ఫేస్‌బుక్‌‌లో ఇవి చూడకుంటే కొంప కొల్లేరే !

Written By:

ఈ రోజుల్లో ఫేస్‌బుక్ లేని వ్యక్తిని వెతకడం చాలా కష్టం. ప్రతి ఒక్కరూ ఫేస్ బుక్ ని వాడేస్తుంటారు. తన గోడ మీద కావలిసినవన్నీ రాసేస్తుంటారు. ఇష్టమైనవారికి రిక్వెస్టులు పంపిస్తుంటారు. అయితే మీకు తెలియకుండానే మీరు పంపకుండానే రిక్వెస్టులు వెళ్లిపోతున్నాయన్న సంగతి మీకు తెలుసా..తెలియకుంటే ఓ సారి ఈ న్యూస్ చూడండి.

ఆ భయానక శబ్దాలు గ్రహాంతరవాసులవే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్రెండ్ రిక్వెస్ట్ లోకి వెళ్లి

మీరు ఓ సారి ఫ్రెండ్ రిక్వెస్ట్ లోకి వెళ్లి అక్కడ Find Friends అనే ఆప్సన్ ఉంటుంది. అది సెలక్ట్ చేసుకున్న తరువాత మీకు అక్కడ View sent requests అనే ఆప్సన్ మీద ఓ సారి క్లిక్ చేయండి.

మీకు తెలియకుండానే,

అక్కడ మీకు తెలియకుండానే మీరు పంపకుండానే అనేక రిక్వెస్టులు మీరు పంపినట్లుగా కనిపిస్తాయి. అక్కడ ఏమీ లేకపోతే ఎటువంటి సమస్యా లేదు. ఒకవేళ ఉంటేనే సమస్య మొదలవుతుంది. మీకు తెలియని అనేక మందికి ఈ రిక్వెస్టులు వెళ్లి ఉంటాయి.

వ్యూ సెంట్ రిక్వెస్ట్ దగ్గర క్లిక్ చేస్తే

ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఈ కింది సూచనలు ఫాలో అవ్వండి. అక్కడ ఉన్న వ్యూ సెంట్ రిక్వెస్ట్ దగ్గర క్లిక్ చేస్తే క్యాన్సిల్ రిక్వెస్ట్ అని వస్తుంది. దాంతో మీరు రిక్వెస్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు.

ఒక్కసారి ఎలా డిలీట్ చేయాలన్న దానికి

ఒకవేళ అనేక రిక్వెస్టులు ఉంటే వాటిని ఒక్కసారి ఎలా డిలీట్ చేయాలన్న దానికి కొన్ని చిట్కాలు ఇస్తున్నాం వాటిని ప్రయత్నించి చూడండి.

M అని టైప్ చేయండి.

ముందుగా మీ ఫేస్ బుక్ ఓపెన్ చేసి యూఆర్ ఎల్ బార్ దగ్గర M అని టైప్ చేయండి.

మీకు రిక్వెస్ట్ అనే ఆప్సన్

అక్కడ మీకు రిక్వెస్ట్ అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు పంపిన రిక్వెస్ట్ లు కనిపిస్తాయి. అయితే మీకు లెఫ్ట్ సైడ్ లో ఓ ఆప్సన్ ఉంటుంది. అందులో వ్యూ సెంట్ రిక్వెస్ట్ అనే ఆప్సన్ సెలక్ట్ చేసుకోండి.

inspect అనే ఆప్సన్

అక్కడ మీరు పంపిన అందరి రిక్వెస్టులు ఉంటాయి. వాటిల్లో మీరు ఓ రిక్వెస్ట్ మీద రైట్ క్లిక్ చేస్తే మీకు inspect అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి.

మీకు ఓ డేటా

తరువాత అక్కడ మీకు ఓ డేటా కనిపిస్తుంది. అందులో '_54k8 _56bs _56bt' ఇలాంటి నంబర్ కనిపిస్తుంది. దాన్ని కింద కనిపిస్తున్న లింక్ లో paste చేయాలి. ( ఇక్కడ మీకు paste చేసి ఉంది. మీకు అక్కడ కనిపించే నంబర్ కాపీ చేసుకోగలరు )

javascript:var inputs = document.getElementsByClassName('_54k8 _52jh _56bs _56bt');
for(var i=0; i inputs[i].click();
}

inspect ఆప్సన్ లో console

ఈ text మెత్తాన్ని inspect ఆప్సన్ లో console అనే ఆప్సన్ మీద క్లిక్ చేసి అక్కడ paste చేస్తే రిక్వెస్ట్ లన్నీ డిలీట్ అవుతాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to stop facebook sending friend requests without my permission more News At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot