ఫేస్‌బుక్ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేయాలంటే..?
మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా డిలీట్ చేద్దామనుకుంటున్నారా..? సాధారణంగా, ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేద్దామన్న ఆలోచన వచ్చిన వెంటనే చాలా మంది అకౌంట్ సెట్టింగ్స్ (Account Settings)లోకి ప్రేవేశించి సెక్యూరిటీ (security) విభాగాంలోని Deactivate your Account ఆప్షన్‌ను క్లిక్ చేస్తుంటారు.

అయితే, ఇలా చేయటం వల్ల ఫేస్‌బుక్ సర్వీస్‌ను మీ టైమ్‌లైన్ అదృశ్యమైనప్పటికి మీ ఫేస్‌బుక్ డేటా సర్వర్‌లో అలానే ఉండి పోతోంది. ఈ క్రమంలో గతంలో మీరు మీ అకౌంట్ నుంచి మీరు షేర్ చేసిన డేటా ఇతరుల అకౌంట్‌లలో అలానే ఉండిపోతుంది.
Read More : బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

ఇలా కాకుండా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను సర్వర్ నుంచే పూర్తిగా తొలగించివేయాలంటే ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగినై ఆ తరువాత వేరొక ట్యాబ్‌లో ఈ క్రింది లింక్‌ను ఓపెన్ చేసి తదుపరి సూచనలను అనుసరిచండి.

https://www.facebook.com/help/delete_account ఈ ప్రక్రియ ద్వారా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేసేందుకు ధరఖాస్తు చేసుకున్నట్లయితే 14 రోజుల తరువాత మీ అకౌంట్ పూర్తిగా డిలీట్ కాబడుతుంది.
Read More : ఇది మన భారతం!

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‍బుక్ మన సెర్చ్ హిస్టరీని సేవ్ చేసి ఓ క్రమ పద్ధితిలో డేటా బేస్‌ను క్రియేట్ చేస్తుంది. సేవ్ చేయబడిన సెర్చ్ హిస్టరీ ద్వారా కంటెంట్‌ను సలువుగా శోధించేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే, ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవటం కూడా ఓ మంచి పద్దతి. ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసేందుకు 5 ముఖ్యమైన చిట్కాలు...

ఫేస్‍బుక్ సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయటం ఎలా..?
ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.

ఫేస్‍బుక్ సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయటం ఎలా..?
హోమ్ పేజీ పై బాగంలోని రైట్ కార్నర్‌లో కనిపించే down arrow పై క్లిక్ చేసినట్లయితే ఓ డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులోని Activity Log ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

ఫేస్‍బుక్ సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయటం ఎలా..?
Activity Log ఆప్షన్‌ను పై క్లిక్ చేసిన వెంటనే వివిధ ఆప్షన్‌లతో కూడిన ఓ జాబితా స్ర్కీన్ ఎడమ వైపు కనిపిస్తుంది. ఈ జాబితా లిస్ట్ ను మరింతగా expand చేసేందుకు More పై క్లిక చేయండి. ఇప్పుడు కనిపించే జాబితా లిస్ట్‌లో Search ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

ఫేస్‍బుక్ సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయటం ఎలా..?
Search ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీరు సెర్చ్ చేసిన అంశాలకు సంబంధించిన జాబితా ఓపెన్ అవుతుంది. వాటిలో మీరు డిలీట్ చేయాలనుకుంటున్న సెర్చ్ ను ఎంపిక చేసుకని ఆ సెర్చ్ కు సంబంధింకి బ్లాక్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే డిలీట్ ఆప్షన్ మీకు కినిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీరు తొలగించాలనుకుంటున్న సెర్చ్ డిలీట్ కాబడుతుంది.

ఫేస్‍బుక్ సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయటం ఎలా..?
మొత్తం సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయాలనుకుంటే, పేజీ టాప్‌లో కనిపించే Clear Search link పై క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే మొత్తం సెర్చ్ హిస్టరీ డిలీట్ కాబడుతుంది.


Click it and Unblock the Notifications