మీ ఫోన్‌‌‌లో వాట్సాప్ ఫోటోలు ఎక్కువైపోతున్నాయా..?

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోంచబడుతోన్న సూపర్ ఫాస్ట్ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్‌లలో వాట్సప్ ఒకటి. అయితే, ఈ యాప్ ఫోన్ మెమరీని ఎక్కువుగా వినియోగించుకుంటోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీటికి మాటికి కొత్త‌కొత్త అప్‌డేట్‌లను వాట్సాప్ లాంచ్ చేస్తుండటంతో ఎప్పటికప్పుడు యూజర్ కొత్త వర్షన్‌కు అప్‌గ్రేడ్ కావల్సి వస్తోంది. ఈ సాఫ్ట్‌‌వేర్ అప్డేట్స్ కూడా హైవీ సైజ్లో ఉండటంతో ఫోన్ స్టోరేజ్ స్పేస్ పై ఎక్కువుగా ప్రభావం పడుతోంది.

Read More : ఈ వారం విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ గ్యాలరీలోనే సేవ్ అవుతుంటాయి

వాట్సాప్‌లో షేర్ కాబడే ఫోటోలు, వీడియోలు ఇంకా GIFs ఫోన్ గ్యాలరీలోనే సేవ్ అవుతుంటాయి. ఈ విధంగా ఫోన్ స్టోరేజ్ స్సేస్‌ను వాట్సాప్ కంటెంట్ ఆక్రమించేస్తోంది.

జంక్ ఫోటోలను క్లియర్ చేసుకోవటం ద్వారా

ఫోన్ గ్యాలరీలోని డూప్లికేట్ ఫోటోలతో పాటు జంక్ ఫోటోలను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం ద్వారా ఫోన్ స్టోరేజ్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

జంక్ ఫైల్స్ బెడద నిమిషాల్లో తొలగిపోవాలంటే..

గ్యాలరీలో జంక్ ఫైల్స్‌ను వెతికిపట్టుకోవటమనేది అంత సాధ్యం కాదు. ఈ పనిచేయలంటే బోలెడంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని ఉపయుక్తమైన యాప్స్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా జంక్ ఫైల్స్ బెడద నిమిషాల్లో తొలగిపోతుంది. ఆ పక్రియను ఇప్పుడు చూద్దాం..

Siftr Magic Cleaner

ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ‘Siftr Magic Cleaner' అనే యాప్‌ను మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత యాప్‌ను లాంచ్ చేసి, మీ గ్యాలరీలోని ఫోటోలను యాక్సెస్ చేసుకునేందుకు యాక్సెస్ ఇవ్వండి. ఈ యాప్ ఒక్క వాట్సాప్ జంక్ ఫోటోలను మాత్రమే కాదు ఇతర ఫోల్డర్‌లలోని జంక్ ఫోటోలను కూడా క్లియర్ చేస్తుంది.

ఎన్ని జంక్ ఫోటోలు ఉన్నాయన్నది తెలిసిపోతుంది

వాట్సాప్ గ్యాలరీలోకి యాప్ ప్రవేశించేందుకు అనుమతిని మంజూరు చేసిన వెంటనే కొత్త విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మీ వాట్సప్ ఫోల్డర్లోని ఫోటోల సంఖ్య డిస్‌ప్లే కాబడుతుంది. Analyze ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా వాటిలో వాటిలో ఎన్ని జంక్ ఫోటోలు ఉన్నాయన్నది తెలిసిపోతుంది. వాటిని సెలక్ట్ చేసుకుని డిలీట్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే జంక్ ఫోటోలు నిమిషాల వ్యవధిలో డిలీట్ కాబడతాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to delete the junk photos in your Whatsapp folder. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot