మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో, సొంతంగా లాక్ స్ర్కీన్ క్రియేట్ చేసుకోవటం ఎలా..?

స్మార్ట్‌ఫోన్‌కు లాక్‌స్ర్కీన్ అనేది తప్పనిసరి. ఫోన్‌కు లాక్ అనేది లేకపోతే ఇతరులు మన ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్‌లలో లాక్ స్ర్కీన్‌లను ఏర్పాటు చేయటం ద్వారా డివైస్ సెక్యూరిటీ స్థాయిని మరింత పటిష్టం చేసుకోవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో, సొంతంగా లాక్ స్ర్కీన్ క్రియేట్ చేసుకోవటం ఎలా..?

Read More : మీ క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలను ఎలా దొంగిలిస్తారో తెలుసా..?

స్మార్ట్‌ఫోన్‌‌లలో ఇన్‌బుల్ట్‌గా కొన్ని లాక్‌స్ర్కీన్‌లు ఉన్నప్పటికి, అవి చాలా మందికి బోరింగ్‌గా అనిపిస్తాయి. ఈ క్రమంలో ఇతర మార్గాల ద్వారా థర్డ్ పార్టీ లాక్ స్ర్కీన్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటుంటాం. మనం ఎంపిక చేసుకునే లాక్ స్ర్కీన్ యాప్స్‌లో కొన్ని డిజైనింగ్ ఇంకా విజువల్స్ పరంగా ఆకట్టుకుంటే మరికొన్ని మాత్రం అద్భుతమైన క్రియేటివిటీతో అలరిస్తుంటాయి. ఇప్పుడు మేము సూచించబోతున్న కూల్ ట్రిక్‌ను ఫాలో అవటం ద్వారా, మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో.. మీకు నచ్చిన విధంగా.. మీరే సొంతంగా లాక్ స్ర్కీన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ మార్గాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

తక్కువ బడ్జెట్‌లో 5 స్మార్ట్‌ఫోన్‌లు

ముందుగా Lock Screen Club: HD Themes అనే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకని ఇన్‌స్టాల్ చేసుకోండి.

స్టెప్ 2

ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత, మీ ఫేస్‌బుక్ లేదా జీమెయిల్ అకౌంట్ ద్వారా యాప్‌లోకి లాగిన్ అవ్వండి.

స్టెప్ 3

రూ.14తో దేశమంతా కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ..

యాప్‌లోకి లాంచ్ అయిన తరువాత, యాప్ పేజీలో కనిపించే "create a theme" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని, మీకు నచ్చిన ఆర్టిస్ట్ డిజైన్‌ను సెలక్ట్ చేసుకోండి

స్టెప్ 4

డిజైన్‌ను సెలక్ట్ చేసుకున్న తరువాత మీరు కోరుకున్న విధంగా, కోరుకున్న కలర్
రేంజ్‌లో థీమ్‌ను క్రియేట్ చేసుకుని layout and appearances ఆప్షన్ ద్వారా లాక్ స్ర్కీన్‌ను అడ్జస్ట్ చేసుకోండి.

స్టెప్ 5

కోడింగ్ అవసరంలేదు, కేవలం 20 నిమిషాల్లో యాప్ తయారు చేయండి!

ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే, యాప్ టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే tick సైన్ బటన్ పై క్లిక్ చేయండి. మీరు సృష్టించిన లాక్ స్ర్కీన్ విజయవంతంగా సేవ్ కాబడుతుంది.

My Locker యాప్..

మీరే సొంతంగా లాక్ స్ర్కీన్‍‌ను ఏర్పాటు చేసుకునేందుకు My Locker పేరుతో మరో యాప్ మార్కెట్లో సిద్ధంగా ఉంది. ఈ యాప్ సహాయంతో లాక్ స్ర్కీన్‌ను కావల్సిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. అంతకాకుండా, ఆ స్ర్కీన్‌ను మీ మిత్రులకు కూడా షేర్ చేసుకోవచ్చు.

స్టెప్ 1

ముందుగా My Locker యాప్‌ను, మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి.

స్టెప్ 2

మార్కెట్లోకి లెనోవో కే6 నోట్, శనివారం నుంచి అమ్మకాలు

యాప్ ‘టర్మ్స్ అండ్ కండీషన్స్'ను అంగీకరించే క్రమంలో "Agree and Proceed" ఆప్షన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3

My Locker యాప్‌ను డీఫాల్ట్ యాప్‌గా సెట్ చేసుకునే క్రమంలో యాప్ హోమ్ బటన్ సెట్టింగ్‌లోకి వెళ్లి "Ok" ఆప్షన్ పై క్లిక్ చేయండి. కొత్త థీమ్‌ను క్రియేట్ చేసకునే క్రమంలో "New Theme" ఆప్షన్ పై క్లిక్ చేసి, మీకు నచ్చిన ఇమేజ్‌ను అప్‌లోడ్ చేయండి. My Locker యాప్‌ను ఎక్స్‌‌ప్లోర్ చేయటం ద్వారా మీకు అనేక ఫీచర్స్ కనిపిస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How To Create Your Own Lock Screen On Android. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot