Home
How to

Nano Banana on Whatsapp వాట్సాప్‌ ద్వారా కూడా నానో బనానా ఫోటోలను క్రియేట్ చేసుకోవచ్చు..!!

Nano Banana on Whatsapp : ఒక్కోసారి ఒక్కో ట్రెండ్‌.. ఈసారి జెమిని నానో బనానా వంతు వచ్చింది. గత కొన్నిరోజులుగా సోషల్‌ మీడియా అంతా నానో బనానా టూల్‌ ఆధారంగా క్రియేట్ చేసిన 3డీ డిజిటల్‌ ఫోటోలతో నిండిపోతోంది. కేవలం సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా ఇందుకు సై అంటున్నారు. దీంతోపాటు మహిళలు శారీ ట్రెండ్‌ను కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో ప్రైవసీ సమస్యలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఏంటీ నానో బనానా ట్రెండ్‌.. ఇదో గూగుల్‌ జెమినీ 2.5 ఫ్లాష్‌ ఇమేజ్‌ టూల్ (నానా బనానా). ఈ టూల్‌లో మీరు ఏదైనా ఫోటోను అప్‌లోడ్‌ చేసి, మీకు కావాల్సిన విధంగా మార్చాలంటూ ప్రాంప్ట్‌ రూపంలో ఇన్‌పుట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో క్షణాల్లోనే మీ 3డీ డిజిటల్‌ ఇమేజ్ క్రియేట్‌ అవుతుంది.

Google nano banana images on whatsapp in telugu

ఇప్పటి వరకు నానో బనానా టూల్‌ ఆధారంగా ఫోటోలు క్రియేట్‌ చేసేందుకు సంబంధిత వెబ్‌సైట్‌లకు వెళ్లి చేస్తున్నారు. అందుకోసం గూగుల్‌లో ఈ వెబ్‌సైట్‌ కోసం తెగ సెర్చ్‌ చేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల కారణంగా కొంత మంది నకిలీ వెబ్‌సైట్‌ల బారినపడి మోసపోయిన ఘటనలు కూడా ఇటీవల వెలుగులోకి వచ్చాయి.

నానో బనానా టూల్‌ ద్వారా మీ 3డీ ఫోటోలు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నవారికి నిజంగా ఇది గుడ్‌న్యూస్‌. ప్రముఖ ఏఐ మోడల్‌ పెర్‌ఫ్లెక్సిటీ ఏఐ (Perplexity AI) కీలక ప్రకటన చేసింది. వాట్సాప్‌ ద్వారా నేరుగా నానో బనానా ఆధారిత 3డీ ఫోటోలను సులభంగా క్రియేట్‌ చేసుకోవచ్చని తెలిపింది.

వాట్సాప్ ద్వారా నానో బనానా 3డీ ఫోటోలు క్రియేట్‌ చేయడం ఎలా?
స్టెప్ 1 : ముందుగా మీ ఫోన్‌లో పెర్‌ఫ్లెక్సిటీ అధికారిక వాట్సాప్‌ బాట్‌ నంబర్‌ +1(833) 436-3285 ను సేవ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
స్టెప్‌ 2 : మీ వాట్సాప్‌ కాంటాక్ట్స్‌లో ఈ నంబర్‌ కనిపిస్తుందో లేదో తనిఖీ చేసుకోండి
స్టెప్‌ 3 : అనంతరం ఏదైనా మెసేజ్‌ను టైప్‌ చేయడం గానీ, మీ ఫోటోను గానీ అప్‌లోడ్‌ చేయండి.
స్టెప్‌ 4 : అనంతరం మీకు కావాల్సినట్లుగా ఫోటో మార్చేందుకు ప్రాంప్ట్‌ ఇవ్వాల్సి ఉంటుంది.
ఉదాహరణకు Dress Me in a Traditional Saree, Turn this into a retro portrait వంటి ప్రాంప్ట్‌లు ఇవ్వొచ్చు.
స్టెప్‌ 5 : కొన్ని క్షణాల్లో మీకు కావాల్సిన 3డీ ఇమేజ్‌ ను అక్కడ కనిపిస్తుంది. మీ ఫోన్‌ గ్యాలరీలో సేవ్‌ చేసుకోవచ్చు.

Take a Poll

కొంత మంది యూజర్లకు నానా బనానా టూల్‌ వెబ్‌సైట్‌ పై సరైన అవగాహన లేక, గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అక్కడ కొన్నిసార్లు నకిలీ వెబ్‌సైట్‌లు కూడా కనిపించే అవకాశం ఉంది. అదే వాట్సాప్‌ ద్వారా ఈ నంబర్‌ను సేవ్‌ చేసుకుంటే సింపుల్‌గా మీకు కావాల్సిన సమయంలో సులభంగా 3డీ ఫోటోలను క్రియేట్‌ చేసుకోవచ్చు.

వాట్సాప్‌ ద్వారా ఉచితమేనా?
వాట్సాప్‌ బాట్‌ ద్వారా నానో బనానా ఆధారిత 3డీ ఫోటోలను క్రియేట్‌ చేసుకోవడం ఉచితమేనా కాదా అనేదానిపై పెర్‌ఫ్లెక్సిటీ ఎంటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి ఉచితంగానే ఈ సేవలను పొందవచ్చు. మీకు కావాల్సిన ఫోటోలను క్రియేట్‌ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
How to create Google nano banana images on whatsapp here is the simple guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X