మీ Paytm అకౌంట్ ను మరియు Paytm హిస్టరీ ని పూర్తిగా ఎలా డిలీట్ చేయాలో తెలుసుకోండి.

By Maheswara
|

నేడు కస్టమర్లు చిన్న వ్యాపారాలకు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తారు. వారు చెల్లింపు కోసం ప్రధానంగా Google Pay, PhonePay మరియు Paytm అప్లికేషన్లను ఉపయోగిస్తారు. ప్రముఖ UPI యాప్‌లలో Paytm ఒకటి. ఇది డబ్బు బదిలీతో పాటు అనేక సేవలను అందిస్తుంది. అలాగే మీకు అవసరం లేనప్పుడు Paytm ఖాతాను శాశ్వతంగా తొలగించవచ్చు అదిఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

 

Paytm ఖాతాను తొలగించడానికి ఈ స్టెప్స్ లను అనుసరించండి:

Paytm ఖాతాను తొలగించడానికి ఈ స్టెప్స్ లను అనుసరించండి:

అవును, Paytm యాప్ డబ్బు పంపడానికి లేదా స్వీకరించడానికి ఉపయోగకరమైన ప్లాట్‌ఫారమ్. వినియోగదారులు అవసరమైన KYCని పూరించడం ద్వారా Paytm ఖాతాను సృష్టించవచ్చు. Paytm ఖాతాను కూడా తొలగించవచ్చు. అలాగే Paytm హిస్టరీని కూడా డిలీట్ చేయవచ్చా? అనే విషయం కూడా ఇక్కడ తెలుసుకుందాం.

Paytm ఖాతాను తొలగించడానికి ఈ స్టెప్స్ లను అనుసరించండి:
* మీ Paytm ఖాతాకు లాగిన్ చేయండి.
* స్క్రీన్ ఎగువన ఎడమ వైపున ఉన్న హాంబర్గర్ మెనుని క్లిక్ చేయండి. మరియు ఇక్కడ కొన్ని ఎంపికలు కనిపిస్తాయి.
*ఆపై 24×7 సహాయంపై నొక్కండి.
* ప్రొఫైల్ సెట్టింగ్‌లపై నొక్కండి, అది కనుగొనబడకపోతే, మరిన్ని ఉత్పత్తులు మరియు సేవల ఎంపికపై నొక్కండి.
* ఆపై నేను నా ఖాతాను మూసివేయాలి/తొలగించాలి అనే ఆప్షన్ ను ఎంచుకోండి.
* ఆ తర్వాత I do not use this Paytm అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
* ఆపై చివరగా మాకు సందేశం పంపు పై నొక్కండి మరియు పంపండి.

Paytm చరిత్రను తొలగించవచ్చా?
 

Paytm చరిత్రను తొలగించవచ్చా?

Paytm చరిత్రను తొలగించవచ్చా?
కానీ , మీ Paytm యొక్క హిస్టరీ ని తొలగించడానికి అధికారికంగా ఎటువంటి మార్గం లేదు. కానీ దీనికి ప్రత్యామ్నాయంగా, Paytm యాప్‌లో చరిత్రను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా తనిఖీ చేయవచ్చు. ఒకవేళ మీ Paytm హిస్టరీని డిలీట్ చేస్తున్నట్లు క్లెయిమ్ చేసినప్పటికీ, మీ ఖాతా సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకపోవడమే మంచిది.

Paytmలో బ్యాంక్ ఖాతాను తొలగించడానికి ఈ స్టెప్ లను అనుసరించండి
* మీ ఫోన్‌లో Paytm యాప్‌ని తెరవండి.
* ఆపై ఎగువ ఎడమ మూలలో ఉన్న హాంబర్గర్ చిహ్నంపై నొక్కండి.
 * ఆ తర్వాత ప్రొఫైల్‌ని ఎంచుకోండి.
* పేమెంట్ సెట్టింగ్‌లపై నొక్కండి, ఆపై UPI మరియు లింక్డ్ బ్యాంక్ ఖాతాలను ఎంచుకోండి.
* ఇప్పుడు, మీ Paytm ఖాతాకు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాల జాబితా మీకు కనిపిస్తుంది.
 * ఏదైనా బ్యాంక్ ఖాతాను తొలగించడానికి మీరు ఖాతా తీసివేయి ఎంపికను నొక్కండి మరియు దాన్ని నిర్ధారించండి.

Paytm వ్యాపార ఖాతాను తొలగించడానికి ఈ దశలను అనుసరించండి

Paytm వ్యాపార ఖాతాను తొలగించడానికి ఈ దశలను అనుసరించండి

Paytm వ్యాపార ఖాతాను తొలగించడానికి ఈ దశలను అనుసరించండి
* Paytm యాప్‌ని తెరవండి
* ఆపై మీ ప్రొఫైల్ ఐకాన్‌పై నొక్కండి
* ఆ తర్వాత అక్కడ ఉన్న ఎంపికలలో వ్యాపార ఖాతా ఎంపికపై క్లిక్ చేయండి
* తర్వాత స్క్రోల్ చేయండి, అక్కడ కనిపించే Deactivate My Accountని ఎంచుకోండి.
 * ఖాతా 24 నుండి 48 గంటల్లో తొలగించబడుతుంది.

Paytm, Google Pay, BHIM, PhonePe మరియు ఇతర డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లు సురక్షితమైన చెల్లింపు అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కొంతమంది మోసగాళ్లు అమాయక వినియోగదారులను మోసగించడానికి కూడా వాటిని ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వెలువడిన వీడియోలు అటువంటి మోసాన్ని ఒకటి చూపిస్తుంది.

Paytm స్పూఫ్ యాప్

Paytm స్పూఫ్ యాప్

ఈ Paytm స్పూఫ్ యాప్ ఏదైనా చెల్లింపు చేసిన తర్వాత కనిపించే స్క్రీన్ లాగా కనిపించే నకిలీ యానిమేషన్‌ స్క్రీన్ ను చూపిస్తుంది. ఈ నకిలీ యానిమేషన్‌లో పేరు, సంప్రదింపులు మరియు లావాదేవీల సమయాన్ని సవరించడానికి ఈ యాప్ వినియోగదారుల కు పనిచేస్తుంది. ఇప్పటి వరకు ఈ యాప్ ఎక్కువగా షాప్ ఓనర్‌లను మోసగించి, వినియోగదారులు తమకు డబ్బును బదిలీ చేసినట్లు ఎక్కువగా ఈ స్కామ్ గురించి తెలుస్తోంది.

యానిమేషన్‌

యానిమేషన్‌

UPI సేవ అన్ని ప్లాట్‌ఫారమ్‌ల కు కనెక్ట చేయడం వల్ల, డిజిటల్ చెల్లింపులను అంగీకరించే ఏదైనా స్టోర్‌లో Paytm ఉపయోగించవచ్చు. కొనుగోలుదారుల స్మార్ట్‌ఫోన్‌లో చెల్లింపు ను ద్రువీకరించడానికి దుకాణ యజమానులు తరచుగా డబ్బు బదిలీ నిర్ధారణ యానిమేషన్‌ను చూస్తారు. Paytmలో మీరు మరొక వినియోగదారు నుండి చెల్లింపును స్వీకరించారని నిర్ధారించుకోవడానికి, మీరు యాప్‌లోని లావాదేవీల ట్యాబ్‌ని తప్పక తనిఖీ చేయాలి. Paytm యాప్ మీరు చెల్లింపును స్వీకరించినప్పుడల్లా యాప్‌లో నోటిఫికేషన్‌తో పాటు SMSను కూడా పంపుతుంది.ఇది గమనించండి.

Best Mobiles in India

Read more about:
English summary
How To Delete Paytm Account History And Account Permanently. Follow These Simple Tips.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X