వాట్సాప్ స్టిక్కర్‌గా మీ యొక్క ఫోటోను మార్చడం ఎలా?

|

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన వాట్సాప్ రెండు బిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. ఇది తమ యొక్క వినియోగదారులు ఒకరితో మరొకరు కనెక్ట్ అవ్వడానికి మరియు మెరుగైన కమ్యూనికేషన్ కోసం కొత్త ఫీచర్‌లను పరిచయం చేయడం ద్వారా తన యొక్క ప్లాట్‌ఫారమ్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ఇది వినియోగదారుల యొక్క అభిప్రాయాలను సృజనాత్మకంగా వ్యక్తీకరించడానికి వీలు కల్పించే కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కూడా కలిగి ఉంది.

 
వాట్సాప్ స్టిక్కర్‌గా మీ యొక్క ఫోటోను మార్చడం ఎలా?

ఇది GIFలు మరియు డూడుల్‌లను షేర్ చేయగల సామర్థ్యాన్ని అందించడమే కాకుండా స్టిక్కర్‌లు మరియు యానిమేటెడ్ స్టిక్కర్‌లను కూడా కలిగి ఉంటుంది. స్టిక్కర్లు మరియు GIFలను తరచుగా ఎక్కువ మంది ఉపయోగించే వారి కోసం వాట్సాప్ కొత్త స్టిక్కర్‌లు మరియు యానిమేటెడ్ స్టిక్కర్‌లతో తమ స్టోర్‌ని అప్‌డేట్ చేస్తూ ఉంది. ఇటీవల వాట్సాప్ ప్రసిద్ధ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ యొక్క సీజన్ 4 వాల్యూమ్ 1 ప్రారంభోత్సవాన్ని జరుపుకోవడానికి అనుబంధించబడిన స్టిక్కర్ ప్యాక్‌ను కూడా విడుదల చేసింది. మీరు స్ట్రేంజర్ థింగ్స్ అభిమాని అయితే కనుక మీరు యాప్‌లో స్ట్రేంజర్ థింగ్స్ స్టిక్కర్ ప్యాక్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వాట్సాప్ స్టిక్కర్‌గా మీ యొక్క ఫోటోను మార్చడం ఎలా?

మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ ని వినియోగించే వినియోగదారుల యొక్క వారి స్వంత ఫోటోలను అంటే వారు తమ ఫోన్ కెమెరాలను ఉపయోగించి క్లిక్ చేసిన ఫోటోలను స్టిక్కర్‌లుగా మార్చడానికి అనుమతిస్తుంది. కానీ ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి ఇవి కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అన్నింటిలో మొదటిది వాట్సాప్ యొక్క స్టిక్కర్ మేకర్ ఫీచర్ దాని ఆండ్రాయిడ్ మరియు iOS ఆధారిత యాప్‌లలో అందుబాటులో లేదు. ఈ ఫీచర్ కేవలం వాట్సాప్ వెబ్ మరియు వాట్సాప్ యొక్క డెస్క్‌టాప్ ఆధారిత యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా వాట్సాప్ వినియోగదారులు తమ ఫోటోలను యానిమేటెడ్ స్టిక్కర్లుగా మార్చడానికి దాని స్టిక్కర్ మేకర్ ఫీచర్‌ను ఉపయోగించలేరు. దీనర్థం వారు తమ ఫోటోలతో సృజనాత్మకంగా ప్రయోగాలు చేయగలిగినప్పటికీ ఈ స్టిక్కర్‌లలో యానిమేషన్‌ను జోడించలేరు.

మీ ఫోటోను WhatsApp స్టిక్కర్‌గా మార్చే విధానం

వాట్సాప్ స్టిక్కర్‌గా మీ యొక్క ఫోటోను మార్చడం ఎలా?

స్టెప్ 1: మీ PCలో డెస్క్‌టాప్ లో వాట్సాప్ వెబ్ ద్వారా వాట్సాప్ ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: మీరు స్టిక్కర్‌ను షేర్ చేయాలనుకుంటున్న చాట్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 3: విండో యొక్క దిగువభాగంలో ఎడమవైపు మూలలో ఉన్న పేపర్‌క్లిప్ చిహ్నంపై క్లిక్ చేయండి.

స్టెప్ 4: ఇప్పుడు ఫోటోలు మరియు వీడియోల ఆప్షన్ పైన కుడివైపు కనిపించే స్టిక్కర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 5: మీరు స్టిక్కర్‌గా మార్చాలనుకుంటున్న ఫోటోను ఎంచుకోండి.

స్టెప్ 6: మీరు అలా చేసిన తర్వాత ఎడిటింగ్ టూల్స్‌తో కూడిన కొత్త విండో ఓపెన్ చేయబడుతుంది. స్టిక్కర్‌గా మార్చిన మీ ఫోటోలో మార్పులను చేయండి.

స్టెప్ 7: కావాలంటే దిగువన ఏదైనా మెసేజ్ వ్రాసి 'సెండ్' బటన్‌ను నొక్కండి.

Best Mobiles in India

English summary
How to Convert Your personal Photo into a WhatsApp Sticker

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X