Home
How to

క్వాలిటీ దెబ్బతినకుండా PNG ఫార్మాట్‌ ఫోటోలను JPGలోకి కన్వర్ట్ చేసుకోవటం ఎలా..?

ఇంటర్నెట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాత ఫోటో ఎడిటింగ్ అనేది చాలా సులభతరంగా మారిపోయింది.

By Bommu Sivanjaneyulu

ఇంటర్నెట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాత ఫోటో ఎడిటింగ్ అనేది చాలా సులభతరంగా మారిపోయింది. ఫోటో క్వాలిటీని కంప్రెస్ చేయటం, ఫోటోను ఒక ఫార్మాట్ నుంచి మరొక ఫార్మాట్‌కు కన్వర్ట్ చేయటం వంటి పనులు ఆన్‌లైన్‌లో చకచకా జరిగిపోతున్నాయి. నేటి ప్రత్యేక కథనంలో ఇమేజ్ క్వాలిటీ అనేది దెబ్బతినకుండా PNG ఫార్మాట్‌లో ఉన్న ఫోటోలను JPGలోకి కన్వర్ట్ చేసుకునే సింపుల్ ప్రొసీజర్‌లను మీకు తెలియజేస్తన్నాం.

Xnconvert అనే టూల్‌ను ఉపయోగించుకుని..
మొదటి పద్థతిలో భాగంగా Xnconvert అనే టూల్‌ సహాయంతో ఫోటోలను కావల్సిన ఫార్మాట్‌లోకి ఛేంజ్ చేసుకోవచ్చు. క్రాస్- ప్లాట్‌ఫామ్ ఇమేజ్ ప్రాసెసర్‌తో వస్తోన్న ఈ ఉచిత ప్రోగామ్ 80 యాక్షన్‌లను కంభైన్ చేయటంత పాటు 500 ఫార్మాట్‌లను సపోర్ట్ చేయగలుగుతుంది.

How To Convert PNG Photos to JPG Without Losing Quality

ఇంటర్‌ఫేస్ ఓపెన్ అవుతుంది..
Xnconvert టూల్‌ మీ కంప్యూటర్‌లో లాంచ్ అయిన వెంటనే ఎడిటింగ్‌కు అవసరమైన ఇంటర్‌ఫేస్ ఓపెన్ అవుతుంది. ఈ ఇంటర్‌ఫేస్‌లో కనిపించే అవుట్ సెక్షన్ సెట్టింగ్స్‌ను కావల్సిన విధంగా ఎడిట్ చేసుకునే వీలుంటుంది.

సెట్టింగ్స్‌ను మాడిఫై చేసుకున్న తరువాత...
సెట్టింగ్స్‌ను మాడిఫై చేసుకున్న తరువాత Add files బటన్ పై క్లిక్ చేసి JPG ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేయాలనుకుంటోన్న అన్ని PNG ఫోటోలను యాడ్ చేసుకోవల్సి ఉంటంది. ఫోటోలు యాడ్ అయిన వెంటనే వాటికి సంబంధించిన thumbnails స్ర్కీన్ పై కనిపిస్తాయి. అంతా ఓకే అనుకున్న తరువాత Convert బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఫోటోలు ఒక ఫార్మాట్ నుంచి మరొక ఫార్మాట్‌కు కన్వర్ట్ కాబడతాయి.

MS Paint ద్వారా ఫోటో ఫార్మాట్‌ను మార్చుకోవచ్చు..?
మరొక పద్థతిలో భాగంగా విండోస్ అందిస్తోన్న MS Paint టూల్ ద్వారా కూడా ఫోటో ఫార్మాట్‌ను ఛేంజ్ చేసుకునే వీలుంటుంది. ఈ టూల్ ద్వారా ఫోటోలను కన్వర్ట్ చేసుకోవాలనుకునే వారు ముందగా PNG ఫోటోను సెలక్ట్ చేసుకుని ఆ ఫోటో పై రైట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయ్యే డ్రాప్-డౌన్ మెనూలో 'Open with Paint' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఇప్పుడు ఆటోమెటిక్‌ ఆ ఫోటో MS Paint యాప్‌లో లోడ్ అయిపోతుంది. తదుపరి స్టెప్‌లో భాగంగా MS Paintలోని ఫైల్ మెనూలోకి వెళ్లి Save As ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని 'JPEG Picture'ను సెలక్ట్ చేసుకున్నట్లయితే ఫోటో ఆటోమెటిక్‌గా JPEG ఫార్మాట్‌లో సేవ్ అవుతుంది.

Best Mobiles in India

English summary
In this article, we have discussed how to convert the PNG format to JPEG-JPG jpeg with a single click using the tool Xnconvert and Paint.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X