గూగుల్ అకౌంట్‌ను డిలీట్ చేయటం ఎలా..?

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను యూజ్ చేసే ప్రతిఒక్కరి దగ్గర గూగుల్ అకౌంట్ అనేది కామన్‌గా ఉంటుంది. ఈ అకౌంట్ అనేది లేకపోయినట్లయితే ఆండ్రాయిడ్ ఫీచర్లను వినియోగించుకోవటం దాదాపుగా కష్టతరంగా మారిపోతుంది. గూగుల్ అకౌంట్ ద్వారా లభించే సర్వీసులు ఉపయుక్తంగానే ఉన్నప్పటికి ఇవి యూజర్ వ్యక్తిగత డేటాను ట్రాక్ చేసే అవకాశముంది.

 
గూగుల్ అకౌంట్‌ను డిలీట్ చేయటం ఎలా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ట్రాక్ చేయబడిన డేటా నేరుగా గూగుల్‌కు చేరుతుంది. ఈ నేపథ్యంలో గూగుల్ అకౌంట్‌ను తొలగించేందుకు ఇది సరైన సమయమని మీరు భావిస్తున్నట్లయితే ఈ క్రింది స్టెప్ప్ ఫోలో అవ్వండి..

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా accounts.google.comలోకి వెళ్లండి.

స్టెప్ 2

అక్కడ మీ గూగుల్ అకౌంట్ వివరాలను ఎంటర్ చేసి సైన్‌ఇన్ బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3

స్టెప్ 3

అకౌంట్ పేజీ ఓపెన్ అయిన తరువాత Account Preferencesలోకి వెళ్లి Delete your account or services ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 4

తరువాత వచ్చే స్ర్కీన్‌లో Delete Google Account and data అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసేకోవల్సి ఉంటుంది.

స్టెప్ 5 :
 

స్టెప్ 5 :

పై ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్న తరువాత మీ గూగుల్ అకౌంట్‌కు సంబంధించిన యూజర్ నేమ్ అలానే పాస్‌వర్డ్‌ను గూగుల్ మరోసారి అడుగుతుంది.

స్టెప్ 6 :

ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే అకౌంట్ డిలీషన్‌కు సంబంధించి ఓ ఈ-మెయిల్ కన్ఫర్మేషన్ లింక్ మీకందుతుంది.

స్టెప్ 7 :

ఈ లింక్ పై క్లిక్ చేసిన వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.

డిలీట్ చేసిన అకౌంట్‌ను ఒకవేళ మీరు తిరిగి రికవర్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే లోకి వెళ్లి పాత జీమెయిల్ ఐడీని ఎంటర్ చేయండి. రికవరీ సాధ్యమైనట్లయితే గూగుల్ మీ పాత అకౌంట్ తాలుకా బ్యాకప్ అడ్రస్‌ను ఈమెయిల్ ద్వారా మీకు పంపుతుంది.

బెస్ట్ EMI ఆఫర్స్‌లో లభిస్తున్న టాప్ హైఎండ్ స్మార్ట్‌ఫోన్లు ఇవేబెస్ట్ EMI ఆఫర్స్‌లో లభిస్తున్న టాప్ హైఎండ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

Best Mobiles in India

Read more about:
English summary
Google knows too much about you, has been spying on your browsing history for too long, and exerts an unhealthy level of influence over the apps you use every day.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X