Twitter అకౌంటును తాత్కాలికంగా డియాక్టివేట్ చేయడం ఎలా??

|

ప్రపంచం మొత్తం మీద ప్రజలు ప్రస్తుతం రోజులో ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ప్రపంచం మొత్తం మీద బాగా పాపులర్ అయిన సోషల్ మీడియా యాప్ లలో ట్విట్టర్ ఒకటి. ఇటీవల ప్రముఖ బిలియనీర్ ఎలోన్ మస్క్ ట్విట్టర్ సంస్థను టేకోవర్ చేసుకున్నాడు. ట్విట్టర్ లో మాట్లాడే స్వేచ్ఛను తీసుకొనిరావాలని ప్రయత్నిస్తున్న ఎలోన్ మస్క్ రాబోయే నెలల్లో అతను ట్విట్టర్ ని ఎలా మారుస్తాడనే విషయం మీద కొంత మంది ఉత్సహంగా ఉంటే మరికొంత మంది ఆందోళనలో ఉన్నారు. మీలో ఎవరైనా కొంత సమయం పాటు ట్విట్టర్ నుండి విరామం తీసుకోవాలనుకుంటే కనుక మీరు మీ అకౌంటును తాత్కాలికంగా డియాక్టివేట్ చేయవచ్చు. అయితే ఎలా డియాక్టివేట్ చేయాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How to Deactivate Twitter Account Temporarily Step by Step

Twitter అకౌంటును తాత్కాలికంగా డియాక్టివేట్ చేసే విధానం

** ముందుగా మీ ట్విట్టర్ ప్రొఫైల్‌కి వెళ్లి మెను చిహ్నంపై నొక్కండి.

** సెట్టింగ్‌స్ > ప్రైవసీ విభాగంకి వెళ్లండి.

** తరువాత "అకౌంట్" ఎంపికకి వెళ్లి, ఆపై "మీ అకౌంటును డియాక్టివేట్ చేయి" ఎంపికను ఎంచుకోండి.

** "డియాక్టివేట్ చేయి" ఎంచుకోవడం ద్వారా మీరు మీ అకౌంటును డియాక్టివేట్ చేయాలనుకుంటున్నారని నిర్ధారించి, ఆపై మళ్లీ నిర్ధారించండి.

How to Deactivate Twitter Account Temporarily Step by Step

మీ అకౌంటును డియాక్టివేట్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలలో మొదటిది మీ డియాక్టివేషన్ విండో 30-రోజులు దాటితే కనుక మీ అకౌంట్ శాశ్వతంగా తొలగించబడుతుంది. కావున 30 రోజులలోపే అకౌంటును తిరిగి యాక్టివేట్ చేయాలి. అకౌంట్ ఒకసారి తొలగించిన తర్వాత మీరు దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయలేరు. కావున మీ పాత ట్వీట్‌లకు యాక్సిస్ ను కోల్పోతారు.

How to Deactivate Twitter Account Temporarily Step by Step

మీరు మీ అకౌంటును డీయాక్టివేట్ చేసినట్లయితే కనుక ఇతరుల ట్వీట్లలో మీ అకౌంట్ యూసర్ నేమ్ ప్రస్తావనలు ఉంటాయి. అయితే మీ ప్రొఫైల్ అందుబాటులో లేనందున హ్యాండిల్ మీ ప్రొఫైల్‌కి లింక్ చేయబడదు.

Best Mobiles in India

English summary
How to Deactivate Twitter Account Temporarily Step by Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X