Apple IDని క్రియేట్ చేసుకోవటం ఎలా..?

స్మార్ట్‌ఫోన్‌లను స్టేటస్ సింబల్‌గా భావిస్తోన్న చాలా మంది యూజర్లు ఆండ్రాయిడ్ ఫోన్‌ల నుంచి యాపిల్ ఐఫోన్‌లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు. యాపిల్ డివైస్‌ను వాడాలనుకునేవారు మొట్టమొదటిగా Apple IDని క్రియేట్ చే

|

స్మార్ట్‌ఫోన్‌లను స్టేటస్ సింబల్‌గా భావిస్తోన్న చాలా మంది యూజర్లు ఆండ్రాయిడ్ ఫోన్‌ల నుంచి యాపిల్ ఐఫోన్‌లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు. యాపిల్ డివైస్‌ను వాడాలనుకునేవారు మొట్టమొదటిగా Apple IDని క్రియేట్ చేసుకోవల్సి ఉంటుంది.యాపిల్ ఐడీ అనేది మీ పేరుతో క్రియేట్ అయిన ఓ యాపిల్ అకౌంట్. ఈ అకౌంట్ యాపిల్ సర్వర్స్‌తో లింక్ అయి మీ డేటాను అన్ని యాపిల్ డివైస్‌లతో సింక్ చేస్తుంది. మీరు కొత్తగా యాపిల్ డివైస్‌ను కొనుగోలు చేసినట్లయితే యాపిట్ ఐడీని తప్పనిసరిగా క్రియేట్ చేసుకోవల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో యాపిల్ కంటెంట్‌ను మీరు యాక్సిస్ చేసుకోలేరు. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా Apple IDని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేదాని పై స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం...

Iphone
Apple ID వెబ్‌సైట్‌లోకి వెళ్లి..
ముందుగా మీ కంప్యూటర్ నుంచి Apple ID వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. సైట్‌లోకి వెళ్లిన తరువాత మీ పేరు, ఈ-మెయిల్ అడ్రస్, పుట్టిన తేదీ ఇంకా సెక్యూరిటీ క్వచ్చిన్స్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. చివరిగా పాస్‌వర్డ్ ఇంకా క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై టాప్ ఇచ్చినట్లయితే 6 డిజిట్లతో కూడిన వెరిఫికేషన్ కోడ్ ఒకటి మీ ఈమెయిల్‍‌కు అందుతుంది.

యాపిల్ ఐడీ అంటే మీ ఈమెయిల్ అడ్రస్సే..
ఇప్పుడు మరోసారి కంటిన్యూ ఆప్షన్ పై టాప్ చేసినట్లయితే మీ యాపిల్ ఐడీ క్రియేట్ అవుతుంది. యాపిల్ ఐడీ అనేది మీ ఈమెయిల్ అడ్రస్సే అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. తరువాతి పేజీలో ఎడిట్ బటన్ పై క్లిక్ చేసి మీ పేమెంట్ అలానే షిప్పింగ్ వివరాలను ఎంటర్ చేసి సేవ్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే ప్రాసెస్ విజయవంతంగా కంప్లీట్ అవుతుంది.

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఏడాది పాటు ఉచితంగా పొందడం ఎలా ?అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఏడాది పాటు ఉచితంగా పొందడం ఎలా ?

ఆ ఘనత స్టీవ్ జాబ్స్‌దే..
మొబైల్ ఫోన్‌ల విభాగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన 'యాపిల్ ఐఫోన్' సరికొత్త స్మార్ట్ మొబైలింగ్ అనుభూతులను యూజర్లకు చేరువచేస్తోంది. ప్రపంచానికి యాపిల్ ఐఫోన్‌ను పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్‌కు ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ చెప్పుకోకతప్పదు. యాపిల్ మొట్టమొదటి ఐఫోన్‌ను జనవరి 2007 శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన మ్యాక్ వరల్డ్ కాన్ఫిరెన్స్‌లో జాబ్స్ ఆవిష్కరించారు. అయిన స్టీవ్ జాబ్స్ యాపిల్ ఐఫోన్‌ను 'రివల్యూషనరీ ఇంకా మ్యాజికల్' ఉత్పత్తి‌గా అభివర్ణించారు.

Best Mobiles in India

English summary
If you want to use an iOS device, you will need an Apple ID. An Apple ID is also needed to get the most out of your Mac. An Apple ID, of course, is your account on Apple’s servers that lets you sync all of your data across Apple devices.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X