మీ స్మార్ట్‌ఫోన్‌లోనే వర్డ్ డాక్యుమెంట్ ని PDFగా మార్చడం ఎలా?

|

స్మార్ట్‌ఫోన్‌ల అవసరం ప్రస్తుత రోజులలో అధికంగా ఉంది. స్మార్ట్‌ఫోన్‌ల సాయంతో మనం కాల్ చేయడం, చాటింగ్ చేయడం నుండి ఫోటోలను మరియు వీడియోలను పంపడం వరకు మరియు ముఖ్యమైన డాక్యుమెంట్లను పంచుకోవడం వంటి అన్ని రకాల పనులను చేస్తాము. అందుకే ఇటువంటి చాలా విషయాలను పూర్తి చేయడం కోసం ఈ ఒక చిన్న గాడ్జెట్ ను ఉపయోగిస్తూ ఉంటారు. మీరు తరచుగా చేసే వర్క్ డాక్యుమెంట్ లను ముఖ్యమైన వారితో షేర్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు.

 

PDF

అయితే వివిధ ప్రయోజనాల కోసం కొన్నిసార్లు వాటిని PDF గా తీసుకుంటే మరొకసారి వర్డ్ డాక్యుమెంట్ గా పంపవలసి ఉంటుంది. కానీ కొందరు ఇప్పటికీ డాక్యుమెంట్‌ను వర్డ్ నుండి పిడిఎఫ్‌కి మార్చడానికి కంప్యూటర్ లేదా లాప్ టాప్ ని ఉపయోగిస్తూ కష్టపడుతున్నారు. ఇలా చేయడానికి అధిక సమయం పడుతుంది మరియు కష్టం కూడా అలాగే ఉంటుంది. ఈ విధానాన్ని మార్చి కేవలం మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌తోనే డాక్యుమెంట్‌ను వర్డ్ నుండి పిడిఎఫ్‌గా ఎలా మార్చాలి అని తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

స్మార్ట్‌ఫోన్‌ హ్యాండ్‌సెట్

మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌ హ్యాండ్‌సెట్ ని ఉపయోగించి వర్డ్ డాక్యుమెంట్ ని పిడిఎఫ్ గా మార్చడం అనేది ఇకపై రాకెట్ సైన్స్ కాదని మరియు సులభంగా చేయవచ్చు అని తెలుసుకోండి. ఇందుకోసం మీరు ఒక మంచి అప్లికేషన్ ను కలిగి ఉంటే సరిపోతుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో డాక్యుమెంట్ ని సవరించడానికి మిమ్మల్ని అనుమతించే కొన్ని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి అనువుగా ఉన్నాయని తెలుసుకొండి. కానీ మీరు మీ పరికరంలో డాక్యుమెంట్‌ను సవరించడానికి మరియు PDFకి మార్చడానికి సరైన యాప్‌ను కనుగొనలేకపోతే కనుక అదనపు సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయకుండా కొన్ని చిట్కాల సాయంతో సులభంగా మార్చవచ్చు.

మీ స్మార్ట్‌ఫోన్‌లోనే వర్డ్ డాక్యుమెంట్ ని PDFగా మార్చే విధానం
 

మీ స్మార్ట్‌ఫోన్‌లోనే వర్డ్ డాక్యుమెంట్ ని PDFగా మార్చే విధానం

స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో వెబ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: గూగుల్ సెర్చ్ కి వెళ్లి, "ఇమేజ్ టూ pdf క్రియేటర్" అని టైప్ చేయండి.

స్టెప్ 3: కన్వర్టింగ్ పేజీ ఓపెన్ చేసిన తర్వాత మీరు మార్చాలనుకుంటున్న ఇమేజ్ ని అప్‌లోడ్ చేయండి.

స్టెప్ 4: అప్‌లోడ్ చేసిన తర్వాత క్రియేట్ PDF ఎంపిక మీద క్లిక్ చేయండి.

స్టెప్ 5: మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ వస్తుంది. ఆ డౌన్‌లోడ్‌ ఎంపిక మీద క్లిక్ చేయండి.

స్టెప్ 6: ఈ విధానాలను అనుసరించడంతో సులభంగా PDF ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

 

గూగుల్ డాక్స్ నుండి pdfని మార్చే విధానం

గూగుల్ డాక్స్ నుండి pdfని మార్చే విధానం

** ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో 'గూగుల్ డాక్స్' ని ఇన్‌స్టాల్ చేయండి.

** ఇప్పుడు గూగుల్ డాక్స్‌లో వర్డ్ డాక్యుమెంట్ లేదా ఎక్సెల్ ఫైల్‌లను అప్‌లోడ్ చేయండి.

** ఇప్పుడు ఈ ఫైల్‌లను గూగుల్ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నించండి.

** ఇప్పుడు గూగుల్ డిస్క్‌లో డాక్యుమెంట్ ని సెర్చ్ చేయండి.

** ఆపై దానిని డాక్స్‌లో అప్‌లోడ్ చేయండి.

** ప్లస్ గుర్తుపై క్లిక్ చేయడం ద్వారా PDFని రూపొందించే పోస్ట్ చేయండి.

** తరువాత కొత్త డాక్యుమెంట్ లేదా కొత్త టెంప్లేట్‌ని ఎంచుకోండి.

** అవసరమైన సమాచారాన్ని జోడించండి లేదా మీ యొక్క అవసరాలకు అనుగుణంగా దానిని సవరించండి.

** ఇప్పుడు మీరు కుడివైపు ఎగువ మెనులో మూడు చుక్కలను చూస్తారు. దాని మీద క్లిక్ చేయండి.

** షేర్ మరియు ఎక్సపోర్ట్ ఎంపికను ఎంచుకోండి.

** ఇప్పుడు సేవ్ ఎంపికను ఎంచుకోండి.

** ఫార్మాట్ లో PDF డాక్యుమెంట్‌గా ఎంచుకోని 'OK'పై క్లిక్ చేయండి.

** తరువాత PDFని ఎక్సపోర్ట్ చేయండి.

** తరువాత ఎగువన ఉన్న 'డౌన్‌లోడ్' బటన్‌పై క్లిక్ చేయండి. ఇలా చేయడంతో మీరు మీ హ్యాండ్‌సెట్‌లో PDFని పొందుతారు.

 

Best Mobiles in India

English summary
How to Convert Word Document to PDF Format Using Your Smartphone?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X