మీ జీమెయిల్ ఇన్‌బాక్స్‌ ఫుల్ అని చూపిస్తోందా..?

|

గూగుల్ అందిస్తోన్న అత్యుత్తమ సేవల్లో జీమెయిల్ ఒకటి. జీమెయిల్ సేవలు గురించి తెలియని గూగుల్ యూజర్ అంటూ ఈ ప్రపంచంలో ఉండరు. ఈమెయిల్ వినియోగాన్ని మరింత సౌకర్యంవంతం చేసే క్రమంలో జీమెయిల్ ల్యాబ్స్ అనేక కొత్త ఫీచర్లను జీమెయిల్ సర్వీసులో యాడ్ చేస్తూ వస్తోంది. వ్యక్తిగత యూసేజ్‌కు దాదాపు సరిపోతుంది...కొత్తగా జీమెయిల్ అకౌంట్‌ను ఓపెన్ చేసే యూజర్లకు 15జీబి వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉచితంగా లభిస్తుంది.

 

మీ Google Drive అకౌంట్‌లో స్టోరేజ్ స్పేస్‌ను క్లియర్ చేసుకోవటం ఎలా..?మీ Google Drive అకౌంట్‌లో స్టోరేజ్ స్పేస్‌ను క్లియర్ చేసుకోవటం ఎలా..?

బిజినెస్ అవసరాలకు జీమెయిల్ అకౌంట్లను

బిజినెస్ అవసరాలకు జీమెయిల్ అకౌంట్లను

ఇది వ్యక్తిగత యూసేజ్‌కు దాదాపు సరిపోతుంది. ఒకవేళ బిజినెస్ అవసరాలకు జీమెయిల్ అకౌంట్లను వినియోగించుకోవాలనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా అదనపు స్టోరేజ్‌ను కొనుగోలు చేయవల్సి ఉంటుంది. ఇలా కాకుండా జీమెయిల్ స్టోరేజ్‌ను పొదుపుగా వినియోగించుకోవాలనుకునే వారు కొన్ని ట్రిక్స్‌ను పాటించటం ద్వారా స్టోరేజ్‌ను ఎప్పటికప్పుడు ఆదా చేసుకునే వీలుంటుంది. ఆ ప్రొసీజర్‌ను ఇప్పుడు చూద్దాం..

ముందుగా జీమెయిల్ ఇన్‌బాక్స్‌ను ఓపెన్ చేయండి..

ముందుగా జీమెయిల్ ఇన్‌బాక్స్‌ను ఓపెన్ చేయండి..

మందుగా మీ జీమెయిల్ ఇన్‌బాక్స్‌ను ఓపెన్ చేయండి. ఇన్‌బాక్స్‌ ఓపెన్ అయిన తరువాత మీకు వివిధ క్యాటగిరీలతో కూడిన ట్యాబ్స్ కనిపిస్తాయి. సోషల్, ప్రమోషన్స్, అప్‌డేట్స్, ఫోరమ్స్ ఇలా రకరకాల క్యాటగిరీలలో ఈ ట్యాబ్స్ ఉంటాయి.

ట్రాష్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే...
 

ట్రాష్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే...

వీటిలో ఒక్కొక్క ట్యాబ్‌ను ఓపెన్ చేసి అందులో ఉపయోగంలేని మెయిల్స్ అన్నింటిని సెలక్ట్ చేసుకుని ట్రాష్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మెయిల్స్ అన్ని డిలీట్ కాబడతాయి. దీంతో మీ జీమెయిల్ అకౌంట్‌లో మరింత స్పేస్ ఏర్పడుతుంది. పాత మెయిల్స్‌ను డిలీట్ చేసిన తరువాత మీ గూగుల్ ఫోటోస్ అలానే గూగుల్ డ్రైవ్ అకౌంట్‌లోకి వెళ్లి అక్కడ మీకు అవసరంలేని ఫోటోలు ఇంకా ఫైల్స్ ను డిలీట్ చేస్తుండటం ద్వారా మరికొంత స్పేస్ మీకు కలిసోస్తుంది.

ఈ చిట్కాలతో మీ జీమెయిల్ అకౌంట్‌ మరింత యూజర్ ఫ్రెండ్లీ..

ఈ చిట్కాలతో మీ జీమెయిల్ అకౌంట్‌ మరింత యూజర్ ఫ్రెండ్లీ..

మీ జీమెయిల్ అకౌంట్ మీ మాతృభాషలో కినిపించాలంటే సెట్టింగ్స్‌లోని లాంగ్వేజ్ ఆఫ్సన్‌ను ఎంచుకుని ప్రస్తుత డిస్‌ప్లే భాషగా తెలుగును ఎంపిక చేుసుకోవాలి. ఆ సెట్టింగ్స్‌ను సేవ్ చేసినట్లయితే మీ జీమెయిల్ అకౌంట్‌లోని వివరాలు తెలుగు భాషలో దర్శనమిస్తాయి. తిరిగి ఇంగ్లీష్‌లోకి మార్చుకోవాలనిపిస్తే మరలా సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి లాంగ్వేజ్ ఆప్షన్‌ను ఎంచుకుని ప్రస్తుత డిస్‌ప్లే భాషగా ఇంగ్లీష్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే మీ జీమెయిల్ అకౌంట్ వివరాలు తిరిగి ఆంగ్లంలోకి మారిపోతాయి.

మరిన్ని చిట్కాలు..

మరిన్ని చిట్కాలు..

జీమెయిల్‌లో కొలువుతీరి ఉన్న అండూ సెండ్ ఫీచర్‌ను కాన్ఫిగర్ చేసుకోవటం ద్వారా పంపిన మెయిల్‌ను 30 సెకన్ల లోపు అండూ బటన్ ను ప్రెస్ చేసి ఆపు చేసుకునే అవకాశముంది. జీమెయిల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అండూ సెండ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఈ సదుపాయం మీకు అందుబాటులో ఉంటుంది. జీమెయిల్ సెట్టింగ్స్ పేజీలోని కస్టమ్ కీబోర్డ్ షార్ట్‌కట్స్ ఫీచర్‌లోకి వెళ్లటం ద్వారా మీ మెయిల్ అకౌంట్‌కు సంబంధించి మీకు నచ్చినట్లు కీబోర్డ్ షాట్‌కట్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Google Drive is a cloud storage service offered by Google to all the Google users.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X