ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా SBI ATM డెబిట్ కార్డ్ కొత్త పిన్‌ను ఆన్‌లైన్‌లో సృష్టించడం ఎలా?

|

ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థ టెక్నాలజీ పరంగా భారీగా మార్పులను అందుకున్నది. భారతీయ బ్యాంకింగ్ రంగం సాంప్రదాయ బ్యాంకింగ్ పద్ధతుల నుండి ఆర్థిక సేవల ప్రపంచంలో ప్రముఖ పోటీదారుగా మారింది. ముఖ్యంగా డిజిటలైజేషన్ వ్యవస్థ ఈ రంగంలో పురోగతిని తీసుకువచ్చింది. ప్రజలు ఇప్పుడు బ్యాంకులలో ఎక్కువసేపు క్యూలలో నిలబడవలసిన అవసరం లేకుండా మరియు కాగితాల అవసరం కూడా లేకుండా తమ పనిని పూర్తి చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

How to Create a PIN of New SBI ATM Debit Card Through Online Internet Banking?

సాంకేతిక పరిజ్ఞానం అవలంబించడం వల్ల సామర్థ్యం మెరుగుపడడమే కాకుండా వినియోగదారులకు వారి ఇంటి వద్దనే ఉండి అన్ని రకాల సౌకర్యాలను తీర్చుకునే అవకాశం లభిస్తున్నది. ఇందులో మాన్యువల్ ఇన్పుట్ అవసరమయ్యే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఇందులో మొట్టమొదటిది ATM పిన్ను సృష్టించడం. ఈ రోజుల్లో అన్ని రకాల బ్యాంకులు తమ యొక్క బ్యాంకు శాఖను సందర్శించకుండానే డెబిట్ / క్రెడిట్ కార్డ్ పిన్నును తక్షణమే ఉత్పత్తి చేసే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఒకవేళ మీరు క్రొత్త SBI డెబిట్ కార్డును అందుకున్నట్లయితే కనుక ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పిన్ ను సృష్టించవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి కింద ఉన్న పద్దతులను అనుసరించండి.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా SBI ATM డెబిట్ కార్డ్ కొత్త పిన్‌ను ఆన్‌లైన్‌లో సృష్టించే విధానం

How to Create a PIN of New SBI ATM Debit Card Through Online Internet Banking?

కింద ఉన్న ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు మీ SBI డెబిట్ కార్డు యొక్క కొత్త పిన్ను సృష్టించవచ్చు.ఇందుకోసం ముందుగా 'ఎ-సర్వీసెస్' విభాగం కింద గల 'ఎటిఎం కార్డ్ సర్వీసెస్' టాబ్‌లో మీ ఎటిఎం కార్డును యాక్టివేట్ చేయాలని నిర్ధారించుకోండి. ఇంకా ఆన్‌లైన్ ATM పిన్ జనరేషన్ యాక్టివ్ నెట్ బ్యాంకింగ్ సర్వీస్ కలిగిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని గమనించాలి.

స్టెప్ 1: మొదట www.onlinesbi.com ని సందర్శించి మీ యొక్క ఆధారాలను నమోదు చేసుకొని SBI అకౌంటులోకి లాగిన్ అవ్వండి.

స్టెప్ 2: లాగిన్ అయిన తర్వాత 'ఇ-సర్వీసెస్' టాబ్ కింద 'ఎటిఎం కార్డ్ సర్వీస్' విభాగంకు వెళ్ళండి.

స్టెప్ 3: తరువాత 'ఎటిఎం పిన్ జనరేషన్' ను ఎంచుకోండి. దాని తరువాత మీరు OTP ని ఉపయోగించి పిన్‌ను ఉత్పత్తి చేయాలనుకుంటున్నారా లేదా ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలా అని రెండు ఎంపికలను అడుగుతుంది. ఇందులో మొదటి ఎంపికను ఎంచుకోవలసి ఉంటుంది.

స్టెప్ 4: దీనిని ఎంచుకున్న తర్వాత మీ SBI బ్యాంక్ అకౌంటుకు నమోదు చేయబడిన మీ మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది. అవసరమైన ఫీల్డ్‌లో OTP ని నమోదు చేయండి.

స్టెప్ 5: మీ ఎటిఎం కార్డ్ లింక్ చేయబడిన సేవింగ్స్ అకౌంటును ఎంచుకుని ఆపై 'కొనసాగించు' పై క్లిక్ చేయండి.

స్టెప్ 6: తరువాత కొత్త పిన్ ఉత్పత్తి చేయవలసిన ATM కార్డును ఎంచుకోని 'సబ్మిట్' ఎంపిక మీద నొక్కండి.

స్టెప్ 7: మీరు సృష్టించాలనుకుంటున్న క్రొత్త పిన్ యొక్క మొదటి రెండు అంకెలను నమోదు చేయండి. మిగిలిన రెండు అంకెలను ఎస్ఎంఎస్ ద్వారా బ్యాంక్ పంపుతుంది

స్టెప్ 8: మీరు ఇంతకు ముందు ఎంచుకున్న మొదటి రెండు అంకెలను మరియు మీ రిజిస్టర్డ్ మొబైల్‌లో SMS ద్వారా అందుకున్న రెండు అంకెలను తిరిగి నమోదు చేయండి. తరువాత 'సబ్మిట్' ఎంపికపై క్లిక్ చేయడంతో కొత్త పిన్ విజయవంతంగా ఉత్పత్తి అవుతుంది.

Best Mobiles in India

English summary
How to Create a PIN of New SBI ATM Debit Card Through Online Internet Banking?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X