ఈ టిప్స్ ఫాలో అయితే నకిలీ యాప్స్ కి దూరంగా ఉండొచ్చు !
మన చేతిలో ఆండ్రాయిగ్ ఫోన్ ఉంటే చాలు గూగుల్ ప్లో స్టోర్‌లో కెళ్లి రకరకాల యాప్స్ డౌన్‌లోడ్ చేస్తుంటాం. Google Play Store నుండి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని చాలామంది అపోహపడుతుంటారు.
మన చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు గూగుల్ ప్లో స్టోర్‌లో కెళ్లి రకరకాల యాప్స్ డౌన్‌లోడ్ చేస్తుంటాం. Google Play Store నుండి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని చాలామంది అపోహపడుతుంటారు. వాస్తవానికి ప్లే స్టోర్ లో కూడా ప్రమాదకరమైన అనేక ఫేక్ యాప్స్ చలామణి అవుతున్నాయి.బాగా పేరున్నయాప్స్ క్లోన్‌గా ఇవి కనిపిస్తుంటాయి.ఈ నేపథ్యంలో చాలామంది ఒరిజినల్ యాప్స్ కి బదులుగా ఫేక్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రమాదం బారిన పడుతుంటారు. ఒకసారి నకిలీ యాప్స్ మన ఫోన్ లోకి వచ్చిన తరువాత మనకు తెలియకుండానే అదనంగా కమాండ్ కంట్రోల్ సర్వర్ నుండి .apkలను డౌన్లోడ్ చేయడం, ఇతర ప్రమాదకరమైన స్క్రిప్టులను రన్ చేస్తుంటాయి. ఈ శీర్షిక లో భాగంగా ఫేక్ యాప్స్ కి దూరంగా ఉండాలంటే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు మీకు తెలుపుతున్నాము. ఓ లుక్కేయండి

డిస్క్రిప్షన్ రాసే విధానంలో....
నకిలీ యాప్స్ డిస్క్రిప్షన్ రాసే విధానంలో చాలా లోపాలు ఉంటాయి. స్పెల్లింగ్ లోపాలు, ఫీచర్ల గురించి సరైన వివరణ లేకపోవడం, గ్రామర్ పరంగా కూడా లోపాలను వెతికి పట్టుకోవచ్చు. దాన్నిబట్టే అది ఫేక్ యాప్స్ అన్న విషయం సులభంగా గ్రహించవచ్చు.

రివ్యూలు చదవండి.....
Google Play Storeలో పొందుపరచబడే ప్రతి అప్లికేషన్ కింద అప్పటికే దాన్ని వాడిన వారు రివ్యూలు రాస్తారు అన్న విషయం తెలిసిందే కదా. ఒక యాప్ ఇన్స్టాల్ చేయబోయే ముందు కొద్దిగా ఓపిక చేసుకుని ఆయా రివ్యూలను చదవండి. దీనివల్ల మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటుంది జెన్యూన్ అప్లికేషనా, ఫేక్ యాప్ అన్న విషయం సులభంగా అర్థమవుతుంది.

డెవలపర్ గురించి.....
సహజంగా గూగుల్ ప్లేస్టోర్ లో అప్లోడ్ చేయబడే ప్రతి యాప్ ను ను ఎవరు డెవలప్ చేశారు అన్న విషయం డెవలపర్ పేరు స్పష్టంగా పేర్కొనబడి ఉంటుంది. ఆ పేరుని గూగుల్‌లో వెదికి ఆ డెవలపర్‌కి చెందిన అధికారిక వెబ్సైట్ పరిశీలించడం ద్వారా పేరున్న డెవలపరా లేదా అన్న విషయం అర్థం చేసుకోవచ్చు.

డౌన్లోడ్ లను బట్టి.....
నకిలీ యాప్స్ ను ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకోరు. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉంటారు. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న యాప్ మొట్టమొదటి వెర్షన్ విడుదల చేసిన తేదీ కూడా చాలా కాలం క్రితం ఉండీ, అయినప్పటికీ ఎక్కువ డౌన్లోడ్లు లేకపోతే కచ్చితంగా అనుమానించాల్సి ఉంటుంది.

రేటింగ్ ద్వారా.....
ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలంటే ప్లేస్టోర్‌కి వెళ్లి డౌన్‌లోడ్ చేస్తాం. అయితే ఆ యాప్‌కు కొందరు వ్యక్తులు ఇచ్చిన రేటింగ్ ద్వారా అది అసలో లేదా నకిలీయో ఇట్టే గుర్తు పట్టవచ్చు. రివ్యూస్‌లో ఇచ్చిన సమాచారంతో యాప్ నకిలీయో లేదా ఒరిజినల్‌లో గుర్తు పట్టేయ్యవచ్చు.


Click it and Unblock the Notifications








