Gmail ఇన్‌బాక్స్‌లో అన‌వ‌స‌ర mails ఎక్కువ‌య్యాయా.. తొల‌గించండిలా!

|

ఇటీవ‌లి కాలంలో ఏ అప్లికేష‌న్ పెట్టుకోవాల‌న్నా.. ఏ డాక్యూమెంట్‌ను ఇత‌రుల‌కు పంపాల‌న్నా మెయిల్ సేవ‌ల్ని ఉప‌యోగిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌తిఒక్క‌రూ Gmail ఖాతాను క‌లిగి ఉన్నార‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు. అయితే, ఈ మెయిల్ స‌ర్వీసులు అందరికీ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత హార్డ్ కాపీల వినియోగం చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది. ఏ చిన్న డాక్యూమెంట్ ను కూడా యూజ‌ర్లు Gmail ఆధారంగా ఇత‌రుల‌కు పంపుకుంటున్నారు.

 
Gmail

అయితే, ర‌క‌ర‌కాల కంపెనీలు, విభిన్న వ్య‌క్తుల నుంచి వ‌చ్చే మెయిల్స్ కార‌ణంగా చాలా మంది Gmail ఇన్‌బాక్స్ నిండిపోతుంది. అందులో కొన్ని ముఖ్య‌మైన‌వి ఉంటాయి.. మ‌రికొన్ని వారికి అన‌వ‌స‌ర‌మైన‌వి కూడా వ‌చ్చి ఇన్‌బాక్స్‌లో చేరుతుంటాయి. అయితే, Gmail లో అన‌వ‌స‌ర ఇమెయిల్‌లను పెద్దమొత్తంలో తొలగించడానికి మ‌నం అనేక ప‌ద్ద‌తుల‌ను ఉప‌యోగించి పూర్తి చేయ‌వ‌చ్చు. ఒకేసారి పెద్ద‌మొత్తంలో అన‌వ‌స‌ర ఈమెయిల్‌లను ఎలా తొలగించాలో అనే విష‌యాన్ని మేం ఇక్క‌డ అందిస్తున్నాం. మీరు కూడా తెలుసుకోవాల‌నుకుంటే దీన్ని పూర్తిగా చ‌ద‌వండి.

 

స్పామ్ ఇమెయిల్‌ను ఎలా తొలగించాలి:
మీ Gmail ఖాతాలో నిండిపోయిన స్పామ్ మెయిల్స్‌ను తొల‌గించేందుకు ఈ విధానాన్ని పాటించండి. ముందుగా మనం Gmailని తెరవాలి. ఆ తర్వాత స్పామ్ ఈమెయిల్స్ సెక్ష‌న్‌లోకి వెళ్లాలి. అనంత‌రం చెక్ బాక్స్ ఆప్షన్ పై టిక్ మార్క్ క్లిక్ చేసి డిలీట్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఈమెయిల్ లో ఉన్న అన్ని స్పామ్ మెయిల్స్ డిలీట్ అవుతాయి.

నిర్దిష్ట గ్రూప్ నుండి వ‌చ్చిన ఈమెయిల్స్‌ను ఎలా తొలగించాలి:
ముందుగా Gmail ఓపెన్ చేయాలి. ఆ త‌ర్వాత మీరు ఎవ‌రి నుంచి వ‌చ్చిన మెయిల్స్‌ను అయితే తొలగించాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ వర్గాన్ని ఎంచుకోండి. ఇప్పుడు చెక్ బాక్స్ ఎంపికపై క్లిక్ చేయండి. ఆ తర్వాత డిలీట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ స్పామ్ ఇమెయిల్ తొలగించబడుతుంది.

Gmail

అన్ని మెయిల్స్ ఒకే సారి డెలీట్ చేయ‌డం ఎలా!
మీ Gmail అకౌంట్లో ఉన్న అన్ని మెయిల్స్‌ను డెలీట్ చేయాల‌ని అనుకుంటే ఈ ప‌ద్ద‌తి పాటించండి. ముందుగా జీమెయిల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ కింద ఉన్న చెక్ బాక్స్‌ను క్లిక్ చేయాలి. అందులో ఆల్ అనే ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి. అప్పుడు మీకు కింద ఓ నోటిఫికేష‌న్ క‌నిపిస్తుంది. "సెల‌క్ట్ ఆల్ కన్వ‌ర్జేష‌న్స్ ఇన్ ప్రైమ‌రీ ఇన్‌బాక్స్" అని నోటిఫికేష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి. త‌ద్వారా మీ మెయిల్ లో ఉన్న అన్ని అన్‌రీడ్ మెసేజ్‌లు సెలెక్ట్ అవుతాయి. ఆ త‌ర్వాత డెలీట్ అప్ష‌న్ పై క్లిక్ చేయ‌డం ద్వారా మీరు వాట‌న్నిటినీ డెలీట్ చేయ‌వ‌చ్చు. ఇక మీ ఇన్‌బాక్స్‌లో ఉన్న మెయిల్స్ అన్ని డెలీట్ అయిపోతాయి.

Gmail

అదేవిధంగా, Gmail లో స్పామ్ మెయిల్స్‌ను బ్లాక్ చేయ‌డం ఎలాగో తెలుసుకుందాం!
* ముందుగా Gmail ఓపెన్ చేసి అందులో మీకు వ‌చ్చిన స్పామ్‌ మెయిల్ పైన క్లిక్ చేయాలి.
* మెయిల్‌లోకి వెళ్లిన త‌ర్వాత కుడి వైపు పై భాగంలో More (మ‌రిన్ని) ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి.
* ఆ త‌ర్వాత మ‌న‌కు కొన్ని ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. వాటిలో ఈ మెయిల్ సెండ‌ర్‌ను బ్లాక్ చేయండి అనే ఆప్ష‌న్ కూడా ఉంటుంది.
* ఆ ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవ‌డం ద్వారా ఆ స్పామ్ మెయిల్ సెండర్‌ను మ‌నం బ్లాక్ చేసిన‌ట్ల‌వుతుంది. ఇక నుంచి ఆ సెండ‌ర్ నుంచి మ‌న‌కు స్పామ్ మెయిల్స్ వ‌చ్చే అవ‌కాశం ఉండ‌దు.

ఒక‌వేళ‌, మీరు పొరపాటున ఎవరినైనా అవ‌స‌రం ఉన్న వ్య‌క్తుల్ని బ్లాక్ చేస్తే, అదే ప‌ద్దతిని అనుసరించడం ద్వారా మీరు వారిని అన్‌బ్లాక్ ఆప్ష‌న్ సాయంతో అన్‌బ్లాక్ చేయ‌వచ్చు.

Gmail లో అన‌వ‌స‌ర ఈ-మెయిల్స్‌ను అన్‌స‌బ్‌స్క్రైబ్ చేసుకోండిలా:
* ముందుగా Gmail ఓపెన్ చేయాలి.
* ఇన్‌బాక్స్‌లో మీరు ఏ సెండ‌ర్‌ను అయితే అన్‌స‌బ్‌స్క్రైబ్ చేయాల‌నుకుంటున్నారో.. ఆ మెయిల్‌ను ఓపెన్ చేయాలి.
* మెయిల్ పై భాగంలో సెండ‌ర్ పేరు ప‌క్క‌న అన్‌స‌బ్‌స్క్రైబ్ లేదా చేంజ్ ప్రిఫ‌రెన్స్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి.
* ఇలా చేయ‌డం ద్వారా కొద్ది రోజుల‌కు ఆ సెండ‌ర్‌పై మీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ర‌ద్దు ప్ర‌క్రియ విజ‌య‌వంతం అవుతుంది.

Best Mobiles in India

English summary
How To Delete Unwanted Email From Gmail, Know The Whole Process Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X