PDF ఫైల్‌ను Excel షీట్ రూపంలోకి మార్చడం ఎలాగో తెలుసా?

|

చాలా మంది ప్రజలు తమ యొక్క అధిక డేటాను సేవ్ చేసుకోవడానికి అధికంగా PDF డాక్యుమెంట్ ను వాడుతూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలిజీతో ఫోటోలను కూడా PDF రూపంలోకి మారుస్తున్నారు. ఇది తక్కువ మరియు సరసమైన మొత్తంలో అధిక మొత్తాన్ని సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

convert pdf to excel

convert pdf to excel

అయినప్పటికీ PDF లో ఏదైన బాక్స్ లలో గల డేటాను సవరించడం అంత సులభం కాదు. PDF డాక్యుమెంట్ లో ఏదైనా పట్టికను తీయడం లేదా స్ప్రెడ్‌షీట్ ఆకృతిలో వచనాన్ని సవరించాలనుకునే పరిస్థితులలో మీరు PDF ని Excel ఫైల్ గా మార్చడం ద్వారా మీ యొక్క పనిని అతి త్వరగా పూర్తి చేయవచ్చు. పిడిఎఫ్‌ను ఎక్సెల్ షీట్ గా ఎలా మార్చాలో తెలుసుకోవడానికి కింద ఉన్న పద్దతులను పాటించండి.

 

Also Read: JPG ఫైల్‌ను PDF రూపంలోకి మార్చడం ఎలా?Also Read: JPG ఫైల్‌ను PDF రూపంలోకి మార్చడం ఎలా?

 

 

 

PDF ను Excel షీట్ గా మార్చే పద్ధతులు

PDF ను Excel షీట్ గా మార్చే పద్ధతులు

PDF ఫైల్ ‌ను Excel షీట్ గా రెండు రకాల పద్దతులలో మార్చవచ్చు. దీనిని ఆన్‌లైన్‌ మరియు ఆఫ్ లైన్ రెండు పద్దతులలోను మార్చవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా మార్చడానికి వినియోగదారులు డేటాను వినియోగించవలసి ఉంటుంది. కానీ ఆఫ్ లైన్ ద్వారా చేయడానికి అవసరం ఉండదు. ఈ పద్దతులను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

PDF ను Excel షీట్ గా మార్చే విధానం ఆన్‌లైన్‌లో
 

PDF ను Excel షీట్ గా మార్చే విధానం ఆన్‌లైన్‌లో

PDF ను Excel షీట్ గా మార్చే ఆన్‌లైన్‌ పద్ధతి పూర్తిగా ఉచితం. ఇది విండోస్ 10, మాకోస్, ఆండ్రాయిడ్ మరియు iOS వంటి అన్ని ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్‌లలో పనిచేస్తుంది. ఈ పద్ధతిని ఉపయోగించడానికి మీకు ఎటువంటి మూడవ పార్టీ యాప్ ను డౌన్‌లోడ్ చేయవలసిన అవసరం కూడా లేదు. కింద ఉన్న దశలను అనుసరించండి.


1. మొదటగా Ilovepdf.com ని ఓపెన్ చేసి అందులో PDF to Excel ని ఎంచుకోండి.

2. తదుపరి స్క్రీన్‌లో మీరు Excel షీట్ లోకి మార్చవలసిన PDF ని ఎంచుకోవడానికి PDF ఫైల్‌ను ఎంచుకోండి అనే బట్టెన్ మీద క్లిక్ చేయండి.

3. ఫైల్ అప్‌లోడ్ అయిన తర్వాత కన్వర్ట్ Excel ఎంపిక మీద నొక్కండి.

4. తదుపరి స్క్రీన్‌లో మార్చబడిన ఎక్సెల్ షీట్ ను సేవ్ చేయడానికి డౌన్‌లోడ్ Excel ఎంపిక మీద నొక్కండి.

5. smallpdf.com, pdf2go.com లేదా hipdf.com వెబ్‌సైట్‌ల ద్వారా కూడా పిడిఎఫ్‌ను ఎక్సెల్‌గా మార్చవచ్చు.

 

PDF ని ఎక్సెల్‌గా ఆఫ్‌లైన్‌లో మార్చే పద్ధతులు

PDF ని ఎక్సెల్‌గా ఆఫ్‌లైన్‌లో మార్చే పద్ధతులు

ఏదైనా PDF ఫైల్ ను ఎక్సెల్ షీట్ గా ఆఫ్‌లైన్‌లో సులభంగా మార్చడానికి ఈ దశలను అనుసరించండి.


1. అడోబ్ అక్రోబాట్ DC లో ఏదైనా PDF ఫైల్‌ను ఓపెన్ చేయండి.

2. Tools ఎంపికను ఎంచుకోండి > ఇందులో ఎక్సపోర్ట్ PDF ఎంపికను ఎంచుకోండి.

3. కన్వర్ట్ టు ఎంపికను క్లిక్ చేసిన తరువాత మీ యొక్క పైల్ ఆకృతి కోసం స్ప్రెడ్‌షీట్‌ను ఎంచుకోండి.

4. తరువాత క్రొత్త ఫైల్‌ను ఎక్సెల్ పద్దతిలో సేవ్ చేయడానికి ఎక్సపోర్ట్ ఎంపిక మీద క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

English summary
How to Convert PDF File to Excel Sheet

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X