Just In
- 1 hr ago
Croma లో ల్యాప్ టాప్ లు ,స్మార్ట్ టీవీ లు & గాడ్జెట్ లపై భారీ ఆఫర్లు
- 1 hr ago
Qualcomm కంపెనీ కొత్తగా రెండు చిప్సెట్లను విడుదల చేసింది!! ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసా...
- 3 hrs ago
అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్స్ లో టాబ్లెట్ల కొనుగోలుపై ఊహించని తగ్గింపు ఆఫర్లు....
- 19 hrs ago
స్పామ్ కాల్లతో విసిగిపోయారా? అయితే ఇలా బ్లాక్ చేయండి...
Don't Miss
- News
కాంగ్రెస్ రచ్చబండను అడ్డుకున్న టీఆర్ఎస్... కరీంనగర్ జిల్లాలో రచ్చబండలో ఉద్రిక్తత
- Sports
ఆ క్షణం నాలోకి డేవిడ్ వార్నర్ ప్రవేశించాడు: రవిచంద్రన్ అశ్విన్
- Lifestyle
Benefits of Green Tea for Skin:గ్రీన్ టీతో ఆరోగ్యమే కాదు.. అందాన్నీ పెంచుకోవచ్చు.. అదెలాగో చూడండి...
- Finance
Business Ideas: నర్సరీల ద్వారా రూ. లక్ష వరకు ఆదాయం: ఉపాధి హామీ పథకంతో లింక్
- Movies
Karthika Deepam నిరుపమ్ నాకు పడటం అదృష్టం.. నీకు దురదృష్టం.. హిమతో శౌర్య
- Automobiles
రూ.3.2 కోట్ల ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ కాంట్రావర్సీ క్వీన్..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Windows 11లో గెస్ట్ అకౌంటును సృష్టించడం ఎలా?
ఎవరైనా సరే ల్యాప్‌టాప్ లేదా PCని ఉపయోగిస్తున్నప్పుడు ఇతరులు వారి యొక్క వ్యక్తిగత లేదా వృత్తిపరమైన ఫైల్‌లను చూడకుండా ఉండడం కోసం విండోస్ 11లో గెస్ట్ అకౌంటును సృష్టించడం అనేది ఒక తెలివైన నిర్ణయం. అయితే కొత్త విండోస్ 11లో గెస్ట్ అకౌంటును జోడించడం అనేది విండోస్10లో ఉన్న దానికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కావున మీరు మీ యొక్క PC లో విండోస్11 ని ఉపయోగిస్తూ ఉండి అందులో గెస్ట్ అకౌంటును ఎలా సృష్టించాలో అని ఆలోచిస్తుంటే కనుక కింద ఉన్న దశల వారి మార్గాన్ని అనుసరించండి. మీరు విండోస్ 11లో గెస్ట్ అకౌంటును సృష్టించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ కూడా మేము రెండు సులభమైన పద్ధతులను చూపుతాము. వాటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

సెట్టింగ్‌ల నుండి గెస్ట్ అకౌంటును సృష్టించడం
1. ముందుగా విండోస్ + I షార్ట్ కట్ కీని నొక్కడం ద్వారా మీ విండోస్ 11 మెషీన్‌లో సెట్టింగ్‌లను ఓపెన్ చేయవచ్చు.
2. ఇప్పుడు ఎడమవైపు సైడ్‌బార్‌లోని అకౌంట్ ఎంపికని కనుగొని దానిపై క్లిక్ చేయండి.
3. ఫ్యామిలీ & అదర్ యూజర్స్ ఎంపికపై క్లిక్ చేయండి.
4. ఇక్కడ "యాడ్ అకౌంట్" ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా గెస్ట్ అకౌంటును జోడించవచ్చు.

5. మీరు యాడ్ అకౌంట్ ఎంపికపై క్లిక్ చేసిన తర్వాత మీరు సైన్ ఇన్ చేయడానికి పాప్-అప్ పొందుతారు. కానీ గెస్ట్ అకౌంటును సృష్టిస్తున్నందున మైక్రోసాఫ్ట్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ చేయవలసిన అవసరం లేదు. కాబట్టి "ఈ వ్యక్తి యొక్క సైన్-ఇన్ సమాచారం నా దగ్గర లేదు"పై క్లిక్ చేయండి.
6. తరువాత "Add a user without a Microsoft account" ఎంపికపై క్లిక్ చేయండి.
7. గెస్ట్ అకౌంట్ కోసం పేరు, పాస్‌వర్డ్ మరియు సెక్యూరిటీ ప్రశ్నలు వంటి అన్ని వివరాలను జోడించి 'నెక్స్ట్' ఎంపికపై నొక్కండి.
ఈ విధానాన్ని అనుసరించడంతో మీరు గెస్ట్ అకౌంటును విజయవంతంగా సృష్టించగలుగుతారు. మీరు ఈ పద్ధతిని కొంచెం పొడవుగా భావిస్తే కనుక మరొక పద్ధతిని ప్రయత్నించండి.
కమాండ్ ప్రాంప్ట్ ఉపయోగించి ఒక-క్లిక్‌లో గెస్ట్ అకౌంటును సృష్టించడం

1. కమాండ్ ప్రాంప్ట్ కోసం సెర్చ్ చేయండి మరియు దానిని అడ్మినిస్టేటర్ గా అమలు చేయండి.
2. కమాండ్ ప్రాంప్ట్‌లో net user rohit /add /active:yes వంటి కమాండ్ ని టైప్ చేయండి లేదా పేస్ట్ చేయండి.
3. మీరు పై కమాండ్ ని జోడించి ఎంటర్ నొక్కిన తర్వాత మీ గెస్ట్ అకౌంట్ విజయవంతంగా సృష్టించబడుతుంది.
మీరు పాస్‌వర్డ్‌ను సెటప్ చేయాలనుకుంటే కనుక మొదటి పద్ధతిలో మూడు దశలను అనుసరించండి మరియు మీ పాస్‌వర్డ్‌ను జోడించండి. అంతే మీరు విండోస్ 11లో గెస్ట్ అకౌంటును సులభంగా సృష్టించవచ్చు. మీరు ఏ పద్ధతిని సులభమయినదిగా భావిస్తారు? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999