లిక్ చేయండి. Turn off అని బటన్ కనిపిస్తుంది. దానిపై Click చేస్తే సరిపోతుంది. ఎన్ని కావాలంటే అన్నింటిని Turn off చేసుకోవచ్చు. ఆయా యాడ్స్ ఇకపై మీరు చేసే బ్రౌజింగ్ ట్రాకింగ్ చేయలేవు.

Facebookలో Ads కంట్రోల్ 

గూగుల్ యాడ్స్ మాదిరిగానే ఫేస్ బుక్ లో కూడా యాడ్స్ వస్తుంటాయి. ఆ సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలో చూద్దాం.

 Facebook అకౌంట్
 

మీకు Facebook అకౌంట్ ఉందా? Login అవ్వండి. Top right కార్నర్‌లో menu Sectionపై క్లిక్ చేయండి.Arrow Point బటన్‌పై క్లిక్ చేయండి. Settings menu దగ్గర క్లిక్ చేయండి. Left side కిందిభాగంలో Ads సెక్షన్ Click చేయండి. Your ad preferences అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ Ad Settings (Wheel icon)పై క్లిక్ చేయండి. Ads Based on data from Partnersపై Tap చేయండి. Allowed అని డిఫాల్ట్ గా ఉంటుంది. దాన్ని Not Allowed గా మార్చండి.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
How to control the ads you see online

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X