Home
How to

Instagram అకౌంటును తాత్కాలికంగా డీయాక్టివేట్ చేయడం ఎలా??

సోషల్ మీడియా అనేది ప్రస్తుత రోజులలో మన యొక్క జీవనోపాధిపై మంచి మరియు చెడు ప్రభావం రెండిటిని చూపుతున్నది. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా చాలా సహాయకారిగా ఉంటుంది. అయితే ఇటువంటి ప్లాట్‌ఫారమ్‌లను అతిగా ఉపయోగించడం కూడా మనకి చెడు ప్రభావాలను కలిగిస్తుంది. మీరు కొంతకాలం సోషల్ మీడియా నుండి వైదొలగాలనుకుంటే లేదా మీ అకౌంటును ఎప్పటికీ తొలగించాలనుకుంటే కనుక ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి అన్ని ప్లాట్‌ఫారమ్‌లలోను దానికి ఒక మార్గం ఉంది. అయితే ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ యొక్క అకౌంటును కొంతకాలం పాటు ఎలా నిష్క్రియం చేయవచ్చు లేదా తొలగించవచ్చు వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How to Deactivate Instagram Account Temporarily Step by Step

ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంటును తాత్కాలికంగా డీయాక్టివేట్ చేసే విధానం

మీరు కొన్ని రోజులపాటు మీ యొక్క ఫోన్ లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంటును చూడకుండా ఉండడానికి దానిని డీయాక్టివేట్ చేయాలని చూస్తుంటే కనుక క్రింద పేర్కొన్న దశలను అనుసరించండి.

*** మొబైల్ బ్రౌజర్ నుండి instagram.com లోకి లాగిన్ అవ్వండి. ఎందుకంటే డిసేబుల్ ఎంపిక మొబైల్ యాప్ లో అందుబాటులో లేదు కాబట్టి మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లోని బ్రౌజర్‌లో మీ అకౌంటును ఓపెన్ చేయాలి.

*** తరువాత క్రిందభాగంలో కుడి వైపున ఉన్న ప్రొఫైల్ పిక్చర్‌పై క్లిక్ చేయండి. ఇందులో ప్రొఫైల్ ఎంపికపై నొక్కండి, ఆపై ప్రొఫైల్‌ని సవరించు ఎంపిక మీద క్లిక్ చేయండి.

*** కిందకు స్క్రోల్ చేసి 'Temporarily డిసేబుల్ మై అకౌంట్' ఆప్షన్‌ను కనుగొని దానిపై నొక్కండి.

*** తరువాత మీరు అకౌంటును ఎందుకు డిసేబుల్ చేస్తున్నారో పక్కన ఉన్న డ్రాప్-డౌన్ మెను నుండి ఒక ఎంపికను ఎంచుకోవాలి.

*** తరువాత మీ అకౌంట్ యొక్క పాస్‌వర్డ్‌ను తిరిగి నమోదు చేయండి.

*** ఇప్పుడు అకౌంటును తాత్కాలికంగా నిలిపివేసే ఎంపికపై నొక్కండి.

గమనిక: మీరు మెను నుండి ఒక కారణాన్ని ఎంచుకుని మీ పాస్‌వర్డ్‌ను నమోదు చేసిన తర్వాతే అకౌంటును నిలిపివేసే ఎంపిక కనిపిస్తుంది.

How to Deactivate Instagram Account Temporarily Step by Step

Instagram అకౌంటును పూర్తిగా తొలగించే విధానం

** ఐడి మరియు పాస్‌వర్డ్‌తో మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంటులో లాగిన్ అవ్వండి.

** మీ అకౌంట్ పేజీని తొలగించడానికి వెళ్ళండి. మొబైల్ యాప్ ద్వారా అకౌంటును తొలగించలేమని గమనించాలి.

** మీరు మీ అకౌంటును ఎందుకు తొలగిస్తున్నారో పక్కన ఉన్న డ్రాప్‌డౌన్ మెను నుండి ఒక ఎంపికను ఎంచుకోండి

** అప్పుడు మీ ఖాతా పాస్‌వర్డ్‌ను తిరిగి నమోదు చేయండి.

** ఇప్పుడు స్క్రీన్‌పై కనిపించే డిలీట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

గమనిక: మీరు మెను నుండి ఒక కారణాన్ని ఎంచుకుని, మీ పాస్‌వర్డ్‌ను నమోదు చేసిన తర్వాతే ఖాతాను నిలిపివేసే ఎంపిక కనిపిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Deactivate Instagram Account Temporarily Step by Step
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X