ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటం ఎలా..?
ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవటం మంచి పద్ధతి.
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‍బుక్ మన సెర్చ్ హిస్టరీని సేవ్ చేసి ఓ క్రమ పద్ధితిలో డేటా బేస్‌ను క్రియేట్ చేస్తుంది. సేవ్ చేయబడిన సెర్చ్ హిస్టరీ ద్వారా కంటెంట్‌ను సలువుగా శోధించేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే, ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవటం కూడా ఓ మంచి పద్దతే. ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసేందుకు ముఖ్యమైన గైడ్‌లైన్స్...
Read More : ఇక డైమెండ్ డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్‌లు

స్టెప్ 1
ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. హోమ్ పేజీ టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే down arrow పై క్లిక్ చేసినట్లయితే ఓ డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులోని Activity Log ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 2
Activity Log ఆప్షన్‌ను పై క్లిక్ చేసిన వెంటనే వివిధ ఆప్షన్‌లతో కూడిన ఓ జాబితా స్ర్కీన్ ఎడమ వైపు కనిపిస్తుంది. ఈ జాబితా లిస్ట్ ను మరింతగా expand చేసేందుకు More పై క్లిక చేయండి. ఇప్పుడు కనిపించే జాబితా లిస్ట్‌లో Search ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 3
Search ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీరు సెర్చ్ చేసిన అంశాలకు సంబంధించిన జాబితా ఓపెన్ అవుతుంది. వాటిలో మీరు డిలీట్ చేయాలనుకుంటున్న సెర్చ్ ను ఎంపిక చేసుకని ఆ సెర్చ్ కు సంబంధింకి బ్లాక్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే డిలీట్ ఆప్షన్ మీకు కినిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీరు తొలగించాలనుకుంటున్న సెర్చ్ డిలీట్ కాబడుతుంది.

స్టెప్ 4
మొత్తం సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయాలనుకుంటే పేజీ టాప్‌లో కనిపించే Clear Search link పై క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే మొత్తం సెర్చ్ హిస్టరీ డిలీట్ కాబడుతుంది.


Click it and Unblock the Notifications