2జిబి డేటాను జియో 4G అన్‌లిమిటెడ్ కింద మార్చుకోవడం ఎలా..?

Written By:

మీరు ప్రివ్యూ ఆఫర్ కింద జియో సిమ్ తీసుకున్నారా...సిమ్ యాక్టివేట్ అయిందా..అయితే మీరు డేటాను ఓ సారి చూసుకున్నట్లేయితే కేవలం 2జిబి డేటా మాత్రమే మీకు అందులో కనిపిస్తుంది. అలాగే 100 మినిట్స్ కాల్ తో పాటు 100 ఎసెమ్మెస్ లు మాత్రమే మీకు అక్కడ కనిపిస్తాయి. అన్ లిమిటెడ్ అనే ఆఫర్ మీకు కనపడదు. అయితే మీరు కొన్ని స్టెప్స్ ఫాలో అయితే ఈ 2 జిబి డేటాను 4జీ అన్ లిమిటెడ్ డేటా కింద మార్చుకోవచ్చు. అదెలాగో ఓ సారి ప్రయత్నించి చూడండి.

unlimited data,1Gbps స్పీడ్‌తో జియో బ్రాడ్‌బాండ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన మై జియో యాప్స్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయాలి.

స్టెప్ 2

తరువాత మీరు ప్లే స్టోర్‌లో కెళ్లి MyJio v3.2.05 APKను డౌన్‌లోడ్ చేసుకుని దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. లింక్ కోసం క్లిక్ చేయండి

స్టెప్ 3

యాప్ ఇన్‌స్టాల్ అయిన తరువాత మై జియో యాప్స్ ఓపెన్ చేసి అన్ని యాప్స్ వన్ బై వన్ ఇన్‌స్టాల్ చేయాలి

స్టెప్ 4

తరువాత మీరుhttp://jio.com/getmyjio లోకి వెళ్లి మీ జియో నంబర్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

స్టెప్ 5

మై జియో యాప్స్ అన్నీ ఇన్ స్టాల్ అయిన తరువాత డేటాను ఆపేసి మీ డివైస్ నుండి బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతున్న యాప్స్ అన్నీ క్లియర్ చేయాలి.

స్టెప్ 6

యాప్ సెట్టింగ్స్ లో కెళ్లి అక్కడ మై జియో యాప్ లో ఉన్న క్యాచీ అండ్ డేటాను క్లియర్ చేయండి

స్టెప్ 7

ఇప్పుడు డేటాను ఆన్ చేయాలి. ఆన్ చేసిన తరువాత మై జియో యాప్ లిస్ట్ దగ్గరకెళ్లండి. అయితే మళ్లీ వెంటనే డేటాను ఆపేసి మై జియో యాప్ ని ఓపెన్ చేయండి.

స్టెప్ 8

ఇప్పుడు డేటా ఆన్ చేసిన వెంటనే మై జియో యాప్ లో వెంటనే మీ నంబర్ తో లాగిన్ అవ్వండి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా లాగిన్ అవ్వండి.

స్టెప్ 9

మీ పాస్ వర్డ్ అలాగే ఫోన్ నంబర్ తో లాగిన్ అవ్వండి. కొద్ది సేపటి తరువాత మీకు activate Jio Preview offer అంటూ ఓ పాప్ అప్ కనిపిస్తుంది. అందులో సబ్ మిట్ బటన్ కనిపిస్తుంది. అది మీరు నొక్కారంటే కొన్ని యాప్స్ డౌన్ లోడ్ అవుతాయి.

స్టెప్ 10

వెంటనే మీ 2 జిబి డేటా 90 రోజుల అన్ లిమిటెడ్ ప్రివ్యూ ఆఫర్ కిందకు మారిపోతుంది. ఇది మీరు ఫస్ట్ టైం సాధించలేకపోతే రెండు మూడు సార్లు ట్రై చేయండి. విజయం సాధించే అవకాశం ఉంది.

స్టెప్ 11

ఇది కేవలం ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం ఆధారంగా మీకు ఇవ్వడం జరిగింది. కరెక్ట్ గా వస్తుందని చెప్పలేము. ఒకవేళ వస్తే మీరు సక్సెస్ అయినట్లే..

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to convert 2GB data and activate Jio Preview offer for unlimited 4G read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot