శ్రీకృష్ణ జన్మాష్టమి 2021 WhatsApp ప్రత్యేక స్టిక్కర్‌లను సృష్టించడం ఎలా?

|

భారతదేశం మొత్తం నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలతో మునుగుతోంది. సాధారణ రోజులలో ఈ రోజు చాలా కోలాహలం ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికి చాలా రాష్ట్రాలలో కోవిడ్-19 నిబంధనలు కొనసాగుతున్నందున స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలపడానికి వాట్సాప్ వంటి ఆన్ లైన్ మాధ్యమాలను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా కుటుంబం మరియు స్నేహితులతో మరింత దగ్గర కనెక్ట్ అవ్వడానికి వీలుగా కూడా ఉంటుంది. హ్యాపీ జన్మాష్టమి 2021 తేదీ, సమయం, కోట్స్, ఫొటోస్, మెసేజ్ లు, GIF లు, స్టిక్కర్లు, స్టేటస్ వీడియో వంటివి ఇతరులకు ఎలా పంపాలి అని ఆలోచిస్తున్నారా?? అయితే వీటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
శ్రీకృష్ణ జన్మాష్టమి WhatsApp ప్రత్యేక స్టిక్కర్‌లను సృష్టించడం ఎలా?

మీరు హ్యాపీ జన్మాష్టమి 2021 WhatsApp స్టిక్కర్‌లను పంపాలనుకుంటే అది థర్డ్ పార్టీ అప్లికేషన్‌ల ద్వారా చేయవచ్చు. మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ నేరుగా హ్యాపీ జన్మాష్టమి 2021 స్టిక్కర్ ప్యాక్‌ను అందించదు. కానీ గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేయడానికి అనేక థర్డ్ పార్ట్ అప్లికేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకమైన జన్మాష్టమి 2021 స్టిక్కర్‌లను రూపొందించడానికి మరియు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు WhatsApp ద్వారా పంపడానికి దశల వారీ మార్గదర్శిని అనుసరించండి.

హ్యాపీ జన్మాష్టమి 2021 WhatsApp స్టిక్కర్‌లను సృష్టించే విధానం

శ్రీకృష్ణ జన్మాష్టమి WhatsApp ప్రత్యేక స్టిక్కర్‌లను సృష్టించడం ఎలా?

స్టెప్ 1: మీ Android ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయండి. ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు మాత్రమే థర్డ్ పార్టీ స్టిక్కర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని గమనించాలి.

స్టెప్ 2: చాట్‌బాక్స్ ఓపెన్ చేసి ఎమోజి ఎంపికపై నొక్కండి.

స్టెప్ 3: తరువాత "+" ఎంపికపై నొక్కండి మరియు క్రిందికి స్క్రోల్ చేయండి. తరువాత "గెట్ మోర్ స్టిక్కర్స్" ఎంపికపై నొక్కండి.

స్టెప్ 4: వాట్సాప్ మిమ్మల్ని గూగుల్ ప్లే స్టోర్‌కు తీసుకెళుతుంది. మీరు అక్కడ వాట్సాప్ సిక్కర్ ప్యాక్‌ల కోసం సెర్చ్ చేయవచ్చు.

స్టెప్ 5: అనేక థర్డ్ పార్టీ స్టిక్కర్ ప్యాక్ యాప్‌లు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన ఒకదాన్ని ఇన్‌స్టాల్ చేయండి.

స్టెప్ 6: మీరు తప్పనిసరిగా యాప్‌లో తగిన స్టిక్కర్ ప్యాక్‌లను ఎంచుకోవాలి. ఈ సందర్భంలో జన్మాష్టమి లేదా హ్యాపీ జన్మాష్టమి 2021 స్టిక్కర్ ప్యాక్‌లను ఎంచుకోండి.

స్టెప్ 7: ఎంచుకున్న స్టిక్కర్ ప్యాక్‌లు స్వయంచాలకంగా WhatsApp యాప్‌లోని మై స్టిక్కర్స్ విభాగానికి జోడించబడతాయి.

స్టెప్ 8: వినియోగదారులు ఇప్పుడు తగిన స్టిక్కర్‌ను ఎంచుకోవచ్చు. తరువాత కాంటాక్ట్స్, కుటుంబం మరియు స్నేహితులతో పంచుకోవచ్చు.

నోట్: మొబైల్ నుండి ఎప్పుడైనా థర్డ్ పార్టీ స్టిక్కర్ ప్యాక్ తొలగించబడితే స్టిక్కర్ ప్యాక్ కూడా WhatsApp నుండి తీసివేయబడుతుందని వినియోగదారులు గమనించాలి.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Create and Send Srikrishna Janmashtami 2021 WhatsApp Special Stickers?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X