Instagram లైవ్ రూమ్‌ను సృష్టించడం ఎలా?
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ లో వినియోగదారుల అనుభవాన్ని మరింత పెంచడానికి ఇటీవల విడుదల చేసిన లైవ్ రూమ్ ఫీచర్ అత్యంత హైప్ పొందింది. ఈ లైవ్ రూమ్ ఫీచర్ అనేది రియల్ టైమ్ బ్రాడ్ కాస్ట్ లో పాల్గొనడానికి నలుగురిని అనుమతిస్తుంది. ఫేస్బుక్ యాజమాన్యంలోని ఈ యాప్ ఇంతకు ముందు తన యొక్క ప్లాట్‌ఫాంలోకేవలం ఒక వ్యక్తితో ప్రసారం చేయడానికి అనుమతించేది. అయితే వినియోగదారుల సృజనాత్మకతను పెంచడానికి ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్ ను రెట్టింపు చేసింది. ఇన్‌స్టాగ్రామ్ యొక్క కొత్త లైవ్ రూమ్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్‌స్టాగ్రామ్ లైవ్ రూమ్‌ను రూపొందించే విధానం
** ఇన్‌స్టాగ్రామ్ లైవ్ రూమ్‌ను సృష్టించడానికి మీరు మొదట మీ యాప్ ను తాజా వెర్షన్ కు అప్ డేట్ చేయవలసి ఉంటుంది.
** మీ ఇన్‌స్టాగ్రామ్ యాప్ ను అప్ డేట్ చేయబడిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ కెమెరాను ఓపెన్ చేసి 'లైవ్' మోడ్ ఐకాన్‌కు టోగుల్ చేయండి. బ్రాడ్ కాస్ట్ ను ప్రారంభించడానికి రికార్డింగ్ బటన్‌ను నొక్కండి.

** మీరు లైవ్ ప్రసారం చేసినప్పుడు + గుర్తుతో కెమెరా చిహ్నాన్ని చూస్తారు. రూమ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఆ గుర్తుపై క్లిక్ చేయండి.
** మీరు లైవ్ రూమ్‌ను సృష్టించిన తర్వాత మీ స్నేహితులు మరియు ఫాలోవర్ కోసం సెర్చ్ చేయండి మరియు వీడియోలో చేరమని వారిని ఆహ్వానం పంపండి.
*** మీ స్నేహితులు మీ యొక్క ఆహ్వానాన్ని అంగీకరించినప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ రూమ్ ఫీచర్ ప్రారంభమవుతుంది.


Click it and Unblock the Notifications








