Just In
- 3 hrs ago
Android హోమ్ స్క్రీన్‌లో గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ షార్ట్‌కట్‌ని ఉంచడం ఎలా?
- 5 hrs ago
ఇనుములో ఓ హృదయం మొలిచెనే.. Xiaomi నుంచి తొలి హ్యుమనాయిడ్ రోబో!
- 6 hrs ago
రియల్‌మి కంపెనీ 2022లో ఎన్ని 5G ఫోన్లను లాంచ్ చేయనున్నదో తెలుసా?
- 22 hrs ago
OnePlus 10T 5G కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ సమస్యలకు చెక్...
Don't Miss
- Finance
5G Jobs: 5G రాకతో కొత్త కొలువులు.. రానున్న మూడు నెలల్లో.. వీరికే అధిక డిమాండ్..
- Sports
Salman Butt : టీమిండియా పాలసీ సూపర్.. జట్టుకు ఢోకా లేదు
- Movies
Laal Singh Chaddha Day 3 collections: పెరగని బాక్సాఫీస్ నెంబర్స్.. ఇలా అయితే కష్టమే?
- News
3 kidneys: ఏమీ విచిత్రం ఇదీ, వ్యాపారికి 3 కిడ్నీలు, అయినా హెల్తీగా..
- Lifestyle
ఆర్ద్ర నక్షత్రం అంటే ఏమిటి? ఈ నక్షత్రం ప్రత్యేకత ఏంటనేది పూర్తి సమాచారం ఇక్కడ ఉంది..
- Automobiles
హోండా సిబి300ఎఫ్ టెస్ట్ రైడ్ రివ్యూ.. బోరింగ్ క్లాసిక్ బైక్‌లను పక్కన పెట్టి, ఈ స్పోర్టీ స్ట్రీట్ ఫైటర్‌ను ఎక్
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
PDF డాక్యుమెంట్లను రక్షించడానికి ఫోన్లోనే పాస్‌వర్డ్‌ను సృష్టించడం ఎలా?
PDF రూపంలోని డాక్యుమెంట్లను స్నేహితులతో పాటుగా ఆఫీసుకు సంబందించిన కార్యకలాపాలను నిర్వహించి దాని సమాచారాన్ని మరొకరికి పంపడానికి ఉపయోగిస్తారు. PDF ఫార్మాట్ లేదా పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ రూపంలో ప్రొఫెషనల్ డాక్యుమెంట్లు లేదా ఫైల్‌లను ఇంటర్నెట్లో పంపడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే దీనిని బంచ్‌లో అత్యంత సురక్షితమైన ఫార్మాట్లలో ఒకటైనా పాస్వర్డ్ సహాయంతో మరింతగా ఎన్‌క్రిప్ట్ చేయవచ్చు. పాస్వర్డ్-ప్రొటెక్ట్ PDF అనేది మరింత సురక్షితమైనది. ఆన్లైన్లో సున్నితమైన లేదా ప్రొఫెషనల్ ఫైల్‌లను పంపడానికి మీకు ఇది ఉత్తమ ఎంపిక కావచ్చు.

అయితే నేడు స్మార్ట్ఫోన్లను ఉపయోగించని వారు ఉండరు. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క అన్ని కార్యకలాపాల కోసం స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌నే ఉపయోగించి ఏదైనా PDF డాక్యుమెంట్‌కు పాస్‌వర్డ్‌ను అందించి దానిని ఎలా రక్షించవచ్చునో తెలుసుకోవడానికి కింద ఉన్న పద్దతులను అనుసరించండి. కింద తెలిపే పద్ధతి ఆండ్రాయిడ్ మరియు iOS పరికరాల్లో రెండిటిలో కూడా పని చేస్తుంది అని గుర్తుంచుకోండి.
ఫోన్లో PDF డాక్యుమెంట్లను పాస్‌వర్డ్‌తో ఎన్‌క్రిప్ట్ చేసే విధానం
PDF డాక్యుమెంట్‌ని పాస్‌వర్డ్‌తో ఎన్‌క్రిప్ట్ చేయడం అనేది చాలా సులభం. దీని కోసం మీకు కావలసిందల్లా ఒక యాప్ మాత్రమే. తరువాత మీరు యాప్‌లో కింద తెలిపే దశలను అనుసరించాల్సి ఉంటుంది.

స్టెప్ 1: అన్నిటికంటే ముందుగా మీ ఆండ్రాయిడ్ లేదా iOS స్మార్ట్‌ఫోన్‌లో 'iLovePDF' అనే యాప్‌ని డౌన్లోడ్ చేయండి. (దీని కోసం మీరు ఆండ్రాయిడ్ ఫోన్ లలో ప్లేస్టోర్‌లో మరియు iOS కోసం యాప్ స్టోర్‌లో 'iLOVEPDF' అని సెర్చ్ చేయవచ్చు.)
స్టెప్ 2: మీరు iLovePDF యాప్‌ను డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి దిగువ భాగంలో ఉన్న 'టూల్స్' ట్యాబ్‌పై నొక్కండి.
స్టెప్ 3: ఇప్పుడు మీరు అందుబాటులో ఉన్న ఎంపికల జాబితాను చూస్తారు. ఇక్కడ 'ప్రొటెక్ట్ PDF' ఎంపిక కోసం చూడండి మరియు దానిపై నొక్కండి.
దశ 4: మీరు పాస్‌వర్డ్‌తో రక్షించాలనుకునే PDF డాక్యుమెంట్‌ని ఎంచుకుని 'కొనసాగించు' ఎంపికపై క్లిక్ చేయండి.
స్టెప్ 5: తరువాత మీ యొక్క పాస్‌వర్డ్‌ని నమోదు చేసి దిగువన దాన్ని మళ్లీ నిర్ధారించి 'ప్రొటెక్ట్' ఎంపికపై నొక్కండి.
స్టెప్ 6: ఇలా చేయడంతో మీ PDF డాక్యుమెంట్ పాస్‌వర్డ్‌తో లాక్ చేయబడుతుంది.
పైన తెలిపిన సులభమైన మార్గాలను అనుసరించడంతో మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో PDF డాక్యుమెంట్‌కు పాస్‌వర్డ్‌ను జతచేసి ఎంత సులభంగా రక్షించవచ్చు లేదా లాక్ చేయవచ్చు. PDFని రోజుకు మూడుసార్లు మాత్రమే లాక్ చేయడానికి యాప్ మిమ్మల్ని అనుమతిస్తుంది అని గమనించండి. మీరు పాస్‌వర్డ్‌ను ఎన్‌క్రిప్ట్ చేసే డాక్యుమెంట్లను అధికంగా కలిగి ఉంటే కనుక మీరు దానిని మరుసటి రోజు ప్రయత్నించవచ్చు లేదా యాప్ ప్రీమియం ప్లాన్‌ని కొనుగోలు చేయవచ్చు.

ఫోన్లో PDF డాక్యుమెంట్లను అన్‌లాక్ చేసే విధానం
ఒకవేళ మీరు క్రీయేట్ చేసిన PDF పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే కనుక మీరు టూల్స్ విభాగానికి వెళ్లి 'అన్‌లాక్ PDF' ఎంపిక కోసం వెతకవచ్చు. దానిని ఎంచుకొని PDF డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి 'PDFని అన్‌లాక్ చేయండి' ఎంపికపై నొక్కండి. ఇలా చేయడంతో మీరు PDF డాక్యుమెంట్‌ని విజయవంతంగా అన్‌లాక్ చేయవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086