మీ ఓటర్ ఐడీలో తప్పులా..? సరిచేసుకునేందుకు సింపుల్ టిప్స్

ఓటు గుర్తింపు కార్డు జారీ విషయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.

|

వేగంగా విస్తరిస్తోన్న టెక్నాలజీ సమాచార వ్యవస్థ రూపురేఖలనే మార్చేస్తోంది. ముఖ్యంగా ఓటు గుర్తింపు కార్డు జారీ విషయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ఓటర్ ఐడీని పొందాలంటే సంవత్సరాల తరబడి వెయిట్ చేయవల్సి వచ్చేది. టెక్నాలజీ పూర్తిస్తాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ ప్రొసీజర్ మొత్తం 3 నుంచి 6 నెలల వ్యవధిలో ముగిసిపోతోంది. ఓటర్ ఐడీకి దరఖాస్తు చేసకోవటం మొదలుకుని ఆ కార్డును ఐడీ రూపంలో ప్రింట్ తీసుకోవటం వరకు ప్రొసీజర్ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరిగిపోతోంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన మరో ఫీచర్‌లో భాగంగా ఓటర్ ఐడీలో చోటుచేసుకునే తప్పులను కూడా ఆన్‌లైన్ ద్వారానే సవరించుకోవచ్చు. ఆ ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

JioJuiceతో దుమ్మురేపిన ముకేష్ అంబానీ, యూజర్లకు పండగే, పూర్తి వివరాలు ఇవేJioJuiceతో దుమ్మురేపిన ముకేష్ అంబానీ, యూజర్లకు పండగే, పూర్తి వివరాలు ఇవే

 NVSP Form 8 ద్వారా...

NVSP Form 8 ద్వారా...

ముందుగా నేషనల్ ఓటర్ సర్వీసెస్ పోర్టల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. సైట్‌లోకి లాగిన్ అయిన తరువాత కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎలక్టోరల్ రోల్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్న వెంటనే NVSP Form 8 ఓపెన్ అవుతుంది.

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్...

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్...

ఈ పేజీలో తొలత మీకు భాషను సెలక్ట్ చేసుకుని మిగిలిన డిటెయిల్స్‌ను ఫిల్ చేయవల్సి ఉంటుంది. రాష్ట్రం, నియోజిక వర్గం వంటి స్థానిక వివరాలతో పాటు మీ వ్యక్తిగత వివరాలను కూడా ఎంటర్ చేయవల్సి ఉంటుంది. అన్ని వివరాలను ఎంటర్ చేసిన తరువాత పేజీ క్రింది భాగంలో కనిపించే సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ విజయవంతంగా సబ్మిట్ కాబడుతుంది. ఈ ప్రాసెస్ విజయవంతంగా పూర్తయిన వెంటనే మీ మెయిల్ ఐడీకి అప్లికేషన్ డిటెయిల్స్ పంపబడతాయి. వీటి ద్వారా మీ ఓటర్ ఐడీ అప్లికేషన్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే వీలుంటుంది.

 30 రోజుల్లో కొత్త కార్డ్ ఇష్యూ కాబడుతుంది..

30 రోజుల్లో కొత్త కార్డ్ ఇష్యూ కాబడుతుంది..

మరొక పద్ధతిలో భాగంగా ఫిల్ చేసిన ఫామ్ 8ను ప్రింట్ తీసుకుని మీ సమీపంలో ఉన్న ఎలక్టోరల్ కార్యాలయంలో సబ్మిట్ చేసినట్లయితే కరెక్షన్ ప్రాసెస్ మొాదలవుతుంది. ఓటర్ ఐడీ వెరిఫికేషన్ సమయంలో బర్త్ సర్టిఫికేట్, పాన్‌కార్డ్, పాస్‌పోర్ట్ వంటి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయవల్సి ఉంటుంది. ఓటర్ ఐడీ కరెక్షన్ ప్రాసెస్ 30 రోజుల్లోపు పూర్తి కాబడుతుంది. కరెక్షన్ పూర్తియిన వెంటనే కొత్త ఓటర్ ఐడీ మీకు ఇష్యూ చేయబడుతుంది.

జూలై 1 నుంచి ఆధార్ ఫేస్ రికగ్నిషన్, అసలేంటిది, మీ కోసం పూర్తి వివరాలు

జూలై 1 నుంచి ఆధార్ ఫేస్ రికగ్నిషన్, అసలేంటిది, మీ కోసం పూర్తి వివరాలు

 లింక్ లింక్

Best Mobiles in India

English summary
The good news is that it is possible to apply for voter ID correction online We know some people whose names are incorrect on their voter IDs and others whose addresses are wrong and all of these things can be fixed via voter ID correction online.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X