Zoom యాప్ అకౌంటును పూర్తిగా డెలిట్ చేయడం ఎలా?

|

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా అనేక దేశాలలో ఇప్పుడు లాక్ డౌన్ అమలులో ఉంది. ఈ లాక్ డౌన్ కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయవలసినదిగా ఆదేశాలను జారీ చేసాయి. ఇటువంటి సమయంలో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ లు మునుపెన్నడూ లేని విధంగా అధికంగా ప్రజాదరణను పొందాయి.

How to Delete Zoom Account in Telugu

గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్లలో ఉచితంగా లభించే జూమ్ యాప్ కు ఇప్పుడు మరింత ఆదరణ పెరిగింది. ఈ యాప్ ను వాడుతున్న వినియోగదారులు దీని యొక్క భద్రత మరియు గోప్యతకు సంబంధించి అనేక ఆందోళనలు చెందుతున్నారు. ఇండియా యొక్క జాతీయ సైబర్ భద్రతా సంస్థ CERT-In గత వారం యాప్ యొక్క సైబర్ దుర్బలత్వానికి వ్యతిరేకంగా హెచ్చరించింది.

How to Delete Zoom Account in Telugu

సైబర్ నేరస్థులకు సున్నితమైన సమాచారం లీకేజీతో సహా, డిజిటల్ అప్లికేషన్ సైబర్ దాడులకు గురవుతుందని ఇది తెలిపింది. ఈ సైబర్ భద్రతా సమస్యల కారణంగా చాలా మంది నిపుణులు యాప్ ను ఉపయోగించవద్దని సలహా ఇస్తున్నారు. మీరు మీ జూమ్ యాప్ యొక్క అకౌంటును తొలగించాలని చూస్తున్నట్లయితే కింద ఉన్న దశల వారీ గైడ్ ను అనుసరించండి.

How to Delete Zoom Account in Telugu

Zoom అకౌంటును పూర్తిగా డెలిట్ చేసే దశలు

*** అన్నిటికంటే ముందుగా Zoom.US వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

*** తరువాత మీ యొక్క జూమ్ అకౌంటుతో లాగిన్ అయి, ఎడమవైపు ఎగువన ఉన్న 'మై అకౌంట్' అనే టాబ్ మీద క్లిక్ చేయండి.

*** క్రిందికి స్క్రోల్ చేసి 'అడ్మిన్' టాబ్ కోసం చూడండి.

*** 'అడ్మిన్' టాబ్‌పై క్లిక్ చేసి, డ్రాప్ డౌన్ మెనులో 'అకౌంట్ మేనేజ్‌మెంట్' మీద క్లిక్ చేయండి.

*** ఇప్పుడు 'అకౌంట్ ప్రొఫైల్' మీద క్లిక్ చేయండి. ఇది ఎడమ వైపున బేసిక్ ఇన్ఫర్మేషన్ పేజీని ఓపెన్ చేస్తుంది.

*** ఇప్పుడు 'టెర్మినేట్ మై అకౌంట్' మీద క్లిక్ చేయండి.

*** మీ జూమ్ అకౌంటును తొలగించడానికి కంఫర్మ్ మీద నొక్కండి.

Best Mobiles in India

English summary
How to Delete Zoom Account in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X