Home
How to

యూట్యూబ్‌లో షార్ట్స్ వీడియోలను సృష్టించడం ఎలా??

ప్రపంచం మొత్తం మీద వినియోగదారులు తమ యొక్క ఫోన్‌లలోని కంటెంట్‌ను చిన్న చిన్న వీడియోలలో రూపంలో సృష్టించే షార్ట్ వీడియో సర్వీసులకు మంచి ఆదరణ లభిస్తున్న సందర్భంలో ఇండియాలో గత సంవత్సరం సెప్టెంబరు నెలలో యూట్యూబ్ సంస్థ తన యొక్క బీటా దశలో టిక్‌టాక్ సర్వీస్ వలె ' యూట్యూబ్ షార్ట్స్' పేరుతో షార్ట్ వీడియోను విడుదల చేసింది. ఈ సర్వీస్ విడుదల అయిన నాలుగు నెలల స్వల్ప కాల వ్యవధిలో భారతదేశంలోని వినియోగదారులలో బాగా ప్రాచుర్యం పొందింది.

how-to-create-and-post-shorts-videos-on-youtube

వినియోగదారులు ఎక్కువ మంది తమ యొక్క ఫోన్‌ల ద్వారా కంటెంట్‌ను సృష్టిస్తున్నారు. అందువల్ల సృష్టికర్తలకు అవసరమైన మరిన్ని వీడియో ఎడిటింగ్ టూల్ లను ఇవ్వడానికి ఇప్పుడు భారతదేశంలో యూట్యూబ్ షార్ట్‌లను పరీక్షిస్తున్నాము అని యూట్యూబ్ సీఈఓ సుసాన్ తెలిపారు. ఇండియాలో లాంచ్ చేయడానికి గల అడ్డంకులను తగ్గించడం ద్వారా మొబైల్ సృష్టికర్తలు వారి యొక్క స్టోరీలను షార్ట్ వీడియోలతో తెలపడానికి సహాయపడుతుంది. యూట్యూబ్‌లోని ఈ క్రొత్త షార్ట్స్ ప్లేయర్‌లోని వీడియోలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు చూడటానికి అనుమతిని ఇస్తుంది. యూట్యూబ్‌లో ఆకట్టుకునే ఈ ఫీచర్ 3.5 బిలియన్ల రోజువారీ వీక్షణలను కలిగి ఉంది.

how-to-create-and-post-shorts-videos-on-youtube

యూట్యూబ్‌లో షార్ట్స్ వీడియోలను సృష్టించే మార్గాలు

*** మొబైల్‌లో యూట్యూబ్‌ను ఓపెన్ చేసి అందులో మీ యొక్క ఈమెయిల్ తో సైన్ ఇన్ చేయండి.

*** సృష్టించు ఎంపిక మీద నొక్కండి.

*** క్రీయేట్ షార్ట్ ఎంపిక మీద నొక్కండి.

*** ఏదైనా క్లిప్‌ను రికార్డ్ చేయడానికి క్యాప్చర్ బటన్‌ను నొక్కి పట్టుకోండి లేదా రికార్డింగ్ ప్రారంభించడానికి దాన్ని నొక్కండి మరియు సెగ్మెంట్‌ను ముగించడానికి దాన్ని మళ్ళీ నొక్కవలసి ఉంటుంది.

*** మీరు రికార్డ్ చేసిన మునుపటి వీడియో క్లిప్‌ను తొలగించడానికి రెడో ఎంపిక మీద నొక్కండి లేదా తీసివేసిన విభాగాన్ని మీ వీడియోకు తిరిగి జోడించడానికి సెగ్మెంట్ బ్యాక్ ఎంపిక మీద నొక్కండి.

*** మీ వీడియోను ప్రీవ్యూ చేయడానికి నెక్స్ట్ ఎంపిక మీద నొక్కండి.

*** మీ యొక్క వీడియోకు సరైన వివరాలను జోడించడానికి మళ్ళీ నెక్స్ట్ ఎంపిక మీద నొక్కండి.

*** మీ యొక్క షార్ట్ వీడియోకు టైటిల్ గరిష్టంగా 100 అక్షరాలలోపు ఉండేలా జోడించండి.

*** మీ షార్ట్ వీడియో పిల్లల కోసం తయారు చేయబడిందో లేదో ఎంచుకోవడానికి ప్రేక్షకులను ఎంచుకోండి ఎంపిక మీద నొక్కండి.

*** ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయడానికి అప్‌లోడ్ ఎంపిక మీద నొక్కండి.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Create and Post Shorts Videos on Youtube ??
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X