మీ పర్సనల్ Folders డెస్క్‌టాప్ నుంచే మాయమైపోవాలా..?
వినియోగదారులకు అత్యుత్తమ కంప్యూటింగ్ సేవలను అందిస్తోన్న విండోస్ ఓఎస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
వినియోగదారులకు అత్యుత్తమ కంప్యూటింగ్ సేవలను అందిస్తోన్న విండోస్ ఓఎస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆపరేటింగ్ సిస్టంను కోట్లాది మంది యూజర్లు వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు విండోస్ ఆపరేటింగ్ సిస్టం అనేక టిప్స్ అండ్ ట్రిక్స్ మీతో షేర్ చేసుకోవటం జరిగింది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా మరో ఆసక్తికర ట్రిక్‌ను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.

మీరు మాత్రమే యాక్సిస్ చేసుకోవచ్చు..
ఈ ట్రిక్‌ను ఉపయోగించుకుని మీరు పర్సనల్ Folders డెస్క్‌టాప్ నుంచి మాయం చేసేయవచ్చు. దీంతో ఆ ఫోల్డర్‌లను కావాలనుకున్నపుడు మీరు మాత్రమే యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. ఇన్విజబుల్ ఫోల్డర్స్‌ను క్రియేట్ చేసుకునేందుకు మూడు రకాల పద్థతులు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ప్రొసీజర్ 1తో ఫోల్డర్‌ను మాయం చేసేయవచ్చు..
మొదటి పద్థతిలో భాగంగా ముందుగా ఓ కొత్త ఫోల్డర్‌ను ఏదో ఒక పేరుతో క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్ క్రియేట్ అయిన తరువాత మౌస్‌తో రైట్ క్లిక్ చేసి properties ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ప్రాప్టరీస్ టాబ్‌లోకి వెళ్లిన తరువాత కస్టమైజ్ టాబ్ పై క్లిక్ చేసి అందులో change icon ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయ్యే ఐకాన్స్ మెనూలో సంబంధించి బ్లాంక్ ఐకాన్ ను సెలక్ట్ చేసుకోవాలి.

పూర్తిగా ఇన్విజబుల్ మోడ్‌లోకి వెళ్లిపోతోంది..
మీ ఫోల్టర్‌కు బ్లాంక్ ఐకాన్ అప్లై అయిన తరువాత, ఫోల్డర్‌కు రీనేమ్ చేసే క్రమంలో టెక్స్ట్‌ను మొత్తం తొలగించాలి. ఆ తరువాత ALT బటన్‌ను ప్రెస్ చేసి ఉంచి న్యూమరిక్ కీబోర్డ్ పై 0160 అంకెలను టైప్ చేయాలి. దీంతో మీ ఫోల్డర్ డెస్క్‌టాప్ పై ఉన్నప్పటికి పూర్తిగా ఇన్విజబుల్ మోడ్‌లోకి వెళ్లిపోతోంది. దీంతో మీరు మాత్రమే ఆ ఫోల్డర్‌లను కావాలనుకున్నపుడు యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. ఇన్విజబుల్ మోడ్‌ను తీసేయాలనుకున్నట్లయితే ఇదే ప్రొసీజర్‌ను మళ్లీ మొదటి నుంచి అప్లై చేసే ఫోల్డర్ ఐకాన్ ఇంకా పేరును మార్చుకుంటే సరిపోతుంది.

ప్రొసీజర్ 2తో ఫోల్డర్స్‌ను ఇంటర్నల్‌గా హైడ్ చేసుకోవచ్చు..
రెండవ పద్థతిలో భాగంగా మీ వ్యక్తిగత డేటాతో కూడిన ఫోల్డర్స్‌ను పీసీలో ఇంటర్నల్‌గా హైడ్ చేసుకునే వీలుంటుంది. ఈ ప్రొసీజర్‌ను అప్లై చేసే క్రమంలో ముందుగా మీరు హైడ్ చేయాలనుకుంటోన్న ఫోల్డర్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తరువాత ఫోల్డర్ పై మౌస్‌తో రైట్ క్లిక్ చేసి properties ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ప్రాప్టరీస్ లోకి వెళ్లిన తరువాత టాబ్ దిగువున "Attributes" పేరుతో ఓ ఆప్షన్ కనిపిస్తుంది. దీని ప్రక్కన మీకు "Read Only" , "Hidden" పేర్లతో రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో "Read Only" ఆప్షన్‌ను అన్‌సెలక్ట్ చేసి, Hidden" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీ ఫోల్డర్ ఇంటర్నల్‌గా హైడ్ కాబడుతుంది.

హిడెన్ మోడ్ నుంచి బయటకు వచ్చేయాలనుకున్నట్లయితే...
హిడెన్ మోడ్ నుంచి బయటకు వచ్చేయాలనుకున్నట్లయితే ఫోల్డర్‌ను క్రియేట్ చేసిన డ్రైవ్‌లోకి వెళ్లి organize మెనూలోని "Folder And Search Option'' పై క్లిక్ చేయంఢి. ఇక మీకు అనేక ఫోల్డర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో "View" ట్యాబ్ పై క్లిక్ చేసినట్లయితే "Hidden Files and Folder" అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌ను "Show Hidden files and folders"కు మార్చి Apply బటన్ పై క్లిక్ చేసి "Ok" చేసినట్లయితే మీ ఫోల్డర్ హిడెన్ మోడ్ నుంచి బయటకు వచ్చేస్తుంది.

Free Hide Folder సాఫ్ట్‌వేర్ ద్వారా..
మూడవ పద్థతిలో భాగంగా Free Hide Folder అనే ప్రోగ్రామ్‌ను ఉపయోగించుకుని ఫోల్డర్స్‌ను హైడ్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్‌ను అప్లై చేసే క్రమంలో ముందుగా Free Hide folder అనే సాఫ్ట్‌వేర్‌ను మీ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయిన తరువాత ఓపెన్ అయ్యే స్ర్కీన్‌లో "Add" అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు హైడ్ చేయాలనుకంటోన్న ఫోల్డర్స్‌ను బ్రౌజ్ చేయాల్సి ఉంటుంది. ఫోల్డర్స్ సెలక్ట్ అయిన తరువాత "Ok" బటన్ పై క్లిక్ చేసినట్లయితే అవి హైడ్ కాబడతాయి. వాటిని అన్‌హైడ్ చేసే క్రమంలో Free Hide folder సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్ చేసి సంబంధిత ఫోల్డర్‌ను సెలక్ట్ చేసుకుని స్క్రీన్ పై కనిపించే "Unhide" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే ఫోల్డర్ హిడెన్ మోడ్ నుంచి బయటకు వచ్చేస్తుంది.


Click it and Unblock the Notifications








