ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఫ్లాష్ మెసేజ్‌లను డీయాక్టివేట్ చేయడం ఎలా?

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మీరు ఉపయోగిస్తుంటే కనుక మీరు క్యారియర్ ద్వారా సాధారణ SMS లాంటిది కాకుండా వేరే రకమైన పాప్-అప్ మెసేజ్ ని మీరు చూసి ఉండవచ్చు. ఇటువంటి మెసేజ్లను ఫ్లాష్ SMS అని పిలుస్తారు. అవి సాధారణంగా క్యారియర్‌ల ద్వారా వినియోగదారులకు పంపబడతాయి. మీ రోజువారి డేటా లేదా ప్లాన్ గురించి మీకు తెలియజేయడానికి ఉద్దేశించిన సాధారణ SMS వలె కాకుండా ఫ్లాష్ మెసేజ్ లు మీ దృష్టిని ఆకర్షించడానికి క్యారియర్ ద్వారా విభిన్న రకాల మెసేజ్ లు పంపబడుతాయి. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మీరు వాటిని మూసివేసే వరకు అవి మీ యొక్క ఫోన్‌లో కనిపిస్తూనే ఉంటాయి.

 

క్యారియర్‌ల

మీ ప్రస్తుత డేటా ప్లాన్ గురించి చెప్పడానికి క్యారియర్‌ల ద్వారా ఒక్కోసారి ఫ్లాష్ మెసేజ్లు పంపబడతాయి. తద్వారా మీరు మీ మొత్తం ప్లాన్‌ను ఉపయోగించలేరు. అయిత ఈ రోజుల్లో క్యారియర్ కంపెనీలు కొన్ని ప్రచార ఆఫర్‌లను పంపడానికి కూడా ఫ్లాష్ SMS మెసేజ్లను ఉపయోగిస్తున్నాయి. ఉదాహరణకు: కొత్త రీఛార్జ్ ప్యాక్‌ను ప్రకటించడానికి ఇటువంటి ఫ్లాష్ SMSలను వినియోగదారులకు పంపుతున్నాయి. ఇలాంటి ఫ్లాష్ SMS మెసేజ్లు కొన్నిసార్లు చికాకు కలిగించడంతో వినియోగదారులు వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదృష్టవశాత్తూ మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఫ్లాష్ మెసేజ్లను ఆపివేయడానికి ఒక మార్గం ఉంది. ఫ్లాష్ మెసేజ్లను ఆఫ్ చేసే పద్ధతి Airtel, Vodafone Idea, Reliance Jio మరియు BSNL క్యారియర్‌కు భిన్నంగా ఉంటుంది. మీ ఆండ్రాయిడ్ పరికరంలో ఫ్లాష్ SMS ఫీచర్‌ను ఎలా నిలిపివేయవచ్చునో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ క్యారియర్

ఎయిర్‌టెల్ క్యారియర్

స్టెప్ 1: మీ ఫోన్ యాప్ ట్రేకి వెళ్లి, 'Airtel Services' యాప్ కోసం వెతికి దానిపై నొక్కండి.

స్టెప్ 2: ఇప్పుడు ఎయిర్‌టెల్‌పై నొక్కండి.

స్టెప్ 3: స్టార్/స్టాప్‌పై నొక్కండి.

స్టెప్ 4: చివరగా 'Stop' ఎంపికపై క్లిక్ చేయండి.

 

వోడాఫోన్ ఐడియా(Vi) క్యారియర్
 

వోడాఫోన్ ఐడియా(Vi) క్యారియర్

స్టెప్ 1: మీ ఫోన్‌లో 'వోడాఫోన్ సర్వీసెస్' యాప్ కోసం వెతికి దానిపై నొక్కండి.

స్టెప్ 2: ఫ్లాష్‌పై నొక్కండి.

స్టెప్ 3: యాక్టివేషన్‌పై నొక్కండి.

స్టెప్ 4: డియాక్టివేట్ ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 5: Vi వినియోగదారులు ఫ్లాష్ SMS ఫీచర్‌ను డియాక్టివేట్ చేయడానికి 199కి 'CAN FLASH' SMS కూడా పంపవచ్చు.

 

రిలయన్స్ జియో క్యారియర్

రిలయన్స్ జియో క్యారియర్

రిలయన్స్ జియో వినియోగదారుల కోసం ఫ్లాష్ మెసేజ్‌లను స్వీకరించడం ఆపివేయడానికి మీరు మీ ఫోన్‌లో My Jio యాప్‌ని సైన్ అవుట్ చేసి అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. మీరు ఇప్పటికీ ఫ్లాష్ మెసేజ్లను స్వీకరిస్తే కనుక జియో కస్టమర్ కేర్ నంబర్‌ను సంప్రదించండి మరియు ఫ్లాష్ మెసేజ్ల సర్వీసును మాన్యువల్‌గా డీయాక్టివేట్ చేసుకోండి.

BSNL క్యారియర్

BSNL క్యారియర్

స్టెప్ 1: మీ ఫోన్‌లో 'BSNL మొబైల్' యాప్ కోసం సెర్చ్ చేయండి. అది ప్రాథమికంగా BSNL క్యారియర్ యొక్క టూల్‌కిట్ యాప్. మీరు దాన్ని కనుగొన్న తర్వాత యాప్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: BSNL బజ్ సర్వీస్‌పై నొక్కండి.

స్టెప్ 3: డియాక్టివేట్ ఎంపికపై క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

English summary
How to Deactivate Flash Messages on Android Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X