వాట్సాప్ స్టిక్కర్స్ క్రియేట్ చేయడం ఎలా..?

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న వాట్సాప్, ఎట్టకేలకు స్టిక్కర్స్ సదుపాయాన్ని ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు తీసుకువచ్చింది.

|

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న వాట్సాప్, ఎట్టకేలకు స్టిక్కర్స్ సదుపాయాన్ని ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు తీసుకువచ్చింది.ఈ ఫీచర్‌ను వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవచ్చు.వాట్సాప్‌లో కొత్త యాడ్ అయిన స్టిక్కర్స్‌లో చాలా వరకు స్టిక్కర్స్ ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఉన్నవే కావటం విశేషం. ఈ నేపథ్యంలో వాట్సాప్ లో మీరు సొంతంగా వాట్సాప్ స్టిక్కర్స్ ను క్రియేట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా వాట్సాప్ స్టిక్కర్స్‌ను ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు తెలుపుతున్నాము. ఓ లుక్కేయండి....

<strong>జియో తరహాలో సరికొత్త ప్లాన్ ను లాంచ్ చేసిన ఎయిర్టెల్</strong>జియో తరహాలో సరికొత్త ప్లాన్ ను లాంచ్ చేసిన ఎయిర్టెల్

వాట్సాప్ స్టిక్కర్స్ క్రియేట్ చేయడం ఎలా ?

వాట్సాప్ స్టిక్కర్స్ క్రియేట్ చేయడం ఎలా ?

- మీ మొబైల్ లో ఉన్నగూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ‘Sticker maker for WhatsApp' అనే యాప్ ను డౌన్లోడ్ చేయండి
- యాప్ ను డౌన్లోడ్ చేసాక యాప్ ను రన్ చేయండి
- "Create a new sticker pack" అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి
- స్టిక్కర్ ప్యాక్ యొక్క పేరు మరియు రచయితను నమోదు చేయండి. ఇది కేవలం వివరణాత్మక ప్రయోజనాల కోసం మరియు మీ అనుకూలీకరించిన స్టికర్లు ఇతర WhatsApp వినియోగదారులకు అందుబాటులో ఉండవు.
- న్యూ లిస్ట్ ఆప్షన్ ను క్లిక్ చేయండి ఖాళీ స్టిక్కర్లు ట్రేతో పేజీ తెరవబడుతుంది.
- మొదట, స్టిక్కర్లు ప్యాక్ యొక్క చిహ్నాన్ని జోడించి, ఆపై కొత్త కస్టమైజ్డ్ స్టిక్కర్ను జోడించడానికి తదుపరి ట్రేలో నొక్కండి.
- ఒక కొత్త స్టిక్కర్ జోడించడానికి ఖాళీ ట్రే నొక్కండి అప్పుడు మీరు ఒ కొత్త ఫోటో తీసుకోవచ్చు లేదా గ్యాలరీ నుండి ఇంపోర్ట్ చేసుకోవచ్చు
-మీరు ఫోటో ను సెలక్ట్ చేసాక అది ఇమేజ్ ఎడిటర్ లో అప్ లోడ్ అవుతుంది.
- ఒక కొత్త స్టిక్కర్ కోసం ఆ ఇమేజ్ నుండి మీకు కావాల్సిన విధంగా క్రాప్ చేయండి.
- ఇప్పుడు, ప్యాక్ కి మరింత అనుకూల స్టిక్కర్లను జోడించడానికి ఫోటోను సేవ్ చేసి ఈ స్టెప్స్ ను రిపీట్ చేయండి.
- ప్యాక్కు స్టిక్కర్లను జోడించడం పూర్తయిన తర్వాత Publish Sticker Pack ఆప్షన్ ను క్లిక్ చేయండి.
- మీరు మీ WhatsApp యాప్ కు ఈ స్టిక్కర్లను జోడించమని అడగబడతారు,వెంటనే మీరు యాక్సప్ట్ చేసి మీ కస్టమైజ్డ్ స్టిక్కర్స్ ను
అందరితో షేర్ చేసుకోండి.

 

 

యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి...

యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి...

వాట్సాప్ స్టిక్కర్ ప్యాక్‌ను ఉపయోగించుకోవాలనుకునే యూజర్లు ముందుగా తమ డివైస్‌లోని యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. యాప్ అప్‌డేట్ అయిన వెంటనే చాట్ విండోలో స్టిక్కర్ బటన్ కనిపిస్తుంది. ఈ బటన్ పై టాప్ చేసినట్లయితే అందుబాటులో ఉన్న అనేక స్టిక్కర్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో నచ్చిన ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.

స్టేటస్‌లో యాడ్స్..

స్టేటస్‌లో యాడ్స్..

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌ను కొత్తకొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేస్తోన్న విషయం తెలిసిందే. వాట్సాప్ లాంచ్ చేస్తోన్న కొత్త ఫీచర్లలో కొన్ని ఆకట్టుకునే విధంగా ఉంటుంటే మరికొన్ని మాత్రం నిరుత్సహా పరిచే విధంగా ఉంటున్నాయి. తాజాగా రివీల్ అయిన మరో రిపోర్ట్ ప్రకారం, వాట్సాప్ తన యూజర్లకు సంబంధించిన Statusలలో యాడ్‌లను ప్రదర్శించటం మొదలుపెట్టింది.

తొలత iOS వెర్షన్‌లో...

తొలత iOS వెర్షన్‌లో...

మొదటి నుంచి వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉన్న వాట్సాప్ తాజాగా ఇటువంటి నిర్ణయం తీసుకోవటం పట్ల విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. @WABetaInfo రివీల్ చేసి వివరాల ప్రకారం వాట్సాప్ తన iOS వెర్షన్‌లో యాడ్స్‌ను ఇంప్లిమెంట్ చేయబోతోంది. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తరువాత నుంచి పరిణమాలు శరవేగంగా మారిపోతున్నాయి.

Best Mobiles in India

English summary
How to create your own custom stickers packs for WhatsApp.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X