Home
How to

ఇన్‌స్టాగ్రామ్‌లో హర్రర్ హాలోవీన్ వీడియోలను సృష్టించడం ఎలా?

2020 సంవత్సరంలో కోవిడ్ -19 వ్యాప్తి తరువాత చాలా విషయాలలో మార్పులు జరిగాయి. ప్రతి ఒక్కరూ కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావలసి వచ్చింది. ఎంటర్టైన్మెంట్ కోసం ఇంటిలో ఉన్న టీవీ, మొబైల్ ఫోన్ ను మాత్రమే వినియోగిస్తున్నారు. హాలోవీన్ కాస్ట్యూమ్ పార్టీలకు లేదా పబ్బులకు హాజరయ్యే అవకాశం లేదు. ఇంట్లో లేదా సినిమా హాల్ లలో హర్రర్ సినిమాలను చూడడానికి ఇష్టపడే వారు ఇటువంటివి మిస్ అవుతూ ఉంటారు.

How To Create Horror Halloween Videos On Instagram?

ఇన్‌స్టాగ్రామ్‌లో హాలోవీన్ ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్‌

ప్రజలు ప్రస్తుత రోజులలో తమ జీవితంలోని మధురమైన క్షణాలను సోషల్ మీడియాలలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. జనాదరణ పొందిన సోషల్ మీడియా యాప్ లలో ఇప్పుడు హాలోవీన్ రూపం బాగా పాపులర్ అయింది. ఇటువంటి రూపాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడాన్ని కొంత మంది ఇష్టపడుతూ ఉంటారు. మీ యొక్క అన్ని ఫోటోలను కేవలం ఒక హాలోవీన్ దుస్తులలో పోస్ట్ చేయడం కంటే భయానక హాలోవీన్ ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్‌లను ఉపయోగించవచ్చు. స్నాప్‌చాట్‌లో కొన్ని స్పూకీ ఫిల్టర్‌లను కూడా అదనంగా పొందుతారు. అయితే ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ యాప్ ను ఉపయోగించి మీరు భయానక హాలోవీన్ వీడియోలను త్వరగా ఎలా సృష్టించవచ్చో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How To Create Horror Halloween Videos On Instagram?

ఇన్‌స్టాగ్రామ్‌లో భయానక హాలోవీన్ వీడియోలను సృష్టించే విధానం

స్టెప్1: ఇన్‌స్టాగ్రామ్ యాప్ ను ఓపెన్ చేసి స్టోరీ విభాగంలోకి ప్రవేశించడానికి కుడివైపుకు స్వైప్ చేయండి.

స్టెప్ 2: తరువాత "బ్రౌజ్ ఎఫెక్ట్స్" ఎంపికను కనుగొనడానికి ఎడమవైపుకు స్వైప్ చేయండి. మీరు దీన్ని ఎంచుకున్న తరువాత ఇన్‌స్టాగ్రామ్ టాప్ బార్‌లో హాలోవీన్ ఫిల్టర్‌లను ప్రోత్సహిస్తుంది.

How To Create Horror Halloween Videos On Instagram?

స్టెప్ 3: మీరు ఉపయోగించాలనుకునే ఏదైనా ఫిల్టర్‌లను నొక్కండి మరియు "దీన్ని ప్రయత్నించండి" ఎంపిక మీద నొక్కండి. అప్పుడు మీరు మీ ముఖంపై స్పూకీ ఫిల్టర్‌ను చూడగలరు. అప్పుడు మీరు భయంకరమైన ముఖాలతో చిన్న వీడియోను చేయవచ్చు.

స్టెప్4: మీరు వీడియో చేయడం పూర్తి అయిన తర్వాత హర్రర్ కోటీన్‌కు జోడించడానికి యాప్ నుండే హర్రర్ మ్యూజిక్ ని కూడా జోడించవచ్చు. వీడియోకు హాలోవీన్ సంగీతాన్ని జోడించడానికి మీరు అందులోంచి నిష్క్రమించాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఎగువవైపు కుడి మూలలో గల స్టిక్కర్ చిహ్నం మీద నొక్కాలి. ఇక్కడ మీరు మ్యూజిక్ ఎంపికను కనుగొంటారు. దానిపై క్లిక్ చేసి సెర్చ్ పట్టీలో హర్రర్ లేదా హాలోవీన్ టైప్ చేసి సంగీతాన్ని ఎంచుకున్న తర్వాత మీ వీడియోకు జతచేయవచ్చు. దీనితో మీ వీడియో సిద్ధంగా ఉంటుంది. మీరు దాన్ని అప్‌లోడ్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
How To Create Horror Halloween Videos On Instagram?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X