ఆండ్రాయిడ్ & ఐఫోన్‌లోని ఫోటోల నుండి టెక్స్ట్ ని కాపీ చేయడం ఎలా?

|

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్‌లో అధిక సమయం గడుపుతూ ఉంటారు. స్మార్ట్‌ఫోన్‌లను అధిక సమయం గడుపుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని ఆకట్టుకునే అనేక విషయాలు ఉండవచ్చు. ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు మీరు టెక్స్ట్ తో కూడిన అనేక ఫోటోలను చూడవచ్చు. వీటిలో చాలా ముఖ్యమైన సమాచారం ఉండి మిమ్మల్ని ఆకట్టుకుంటే కనుక మీరు దీనిని ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో లేదా యాప్‌లలో దానిని టెక్స్ట్‌గా ఉపయోగించాలనుకుంటే కనుక మీకు కొన్ని మార్గాలు ఉన్నాయి. గూగుల్ లెన్స్ వంటి కొన్ని టూల్స్ మరియు కొన్ని ఇతర యాప్‌లు ఫొటోలోని టెక్స్ట్ ని కాపీ చేసి ఆండ్రాయిడ్, iOS మరియు PCలో మీకు కావలసిన చోట ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. అయితే దీన్ని ఎలా ఉపయోగించాలి అని ఆలోచిస్తుంటే కనుక కింద గల దశలవారి గైడ్ ని అనుసరించండి.

 
ఆండ్రాయిడ్ & ఐఫోన్‌లోని ఫోటోల నుండి టెక్స్ట్ ని కాపీ చేయడం ఎలా?

ఆండ్రాయిడ్ & ఐఫోన్‌లోని ఫోటోల నుండి టెక్స్ట్ ని కాపీ చేసే విధానం

గూగుల్ లెన్స్

ఆండ్రాయిడ్ & ఐఫోన్‌లోని ఫోటోల నుండి టెక్స్ట్ ని కాపీ చేయడం ఎలా?

** ముందుగా "గూగుల్ లెన్స్" యాప్‌కి వెళ్లి సైడ్ ఇమేజ్ ని ఓపెన్ చేయండి.

** పైకి స్వైప్ చేస మీరు టెక్స్ట్ ని కాపీ చేయాలనుకుంటున్న ఇమేజ్ ని ఎంచుకోండి.

** ఇప్పుడు మీరు కాపీ చేయాలనుకుంటున్న టెక్స్ట్‌పై ఎక్కువసేపు నొక్కి ఉంచండి.

** ఇది పూర్తయిన తర్వాత స్క్రీన్ దిగువన ఉన్న "టెక్స్ట్ కాపీ" ఎంపికను ఎంచుకోండి.

** ఇప్పుడు మీకు కావలసిన చోట టెక్స్ట్ ని పేస్ట్ చేయండి.

మీకు అవసరమైన టెక్స్ట్ క్లిప్‌బోర్డ్‌లో కాపీ చేయబడుతుంది. ఇది వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లలో కూడా అధిక సమయం నొక్కి ఉంచడం ద్వారా పేస్ట్ చేయవచ్చు.

గూగుల్ ఫొటోస్ వెబ్

ఆండ్రాయిడ్ & ఐఫోన్‌లోని ఫోటోల నుండి టెక్స్ట్ ని కాపీ చేయడం ఎలా?

** బ్రౌజర్‌ని ఓపెన్ చేసి గూగుల్ ఫొటోస్ వెబ్‌కి వెళ్లి మీ అకౌంటుతో సైన్ ఇన్ చేయండి.

** ఇప్పుడు ఏదైనా ఇమేజ్ ని ఎంచుకోండి మరియు టెక్స్ట్‌తో ఓపెన్ చేయండి.

** కుడివైపు ఎగువ మూలలో ఉన్న "ఇమేజ్ నుండి టెక్స్ట్ ని కాపీ చేయండి" ఎంపికపై క్లిక్ చేయండి. ఫోటోలో టెక్స్ట్ ఉంటే మాత్రమే ఈ ఎంపిక కనిపిస్తుంది.

** ఇప్పుడు డిష్ చేయాల్సిన ఇమేజ్ ని ఎంచుకుని, "కాపీ టెక్స్ట్"పై క్లిక్ చేయండి.

** కాపీ చేసిన తరువాత టెక్స్ట్ ని ఏదైనా క్లిప్‌బోర్డ్‌లో కాపీ చేయవచ్చు.

ఆండ్రాయిడ్ & ఐఫోన్‌లోని ఫోటోల నుండి టెక్స్ట్ ని కాపీ చేయడం ఎలా?

ముఖ్యంగా మీరు చేతితో వ్రాసిన నోట్ లను కాపీ చేయాలనుకున్నప్పుడు, pdf ఫైల్ లేదా స్క్రీన్‌షాట్ నుండి టెక్స్ట్ ని కాపీ చేయాలనుకున్నప్పుడు లేదా వేరే భాషలోని టెక్స్ట్ ని చదవడానికి ప్రయత్నించినప్పుడు ఇమేజ్ నుండి టెక్స్ట్ ని కాపీ చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. గూగుల్ ఫోటోలు ఉపయోగించని iOS వినియోగదారులు ఆపిల్ యొక్క గ్యాలరీ యాప్ కోసం అదే విధానాన్ని అనుసరించవచ్చు. అదనంగా వినియోగదారులు ఏదైనా ఇమేజ్ నుండి టెక్స్ట్ ని కాపీ చేయడానికి onlineocr.net, brandfolder.com, imagetotext.info వంటి మరిన్ని ఆన్‌లైన్ OCR సేవలను కూడా ఉపయోగించవచ్చు.

Best Mobiles in India

English summary
How to Copy Text From Photos on Android, iPhone: Here are The Step by Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X