యూట్యూబ్ Offline వీడియోలను డిలీట్ చేయటం ఎలా..?

|

ప్రపంచపు అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించిన యూట్యూబ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గూగుల్ బెస్ట్ ప్రొడక్ట్స్‌లో ఒకటిగా నిలిచిన యూట్యూబ్ 2005 నుంచి మార్కెట్లో సేవలందిస్తోంది. 2014లో యూట్యూబ్ లాంచ్ చేసిన Offline వ్యూవింగ్ అనే ఫీచర్ ఆ వెబ్‌సైట్ దిశనే మార్చేసింది. ఈ ఫీచర్ అందుబాటులోకి అందుబాటులోకి వచ్చిన తరువాత మొబైల్ యూట్యూబ్ యూజర్లు తమకు నచ్చిన యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని వాటిని ఆఫ్‌లైన్‌లో వీక్షించగలుగుతున్నారు. ఈ ఫీచర్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఐఫోన్ ఇంకా ఐప్యాడ్‌లలో మాత్రమే వర్క్ అవుతోంది. డెస్క్‌టాప్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు.

 

మీ జీమెయిల్ ఇన్‌బాక్స్‌ ఫుల్ అని చూపిస్తోందా..?మీ జీమెయిల్ ఇన్‌బాక్స్‌ ఫుల్ అని చూపిస్తోందా..?

30 రోజుల పాటు ఇంటర్నెట్‌తో పనిలేకుండా...

30 రోజుల పాటు ఇంటర్నెట్‌తో పనిలేకుండా...

ఆఫ్‌లైన్ వ్యూవింగ్ ఫీచర్‌లో భాగంగా డౌన్‌లోడ్ చేసుకున్న వీడియోలను 30 రోజుల పాటు ఇంటర్నెట్‌తో పనిలేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వీక్షించుకునే వీలుంటుంది. ఈ 30 రోజులు టైమ్ పూర్తయిన తరువాత ఆ వీడియోలు డౌన్‌లోడ్స్ సెక్షన్‌లో కినిపించినప్పటికి ఓపెన్ కావు, దీంతో వీటిని ఎలా తొలగించాలో తెలియక చాలా మంది కన్ఫ్యూజన్‌కు గురవుతుంటారు.

 

 

వీటిని డిలీట్ చేయాలంటే..

వీటిని డిలీట్ చేయాలంటే..

వాస్తవానికి ఈ వీడియోలను మామూలు పద్ధతిలో డిలీట్ చేయటం కుదరదు. వీటిని డిలీట్ చేయాలంటే యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీరు వినియోగిస్తున్నది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అయితే డౌన్‌లోడ్స్ సెక్షన్‌ను, ఐఫోన్ లేదా ఐప్యాడ్ అయితే ఆఫ్‌లైన్ సెక్షన్‌ను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ సెక్షన్స్ ఓపెన్ అయిన తరువాత డిలీట్ డౌన్‌లోడ్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి వాటిలో డిలీట్ చేయానుకుంటోన్న వాటిని ఒక్కొక్కటిగా సెలక్ట్ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు.

ఇప్పుడు మరిన్ని మాడిఫికేషన్స్‌తో లభ్యం..
 

ఇప్పుడు మరిన్ని మాడిఫికేషన్స్‌తో లభ్యం..

యూట్యూబ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసుకు ఇంతగా డిమాండ్ నెలకున్న నేపథ్యంలో యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళ్లేందుకు యూట్యూబ్ గో పేరుతో విప్లవాత్మక యాప్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. యూట్యూబ్ గో యాప్ ద్వారా యూజర్లు 2జీ నెట్‌వర్క్‌లలో కూడా వీడియోలను సేవ్ చేసుకొని వాటిని ఆఫ్‌లైన్ మోడ్‌లో వీక్షించవచ్చు. ఈ సదుపాయం గతంలోనే అందుబాటులో ఉన్నప్పటికి మరిన్ని మాడిఫికేషన్స్‌తో ఇప్పుడు లభ్యమవుతోంది.

క్వాలిటీని కావల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు..

క్వాలిటీని కావల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు..

యూట్యూబ్ గో యాప్ ద్వారా ఆఫ్‌లైన్ మోడ్‌లో వీడియోలను వీక్షించేటపుడు విడియోకు సంబంధించిన క్వాలిటీని కూడా అడ్జస్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇండియన్ యూజర్ల డేటా బడ్జెట్‌కు అనుగుణంగా డిజైన్ చేయబడిన యూట్యూబ్ గో యాప్ ద్వారా అందుబాటులో ఉన్న డేటా వనరులతోనే క్వాలిటీ వీడియో బ్రౌజింగ్‌ను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది.

ఫోన్ ఎస్డీకార్డ్‌లో స్టోర్ చేసుకునే ఆప్షన్...

ఫోన్ ఎస్డీకార్డ్‌లో స్టోర్ చేసుకునే ఆప్షన్...

యూట్యూబ్ గో యాప్ ద్వారా మీరు ఏదైనా వీడియోను ఓపెన్ చేసినట్లయితే ఓ పాపప్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. ఈ పాపప్ పై క్లిక్ చేయటం ద్వారా మీ నెట్ బ్యాలన్స్‌కు సంబంధించిన వివరాలతో పాటు ఆ వీడియోను ఫోన్ ఎస్డీకార్డ్‌లో స్టోర్ చేసుకునే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. మీ డేటా లిమిట్‌ను బట్టి ఆ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవాలా వద్దా అనేది మీ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Many YouTube videos can be downloaded nowadays but it works only on smartphones - i.e. the YouTube app for Android devices as well as iPhone and iPad, and the videos cannot be downloaded on desktops.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X