Home
How to

incognito Search History ప్రైవేటు బ్రౌజింగ్‌ హిస్టరీని ఎలా డిలీట్‌ చేయాలి.. పూర్తి వివరాలు!

ఇంటర్నెట్‌ బ్రౌజింగ్ కోసం ప్రస్తుతం అనేక ‌బ్రౌజర్‌లను వినియోగిస్తున్నారు. అయితే కొన్నిసార్లు మనం ఇంటర్నెట్‌ యాక్టివిటీ స్టోర్‌ కాకుండా ఉండేందుకు వీలుగా Incognito మోడ్‌ ను ఉపయోగిస్తుంటాం. ఈ మోడ్‌లో బ్రౌజింగ్‌ చేయడం వల్ల సైట్‌ డేటా, కుకీస్‌, హిస్టరీ నమోదు కాకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా మనం ఇంటర్నెట్‌లో ఏం చూసినా సెర్చ్‌ హిస్టరీ, బ్రౌజింగ్‌ హిస్టరీలో తెలిసే అవకాశం లేదు. అందువల్ల అనేక మంది ప్రైవసీ కోసం ఈ మోడ్‌ను ఉపయోగిస్తారు.

ఇన్‌కాగ్నిటో మోడ్‌ నుంచి బయటకు వచ్చాక బ్రౌజింగ్‌ హిస్టరీ అంతా డిలీట్‌ కానుందని యూజర్లు భావిస్తుంటారు. అయితే బ్రౌజర్‌లో హిస్టరీ స్టోర్‌ కాకపోయినా.. ఇతర ప్రాంతాల్లో స్టోర్‌ అయ్యే అవకాశం ఉంటుంది. యాప్‌ స్టోరేజీ లేదా DNS Caches లో కొన్ని వివరాలు స్టోర్‌ అయ్యే అవకాశం ఉంది.

how to delete private search history

పూర్తి ప్రైవసీ కోసం వీటిని కూడా డిలీట్‌ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ ప్రొవైడర్‌ కూడా మీ హిస్టరీని తెలుసుకొనే అవకాశం ఉంది. మాన్యూవల్‌గానే వీటిని డిలీట్‌ చేయాలి. ప్రస్తుతం గూగుల్‌ క్రోమ్‌, Mozilla Firefox, మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌, సఫారీ వంటి బ్రౌజర్లు ప్రస్తుతం ఇన్‌కాగ్నిటో లేదా ప్రైవేట్‌ బ్రౌజింగ్‌ మోడ్‌ను అందిస్తున్నాయి.

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లలో ఎలా డిలీట్‌ చేయాలి?
- ప్రైవేట్‌ బ్రౌజింగ్‌ డేటాను డిలీట్‌ చేసేందుకు తొలుత సెట్టింగ్స్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.
- మీ ఫోన్‌లోని ప్రైవసీ లేదా సెక్యూరిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- బ్రౌజర్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, క్లియర్‌ బ్రౌజంగ్‌ డేటా పైన క్లిక్‌ చేయాలి.

- అనంతరం అక్కడ కనిపించే తేదీ, సమయాన్ని ఎంచుకోవాలి. All Time ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
- బ్రౌజింగ్‌ హిస్టరీ, కుకీస్, సైట్‌ డేటా, క్యాచీ ఇమేజ్‌, ఇతర ఫైల్స్‌ను ఎంచుకోవాలి.
- చివరిగా క్లియర్‌ డేటా ఆప్షన్‌ పైన క్లిక్ చేయాలి.

దీంతోపాటు క్లియర్‌ యాప్‌ డేటా ఆప్షన్‌ ద్వారా కూడా హిస్టరీని డిలీట్ చేయవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేసి అనంతరం బ్రౌజర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అనంతరం స్టోరేజీ అండ్‌ క్యాచీ పైన క్లిక్‌ చేయాలి. చివరిగా క్లియర్‌ డేటా పైన క్లిక్ చేయాలి.

DNS క్యాచీ ద్వారా కూడా పూర్తి హిస్టరీని డిలీట్‌ చేయవచ్చు. ఇందుకోసం గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం Chrome://net-internals/#dns అని అడ్రస్‌బార్‌లో టైప్‌ చేయాలి. చివరిగా క్లియర్‌ హోస్ట్‌ క్యాచీపైన క్లిక్‌ చేయాలి. ఈ విధంగా DNS రికార్డులను కూడా తొలగించే అవకాశం ఉంటుంది.

iOS లో ఇన్‌కాగ్నిటో హిస్టరీని ఎలా డిలీట్‌ చేయాలి?
- సఫారీ లో ప్రైవేట్ హిస్టరీని డిలీట్‌ చేసేందుకు తొలుత సెట్టింగ్స్ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.
- అనంతరం సఫారీ పైన క్లిక్‌ చేయాలి.
- క్లియర్ హిస్టరీ > వెబ్‌సైట్‌ డేటాను ఎంపిక చేసుకోవాలి. చివరిగా క్లియర్ హిస్టరీపైన క్లిక్‌ చేయాలి.

దీంతోపాటు క్రోమ్, ఎడ్జ్‌, ఫైర్‌ఫాక్స్‌ వంటి బ్రౌజర్‌ల హిస్టరీని కూడా డిలీట్‌ చేయవచ్చు. అనంతరం సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. తర్వాత ప్రైవసీపైన క్లిక్ చేయాలి. అనంతరం బ్రౌజంగ్‌ డేటాను ఎంచుకోవాలి. తర్వాత బ్రౌజింగ్‌ హిస్టరీ, సైట్‌ డేటా, కుకీస్‌, ఇమేజ్‌ సహా ఇతర ఫైల్స్‌ను ఎంచుకోవాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
how to delete private search history on iOS and android here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X