వాట్సప్ లో స్టిక్కర్స్ క్రియేట్ చేయడం ఎంత ఈజీయో చూడండి
ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్, ఇటీవల తన ప్లాట్‌ఫామ్‌ను ఉద్దేశించి స్టిక్కర్స్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలసిందే.
ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్, ఇటీవల తన ప్లాట్‌ఫామ్‌ను ఉద్దేశించి స్టిక్కర్స్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలసిందే. ఈ ఫీచర్‌ను వాట్సాప్ ఆండ్రాయిడ్, వాట్సాప్ ఐఓఎస్ అలానే వాట్సాప్ వెబ్ యూజర్లు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్‌లో నిక్షిప్తం చేసిన స్టిక్కర్ స్టోర్ ద్వారా యూజర్లు తమ సెల్ఫీస్ మరియు ఫోటీస్ తో వివిధ వెరైటీలతో కూడిన స్టిక్కర్స్‌ను క్రియేట్ చేసుకొని యూజర్లు తమ న్యూ ఇయర్ గ్రీటింగ్స్‌ను సెండ్ చేసుకోవచ్చు. నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా వాట్సాప్ స్టిక్కర్స్‌ను ఉపయోగించుకుని మీ సెల్ఫీస్ మరియు ఫోటీస్ ద్వారా న్యూ ఇయర్ గ్రీటింగ్స్‌ను ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చో అనే దాని పై స్టెప్ బై స్టెప్ ప్రాసీజర్‌ను మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి..

స్టెప్ 1:
గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఏదైనా background eraser యాప్ ను డౌన్లోడ్ చేయండి

స్టెప్ 2:
కెమెరా యాప్ ఓపెన్ చేసి కొన్ని ఫొటోస్ ను క్లిక్ చేయండి

స్టెప్ 3:
ఇప్పుడు background eraser యాప్ ను ఓపెన్ చేసి ఇమేజ్ ను సెలెక్ట్ చేయండి.

స్టెప్ 4:
బ్యాక్ గ్రౌండ్ ఎరేజ్ చేసి స్టికర్ లా కనిపించడానికి ఇమేజ్ ను క్రాప్ చేయండి

స్టెప్ 5:
మూడు స్టికర్లు కంటే తక్కువగా వాట్సాప్ స్టిక్కర్ ప్యాక్ కి మద్దతు ఇవ్వని విధంగా మూడు లేదా నాలుగు స్టిక్కర్లను క్రియేట్ చేయండి.

స్టెప్ 6:
ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ‘Personal App for WhatsApp'అనే యాప్ ను డౌన్లోడ్ చేయండి.

స్టెప్ 7:
యాప్ ను ఓపెన్ చేయండి ,అది ఆటోమేటిక్ గా అన్నీ కొత్త అంశాలను డిటెక్ట్ చేస్తుంది.

స్టెప్ 8:
స్టిక్కర్ పక్కన ఉన్న '‘Add'' బటన్ ను నొక్కండి.

స్టెప్ 9:
అడిగినప్పుడు '‘Add'' బటన్ పై నొక్కండి.

స్టెప్ 10:
వాట్సాప్ లోకి వెళ్లి చాట్ విండో ను ఓపెన్ చేయండి.

స్టెప్ 11:
‘Emoji' ఐకాన్ ను నొక్కండి .

స్టెప్ 12:
‘Stickers' ఆప్షన్ లోకి వెళ్ళండి.

స్టెప్ 13:
మీకు కావాల్సిన స్టికర్ పై క్లిక్ చేసి మీ స్నేహితులకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్‌ను తెలపండి


Click it and Unblock the Notifications








