iOS 11 నుంచి iOS 10కి డౌన్‌గ్రేడ్ అవ్వటం ఎలా..?

|

ఐఫోన్ యూజర్ల కోసం యాపిల్ సంస్థ ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన iOS 11 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఊహించిన స్థాయిలో అంచనాలను అందుకోలేక పోయింది. ముఖ్యంగా ఐఫోన్ 6 యూజర్లు ఈ అప్‌డేట్‌తో తీవ్ర ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. కొత్త సాఫ్ట్‌వేర్‌తో ఫోన్‌ను అప్‌డేట్ చేసుకున్న తరువాత పనితీరు పూర్తిగా నెమ్మదించటంతో వీరు మళ్లీ iOS 10కే డౌన్‌గ్రేడ్ అవ్వాలని చూస్తున్నారు.

 
How to downgrade from iOS 11 to iOS 10 on your Apple device

వారిలో మీరు కూడా ఒకరైనట్లయితే ఈ ఆర్టికల్ మీకు మరింతగా ఉపయోగపడుతుంది. iOS 11 నుంచి iOS 10కి డౌన్‌గ్రేడ్ అయ్యే ప్రొసీజర్‌ను స్టెప్ బై స్టెప్ ఫార్మాట్‌లో క్రింద పోస్ట్ చేయటం జరుగుతోంది.

 

iOS 11 నుంచి iOS 10కి డౌన్‌గ్రేడ్ అవ్వాలనుకుంటున్నవారు ముందుగా తమ ఐఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేసేుకోవల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఫోన్‌లోని డేటాని కూడా బ్యాకప్ చేసుకోవటం ఉత్తమం. డౌన్‌గ్రేడింగ్ ప్రాసెస్ పూర్తవ్వటానికి దాదాపుగా 40 నిమిషాల సమయంలో తీసుకుంటుంది. ఈ సమయంలో ఒర్పు అనేది అవసరం.

స్టెప్ 1 :

ముందుగా మీ ఐఫోన్‌లోని ఐట్యూన్స్ అప్లికేషన్ లేటెస్ట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ అయి ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేనట్లయితే iTunes > Account > Check ఆప్షన్‌లోకి వెళ్లి లేటెస్ట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి.

స్టెప్ 2 :

ఆ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిన తరువాత iOS 10.3.3 IPSW అనే ఫైల్‌ను ఈ లింక్ నుంచి (http://osxdaily.com/2017/07/19/ios-10-3-3-download-update-ipsw/) మీ ఐఫోన్ నిమిత్తం ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్ 3 :

ఫైల్‌ డౌన్‌లోడింగ్ పూర్తి అయిన తరువాత మీ ఐఫోన్‌లోని Find My iPhone ఆప్షన్‌ను టర్నాఫ్ చేసుసకోవల్సి ఉంటుంది. ఇలా చేసేందుకు Settings -> Your Name -> iCloud -> Find My iPhone ఆప్షన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ ఆఫ్ అయిన తరువాత మీ ఫోన్‌ను iOS 10.3.3 IPSW ఫైల్ డౌన్‌లోడ్ అయి ఉన్న కంపయూటర్ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేయండి.

స్టెప్ 4 :

కంప్యూటర్‌కు కనెక్ట్ అయిన తరువాత మీ ఐఫోన్‌ను DFU మోడ్‌లో ఉంచాల్సి ఉంటుంది. ఈ మోడ్ ఆన్ అవ్వాలంటే కంప్యూటర్ స్ర్కీన్ పై మీ ఫోన్ రకవరీ మోడ్‌లో ఉందన్న మెసేజ్ కనిపించేత వరకు ఫోన్ పవర్ బటన్‌ను హోల్డ్ చేసి ఉంచాల్సి ఉంటుంది.

ఐఫోన్ 7 ఆపై వర్షన్ ఐఫోన్ మోడల్‌ను వినియోగించుకుంటోన్న యూజర్లు పవర్ బటన్‌కు బదులుగా వాల్యుమ్ డౌన్ బటన్‌ను హోల్డ్ చేసి ఉంచినట్లయతే ఓ ఐట్యూన్స్ మెసేజ్ కంప్యూటర్ స్ర్కీన్ పై ఓపెన్ అవుతుంది. ఆ మెసెజ్‌లోని OK ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే రిస్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది.

స్టెప్ 5 :

ఇప్పుడు మీ విండోస్ ల్యాప్‌టాప్ కీబోర్డ్‌లోని షిఫ్ట్ బటన్‌ను హోల్డ్ డౌన్ చేసి అదే సమయంలో స్ర్కీన్ పై కనిపించే "Restore iPhone" ఆప్షన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది. ఇప్పుడు ముందుగానే డౌన్‌లోడ్ చేసి ఉంచుకున్న IPSW ఫైల్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీ డివైస్ iOS 11 నుంచి iOS 10కి డౌన్‌గ్రేడ్ కాబడుతుంది.

ప్రైవసీకి ప్రమాదంగా మారిన మొబైల్ కీ బోర్డ్స్..విముక్తి ఎలా?ప్రైవసీకి ప్రమాదంగా మారిన మొబైల్ కీ బోర్డ్స్..విముక్తి ఎలా?

Best Mobiles in India

Read more about:
English summary
While most of are excited about updating their iPhones to iOS 11, some actually might not. For some iOS users who still own devices like iPhone 6, iOS 11 tends to cause more trouble than it solves the problem.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X