PUBG మొబైల్ 1.4 APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయడం ఎలా?
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే బాటిల్ రాయల్ గేమ్ అయిన PUBG మొబైల్‌ను గత ఏడాది భారతదేశంలో నిషేధించారు. అప్పటి నుండి భారతీయ వినియోగదారులు దాని APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటుగా వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) సహాయంతో గేమ్ ప్యాకేజీ విషయాలను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా గేమ్ ను ఆడుతున్నారు.
PUBG మొబైల్ తన యొక్క వినియోగదారులకు తాజాగా వెర్షన్ 1.4 ను విడుదల చేసింది. PUBG మొబైల్‌ను నిషేధించిన దేశాలలో మీరు ఉంటే కనుక మరియు గేమ్ యొక్క APK ఫైల్ ఎలా పనిచేస్తుందో మీరు ప్రయత్నించాలనుకుంటే కనుక ఇప్పుడు దాన్ని మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయవచ్చు. PUBG మొబైల్ యొక్క 1.4 APK ఫైల్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

PUBG మొబైల్ 1.4 వెర్షన్ గొప్పదనం
PUBG మొబైల్ గేమ్ యొక్క 1.4 వెర్షన్ అనేది గాడ్జిల్లా vs కాంగ్ యొక్క ప్రత్యేకమైన థీమ్‌తో వస్తుంది. ఇందులో వినియోగదారులు కొత్త వాహనంతో పాటుగా కొత్త షూటింగ్ మోడ్‌లకు మరిన్ని మార్పులకు సాక్ష్యమిస్తారు. 2021 మే 16 లోపు గేమ్ ను డౌన్‌లోడ్ చేసే ఆటగాళ్లకు బహుమతులు కూడా ఉన్నాయి. కొత్త రాయల్ పాస్ సీజన్ మే 17 న ప్రారంభం కానుంది.
PUBG మొబైల్ 1.4 APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసే విధానం

PUBG మొబైల్ 1.4 APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసే ప్రక్రియలో భాగంగా ఫైల్ యొక్క పరిమాణం 661MB గా ఉంటుంది. అయితే మీరు గేమ్ ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత గేమ్ లో మరిన్ని డౌన్‌లోడ్‌లు చేసుకోవలసి ఉంటుంది. గేమ్ యొక్క తాజా సంస్కరణను డౌన్‌లోడ్ చేకువడానికి కింద ఉన్న పద్దతులను అనుసరించండి.
స్టెప్ 1 - మొదట మీరు "PUBGMOBILE Global 1.4.0 uawebsite" లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ ఫోన్లో మీకు తగినంత స్టోరేజ్ ఉందని నిర్ధారించుకోండి. తగిన స్టోరేజ్ లేకపోతే కనుక మీ ఫోన్ నుండి PUBG మొబైల్ యొక్క మునుపటి ఫైళ్ళను క్లియర్ కూడా చేయవచ్చు.
స్టెప్ 2 - APK ఫైల్ డౌన్‌లోడ్ అయిన తర్వాత తెలియని మూలాల నుండి ఇంస్టాల్ కోసం మీ ఫోన్ కు అనుమతి ఇవ్వడం ద్వారా మీరు దీన్ని ఇన్‌స్టాల్ చేయాలి. అలా చేయడానికి "అన్ నోన్ సోర్స్ నుండి ఇన్‌స్టాల్ చేయి" ని అనుమతించండి.
స్టెప్ 3 - గేమ్ ఇన్‌స్టాల్ చేయబడిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి మీరు ఇన్‌స్టాల్ చేయదలిచిన రిసోర్స్ ప్యాక్‌ని ఎంచుకోవచ్చు. అలాగే గేమ్ నుండి అత్యధిక-నాణ్యత అనుభవాన్ని పొందడానికి HD రిసోర్స్ ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేయండి. ఇందుకోసం కూడా మీ ఫోన్ లో తగినంత స్టోరేజ్ ఉందని నిర్ధారించుకోండి.
గేమ్-డౌన్‌లోడ్ పని చేయకపోతే కనుక మీరు VPN ను ఉపయోగించాల్సి ఉంటుందని గమనించండి. ఇంకా మీ VPN స్విచ్ ఆన్ చేసి గేమ్ ఆడకుండా ఉండండి. రిసోర్స్ ప్యాక్‌లు మరియు మ్యాప్‌లను డౌన్‌లోడ్ చేయడానికి మాత్రమే VPN ని ఉపయోగించండి.


Click it and Unblock the Notifications








